RajakeeyaaluRajakeeyaalu

Wednesday, January 24, 2018

అనుభవం కాదు… ఆచరణ ముఖ్యమని రుజువు చేసిన కేజ్రీవాల్…

  • January 11, 2017 | UPDATED 12:05 IST Views: 686
  • Share

 

సుపరిపాలన అందించాలంటే చిత్తశుద్ధి ఉండాలి… ప్రజల పట్ల అమితమైన ప్రేమ ఉండాలి కానీ అనుభవం కాదని నిరూపించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అంతపెద్ద మోడీ గుండెల మీద గుద్ది మరీ ఢిల్లీ గద్దెనెక్కిన కేజ్రీవాల్ ఒక క్లారిటీతో ఢిల్లీ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కేంద్రం నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా… తనని తన మంత్రి వర్గ సహచరులను వెంటాడి వేటాడి వేధిస్తున్నా… ఢిల్లీ రాష్ట్రాన్ని చక్కదిద్దే పనిలో మాత్రం ఆయన ఎక్కడా ఏ దశలోనూ రాజీ పడటం లేదన్నది రెండున్నరేళ్లుగా ఆయన చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రుజువు చేస్తున్నాయి. ఢిల్లీ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు మౌలిక వసతుల కల్పన, కాలుష్యరహిత వాతావరణాన్ని పాదుకొల్పడం దగ్గర నుంచి సౌకర్యవంతమైన రవాణా వ్యవస్ధను ఏర్పరచడం వరకూ ప్రతి చిన్న విషయంలో కేజ్రీవాల్ చూపిస్తున్న చొరవ ఒక నూతన రాజకీయ ఆలోచనా విధానాన్ని ఆవిష్కరిస్తోంది. ఓ పక్కన కేంద్రంతో పోరాడుతూనే తాను అనుకున్నది నిర్ధ్వందంగా అమలు చేస్తున్న కేజ్రీవాల్ ఢిల్లీ రాష్ట్రంలో చాలా మార్పులే తీసుకువచ్చారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తన వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలని ప్రత్యర్ధులు చేస్తున్న వికృత ప్రచారాన్ని ఖాతరు చెయ్యకుండా ఓ ఆదర్శవంతమైన పరిపాలకుడిగా… విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా సరికొత్త రాజకీయాలను ఢిల్లీ వేదికగా దేశ ప్రజలకు పరిచయం చేస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్.

delhi3

        విఐపిల తాకిడి ఢిల్లీకి ఎక్కువ. దాదాపు ఢిల్లీ జనాభాలో పావు వంతు మంది తమ కార్లకు ఎర్రదో, నీలంతో బుగ్గ పెట్టుకోకుండా మాత్రం ఉండరు. ఇలా ప్రొటోకాల్ బల్బులతో ఢిల్లీ ట్రాఫిక్ లో తిరుగుతున్న వేలాది వాహనాల కారణంగా విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమయ్యేవి. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన తరువాత వాహనాలపైన బుగ్గలు పెట్టుకు తిరగడాన్ని నిషేధించారు. ఈ చర్య ఢిల్లీ సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో కేజ్రీవాల్ క్రేజ్ ను మరింత పెంచింది. అలాగే మంచినీటితో కటకటలాడుతున్న ఢిల్లీ దాహార్తిని తీర్చడంలో కూడా కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం అక్కడి ప్రజల మనన్నలు పొందింది. నల్లా కనెక్షన్ ఉన్న ప్రతి ఇంటికీ నెలకి ఇరవై వేల లీటర్ల నీటిని ఉచితంగా అందిస్తున్నారు కేజ్రీవాల్. అంతే కాకుండా ఢిల్లీ జల్ బోర్డులో ఎప్పటి నుంచో పాతుకుపోయినా 800 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు జల్ బోర్డ్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అవినీతి నిరోధానికి 1031 టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ ను ఏర్పాటు చేశారు. నర్సరీలో చేర్చుకోవడానకి కూడా లక్షల రూపాయల డొనేషన్లు వసూలు చేస్తున్న స్కూళ్ల భరతం పట్టడానికి హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. 500 ప్రభుత్వ పాఠశాలలను స్వయంగా తనిఖీ చేసి అక్కడ సౌకర్యాలు మెరుగుపరచడంలో చర్యలు తీసుకున్నారు. దాదాపు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 36వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసారు. ఢిల్లీలో లిక్కర్ మాఫియాపై చేసిన పోరాటంలో అమరుడైన ఓ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల అవార్డు ఇచ్చారు. ఢిల్లీలో ఇళ్లు లేని నిరుపేదలు, పురవీధుల్లో ప్లాట్ ఫారాలపై పడుకునే అభాగ్యుల కోసం దాదాపు మూడు వందల నైట్ షెల్టర్స్ ని నిర్మించారు.

delhi1delhi2

        ఇలా అదీ ఇదని కాదు ఢిల్లీ ప్రజలకు అవసరమైన ప్రతి పని పూర్తి చేయడానికి ముందుంటున్నారు కేజ్రీవాల్. అలాగే ప్రజలకు కష్టం కలిగించే వాటిపైనా దృష్టి పెట్టి అవి తొలగించే ప్రయత్నం చేశారు. ఎటువంటి సంకోచం లేకుండా పాత డీజిల్ వాహనాల వాడకాన్ని రద్దు చేశారు దీని వల్ల ఉన్నత వర్గాల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గలేదు. అలాగే వాహనాల వాడకం విషయంలో కూడా సరి, బేసి సంఖ్యల ఫార్మూలా తీసుకువచ్చి ట్రాఫిక్ తగ్గించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ తెలివితక్కువ నిర్ణయాలు అని విమర్శించిన వాళ్లే ఇప్పుడు పొగుడుతున్నారు. విద్యుత్ వాడకంలో పొదుపును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాలుగొందల యూనిట్లలోపు విద్యుత్ వాడితే యాభై శాతం సబ్సిడీ ఇవ్వాలని అధికారం చేపట్టిన వెంటనే జిఓ జారీ చేశారు. అయితే ఢిల్లీని వైఫై నగరంగా మారుస్తాన్న హామీ మాత్రం కేజ్రీవాల్ నిలబెట్టుకోలేదు. ఇప్పటి వరకూ ఆ దిశగా తీసుకున్న చర్యలు పెద్దగా లేవనే చెప్పాలి. అలాగే 55వేల ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేస్తానన్న హామీ విషయంలో కూడా ముందడుగు పడలేదు. భద్రత కోసం ఢిల్లీ నగరం మొత్తం పది లక్షల సిసి టీవిలు ఏర్పాటు చేస్తానన్న హామీ కూడా అమలుకు నోచుకోలేదు.

delhi4delhi5

ఇదే సమయంలో వివాదాలకు కూడా కేజ్రీవాల్ ఆయన ప్రభుత్వం అతీతమేమీ కాదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలోనే ఆప్ లో సీనియర్ నాయకులైన ప్రశాంత్ భూషణ్, యోగీంద్ర యాదవ్ వంటి నాయకులను పార్టీ నుంచి తొలగించడం ద్వారా పరస్పర ఆరోపణలు చేసుకుని హెడ్ లైన్స్ కి ఎక్కారు. అలాగే రైతు సమస్యలపై ఆప్ తీసిన ర్యాలీలో గజేంద్ర సింగ్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్న తరువాత కూడా ర్యాలీని కొనసాగించి విమర్శల పాలయ్యారు కేజ్రీవాల్. ఆ తరువాత తప్పుని ఒప్పుకున్నప్పటికీ ఆ సంఘటన మాత్రం విమర్శలకు గురైంది. ఇక మంత్రివర్గ సహచరులు సోమనాధ్ భారతి గృహ హింస కేసులో ఇరుక్కోగా జితేంద్రసింగ్ తోమర్ నకిలీ డిగ్రీ కలిగిఉన్న కేసులో చిక్కుకున్నారు. మొత్తం మీద చూసుకుంటే కొన్ని వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రెండున్నరేళ్ల పాలన స్థానిక ప్రజలకు ఒకింత సంతృప్తినే మిగిల్చిందనడంలో సందేహం లేదు.

delhi6

ఇక పాలనా పరంగా, రాజకీయంగా కూడా ఎటువంటి అనుభవం లేని కేజ్రీవాల్ ఢిల్లీ గద్దెనెక్కి చెలరేగి పోతుంటే అపార అనుభవం ఉన్న మన రాష్ట్ర నాయకులు మాత్రం ప్రజా సంక్షేమం విషయంలో బొక్కబోర్లా పడుతున్నారు. చరిత్రలో ఇంతవరకూ ఎరుగని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

కేజ్రీవాల్ సాదించిన కొన్ని గొప్ప విజయాలు ఇవే …

a) Removal of red beacons and end of VIP culture
b) Electricity rates reduced by 50% for up to 400 units of consumption
c) 20,000 litres of free water per month per connection
d) 300+ night shelters for the homeless established
e) CAG audit of power discoms ordered
f) In Delhi Jal Board, 800 employees transferred, 3 suspended for corruption
g) Anti-corruption helpline 1031 started
h) Nursery admission helpline started
i) Awarded Rs. 1 crore to family of police constable who died fighting the liquor mafia
j) Inspection of 500+ govt schools by volunteers completed
k) 36000 contract jobs were made permanent which benefited around 1,80,000 people.