RajakeeyaaluRajakeeyaalu

Sunday, September 24, 2017

మనవాడేనా… అయితే కంటిన్యూ…

  • December 10, 2016 | UPDATED 17:31 IST Views: 499
  • Share

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్ధలు కులాల కురుక్షేత్రాలకు వేదికలవుతున్నాయి. పదవుల కోసం వెంపర్లాడుతున్న అధికార సామాజికవర్గం ఇతర కులాల నాయకులు అనుభవిస్తున్న పదవులు ఆక్రమించుకోవడానికి చేస్తున్న దాష్టికాలకు అంతేలేకుండా పోతోంది. ఆంధ్రాలో ఆ సామాజికవర్గ అధికార దాహానికి ఇతర కులాలు విలవిల్లాడిపోతున్నాయి.  2014వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్ధలకు ఎన్నికలు జరిగిన సమయంలో తెలుగుదేశం పార్టీ పరిస్ధితి దయనీయంగా ఉంది. అంతకు రెండు సంవత్సరాల ముందు నుంచి జరుగుతున్న ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా గల్లంతై పార్టీ ఉనికే ప్రమాదంలో పడిన పరిస్ధితుల్లో టిడిపి ఉంది. ఆ సందర్భంలో జగిరిగిన స్ధానికి సంస్ధలకు జరిగిన ఎన్నికల్లో తిమ్మిని బమ్మిని చేసి… పలు రాజీ ఫార్మూలాలు అమలు చేసి సగ కాలం ఒకరు తరువాత సగం కాలం మరొకరు అని మభ్యపెట్టి కొన్ని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను, మండల, జిల్లాపరిషత్ లను కైవశం చేసుకుంది టిడిపి. ఇప్పుడు ఆ మొదటి రెండున్నరేళ్లు గడిచిపోయి గతంలో ఇచ్చన హామీల మేరకు చివరి రెండున్నర సంవత్సరాలకు వేరొక వ్యక్తిని అందలమెక్కించే కాలం వచ్చింది.

వైఎస్ జగన్ దెబ్బకి ఆ పార్టీ కాకవికలమైపోతున్న నేపథ్యంలో వచ్చిన స్థానిక సంస్ధల ఎన్నికల్లో టిడిపి స్ధానిక నాయకత్వం చొరవతో కొన్ని స్థానిక సంస్ధలను ఆ పార్టీ కైవశం చేసుకుంది. కొన్ని స్ధానాల్లో ఎవరికీ మెజార్టీ రాని సందర్భంలో ఆ పార్టీకి అలవాటైన విధానాంలో ఇతర పార్టీల నుంచి గెలుపొందిన సభ్యులను కొనుగోలు చేసి వారికి ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ యు విల్ బి ద కింగ్ అని హామీలు ఇచ్చి కొన్ని మండలాలను, మున్సిపాలిటీలను, జిల్లా పరిషత్ లను కైవశం చేసుకున్నారు. ఒకట్రెండు జడ్పీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సంపూర్ణ మెజార్టీ వచ్చినా 2014లో రాబోయే సార్వత్రిక ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని సామాజికవర్గ తూకాలకు అనుగుణంగా చైర్మన్ ఆశావాహులకు మొదటి రెండున్నరేళ్లు ఒకరు ఆ తరువాత రెండున్నరేళ్లు మరొకరు అన్న రాజీ ఫార్మూలాతో అప్పటికి గండం గట్టెక్కించారు చంద్రబాబు.

అయితే ఇప్పుడు ఇచ్చిన హమీలను నిలబెట్టుకునే తరుణం ఆసన్నమవడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో స్థానిక రాజకీయాలు ఊపందుకున్నాయి. అయితే ఇక్కడ అంతా సజావుగా సాగిపోతోందనుకుంటే పొరపాటే. అధికార సామాజికవర్గం స్థానిక సంస్ధల అధ్యక్ష స్ధానంలో లేని చోట మాత్రం తక్షణం వైదొలగాలని సదలు మండల, జిల్లా పరిషత్ అధ్యక్షులకు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లకు మహాజిర్లు అందుతున్నాయి. వాళ్ల మీద అంతులేని ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక అనేక మందికి గుండెపోట్లు వచ్చి ఆసుపత్రి పాలవుతుంటే ఒకళ్లిద్దరు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. మాచర్ల మున్సిపాలిటి చైర్ పర్సన్ గొపవరపు శ్రీదేవి అత్మహత్యా ఉదంతంతొ ఈ వ్యవహారం వార్తల్లొ కెక్కింది. మచర్ల మున్సిపాలిటీ చైర్మన్ పదవి కోసం టిడిపి తరపున ఎవ్వరూ పోటీ చేయడానికి సిద్దంగా లేకపోతే విదేశాల నుంచి శ్రీదేవి కుటుంబాన్ని రప్పించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి పోటీ చేయించారు. తీరా ఆమె ఆస్తులన్నీ కరగబెట్టుకుని మాచర్ల చైర్మన్ గా విజయం సాధిస్తే రెండున్నరేళ్లు తిరిగే సరికి అధికార సామాజికవర్గ నాయకులకు ఆమె పదవిపై కన్నుపడి వెంటనే దిగిపోవాలని ఒత్తిడి తీసుకువచ్చి మున్సిపల్ చైర్ పర్సెన్ పదవికి రాజీనామా చేయించడంతొనే ఆమే ఆత్మ హత్య చేసుకున్నారు. పదవి నుండి తప్పుకున్న కొద్దిరొజులకే మనస్ధాపంతొ ఆమే భర్త మనస్ధాపంతో మరణంచడం… అటు ఎన్నికలల్లో చేసిన ఖర్చుల తాలూక ఆర్ధిక ఇబ్బందులు తోడై శ్రీదేవి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కొల్పయారు.

macherla

ఇదే పరిస్థితి బాపట్లలోనూ చోటు చేసుకుంది. ఈ మున్సిపాలిటీలో టిడిపి సంపూర్ణ మెజార్టీ సాధించకపోవడంతో వైఎస్ఆర్ సిపి సభ్యులను ఆకర్షించి మండలాన్ని కైవశం చేసుకుని తమ పార్టీ నాయకురాలు ఎం.విజేతను అధ్యక్షురాలిగా చేశారు. ఇప్పుడు రెండున్నరేళ్లు గడవడంతో అధికార మార్పిడికి ఆమెపై ఒత్తిడి తీసుకువస్తుండటంతో ఆమెకు గుండెపోటు వచ్చి ఆసుపత్రి పాలయ్యారు. వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలొని తాడికొండ, పత్తిపాడు ఎంపీపీ స్ధానాల్లో కూడా ఇదే తరహా వాతవరణం కనిపిస్తొంది. అయితే అధికార సామాజికవర్గ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్పీలు, మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో మాత్రం వారిని తొలగించి ఇచ్చిన మాట ప్రకారం వేరొకరిని గద్దెనెక్కించే ధైర్యం మాత్రం ఎవ్వరూ చేయలేకపోతున్నారు. ఇటువంటి స్థానాల్లో సొంత సామాజికవర్గం వారిని తప్పించి వేరొకరికి అవకాశం ఇవ్వడానికి టిడిపి అధిష్టానానికి మనసొప్పడం లేదు. పశ్చిమగొదావరీ జెడ్పీ చైర్మెన్ ముళ్ళపూడి బాపిరాజు తాను పదవి నుంచి తొలగిపోయే ప్రశక్తే లేదని ఇప్పటికే స్పష్టంచేసారు. అయితే రెండున్నరేళ్ల క్రితం ఇచ్చిన హామీని ఆయన ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. టిడిపి అధిష్టానం కూడా ఆయనపై ఎటువంటి ఒత్తిడి చెయ్యకపోవడం గమనార్హం.

ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిస్తితి ఏమిటి అనేది ప్రతి ఒక్కరికీ తెలుసు.

ఇదే సమయంలో అనంత పురం జడ్పీ చైర్మెన్ చమన్, గుంటూరు జెడ్పీ చైర్మెన్ షేక్ జాహ్నీమూన్, తూర్పుగొదవరీ జిల్లా జెడ్పీ చైర్మెన్ నామన రాంబాబుల పై మాత్రం స్థానికంగా నాయకుల నుంచే కాక అధిష్టానం నుంచి కూడా తీవ్రంగా ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. వీరిని మార్చేసి వీరి స్ధానాల్లో తమ అనూయాయులను అందలం ఎక్కించాలని పెదబాబు, చినబాబులు హామీలు ఇస్తున్నట్లు కూడా పార్టీలో ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్ధల చట్టాల ప్రకారం ఎన్నికైన నాలుగేళ్ల వరకూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు వీరందరినీ నయానో, భయానో పదవుల నుంచి తప్పించి తమ అనుంగు అనుచరులను, సొంత సామాజికవర్గ నేతలను అధ్యక్ష స్ధానాల్లో కూర్చోబెట్టడానికి నానా తంటాలు పడుతున్నారు టిడిపి అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారాలోకేష్ లు. ఈ ప్రక్రియలో ఇంకెంత టిడిపిని నమ్ముకుని తమ సర్వస్వాలను పణంగా పెట్టి రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల జీవితాలు రోడ్డున పడతాయో అని టిడిపి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

చదివిన వారి సంఖ్య