ఎన్నిక‌లంటే భ‌య‌మెందుకు బాబు …?

0
1265

 

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మ‌రోసారి చుక్కెదురైంది. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉమ్మడి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ముడూ నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం హైకోర్టు అదేశించింది. సర్పంచుల పదవీ కాలం ఆగస్ట్‌లోనే ముగియడంతో ప్రస్తుతం స్పెషల్‌​ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. దానిని కొనసాగిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.90ను హైకోర్టు కొట్టివేసింది. చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇటీవ‌ల పదవీ కాలం ముగిసిన తెలంగాణ పంచాయతీలకు కూడా మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల హైకోర్టు అదేశించిన విషయం తెలిసిందే.ఈ క్ర‌మంలో ఏ ఎన్నిక‌ల‌కు సిద్దంగా లేని బాబు పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారా .. లేదా వాయిదా వైపే మొగ్గుచూపుతారా అన్న‌ది తేలాల్సిన అంశం.

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నార‌న్న సంకేతంగా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లింది. కాని త‌న పాల‌న‌పై 80 శాతం ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నార‌ని మైకు దొరికిన‌ప్పడెల్లా ఉద‌ర‌గొట్టే బాబు ఎన్నిక‌లంటేనే ఉలిక్కిప‌డుతున్నారు. విన‌కూడ‌నిది విన్న‌ట్లు దూరంగా జ‌రుగుతున్నారు. కేంద్రం జ‌మిలీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని అభిప్రాయం కోరిన‌ప్పుడు కూడా బాబు, చిన‌బాబు ఇంతెత్తు ఎగిరిప‌డ్డారు. ప్ర‌జ‌లు ఇచ్చిన అవ‌కాశాన్ని చివ‌రి వ‌ర‌కు అనుభ‌విస్తామ‌ని తేల్చిచెప్పారు. ఇదంతా సార్వ‌త్రిక ఎన్నిక‌ల విష‌యం. కాని క‌నీసం పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను కూడా ఎదుర్కొనే ప‌రిస్థితుల్లో బాబు స‌ర్కారు ఉన్న‌ట్లు తేలిపోయింది.

రాష్ట్రంలో పాల‌న ఎప్పూడో గాడి త‌ప్పింది. ఏ చిన్న స‌మ‌స్య ప‌రిష్కారం కాక ప్ర‌జ‌లు రోడ్లెక్కి ఆందోళ‌న చేస్తున్నారు. పాల‌నను గాలికి వ‌ద‌లివేసిన బాబు ప్ర‌జాధ‌నంతో విదేశిటూర్లు, న‌వ‌నిర్మాణ‌ధీక్ష‌ల పేరుతో ప్ర‌చార ఆర్బాట‌ల‌కే ప్రాధ‌న్య‌త ఇస్తున్నారు. ప్ర‌భుత్వం అన్ని రంగాల్లో విఫ‌ల‌మైన సంఘ‌ట‌న‌లు క‌నిపిస్తున్నాయి. శాంతి భ‌ద్ర‌త‌లు , ప్ర‌జారోగ్యం అటకెక్కాయి. వ‌ర్షాలు లేక పొలాలు బీడు భూములుగా మారిపోయాయి. తీవ్ర‌మైన క‌రువు ప‌రిస్థితులు రాజ్య‌మేలుతున్నాయి.ప‌లు ప్రాంతాల్లో గుక్కెడు నీటి కోసం ప్ర‌జ‌లు అల‌మ‌టిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఏ ఎన్నిక‌లు జ‌రిపినా ప్ర‌జాతీర్పు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉంటుంద‌న్నది వాస్త‌వం.

ఎన్నిక‌లంటే బాబుకు భ‌యం ప‌ట్టుకుంది. ఇందులో భాగంగానే సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించకుండా పెండింగ్‌లో పెట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సగర్వంగా ఒక ఎన్నికైనా నిర్వహించలేదు. ఈ నాలుగేళ్లలో జరిగింది రెండే ఎన్నికలు. భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే టీడీపీ విజయం సాధించింది. ఆ తర్వాత హైకోర్టు ఉత్తర్వులతో కాకినాడ ఎన్నికలు జరగ్గా అక్కడా టీడీపీనే విజయం సాధించింది. ఈ రెండు ఎన్నికలూ చంద్రబాబు కోరుకున్నవి కాదు. టీడీపీ గెలుపు కూడా అంత ఈజీగా సాధ్యం కాలేదు ఎన్నికల్లో గెలుపు తర్వాత చంద్రబాబు ప్రకటనలు ప్రజలను నివ్వెరపోయేలా చేశాయి. బాబు పరిపాలన చూసి జనం పట్టం కట్టారని డాంభికాలు పోయాడు. అలాగైతే పార్టీ ఫిరాయించిన అన్ని స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష వైసీపీ డిమాండ్‌ చేసినా చంద్రబాబు ధైర్యం చేయలేకపోయారు.ఈ క్ర‌మంలో సార్వత్రిక ఎన్నికల ముందు పంచాయతీ ఎన్నికలకు వెళితే మంచిది కాదన్న భయంతో చంద్రబాబు ధైర్యం చేయలేకపోయారు. . పొరపాటున పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపైనా ఉండే అవకాశం ఉంటుందని బాబు అలోచించి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేదు.
ఇప్పుడు హైకోర్టు ఆదేశాల‌తో ఎన్నిక‌లు పెడ‌తారా..అంటే ఎక్కువ మంది బాబు మ‌న‌స్త‌త్వం తెలిసిన వారు త‌ప్పించుకోవ‌టానికే మార్గ‌లు వెతుకుతారు అన్న విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నారు. మొత్తం మీద పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ బాబుకు ప్రాణ‌సంక‌టంగా మారాయ‌న్న‌ది నిర్విదాంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here