అక్క‌డికి వెళ్లి మ‌రి తిట్టించు కోవాలా బాబు…!

0
683

బాబుకు ఓ ముని శాపం ఉంది. నిజం చెబితే ఆయ‌న త‌ల వెయ్యిచెక్క‌లౌతుంది…అంటూ దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌రుచు బాబు పై చ‌లోక్తులు విసిరేవారు. జ‌రిగిన అనేక సంఘ‌ట‌న‌లు నాటి వైఎస్సార్ మాట‌లను నిజం చేస్తున్నాయి. దీంతో పాటు బాబు అధికారం చేప‌ట్టాక మ‌రో జ‌బ్బు వ‌చ్చిప‌డింది. చేప్పిన మాట‌లు మ‌రిచిపోవ‌టం, తాను మ‌రిచిపోవ‌ట‌మే కాదు విన్న ప్ర‌జ‌లు కూడా మ‌ర‌చిపోయి ఉంటార‌ని ఆయ‌న ప్ర‌గాఢ విశ్వాసం. అందుకే ఆయ‌న‌ నిర్ల‌జ్జ‌గా మాట‌లు మారుస్తుంటారు. నిన్న‌టి శ‌త్రువు నేడు మిత్రుడుగా మారిపోతారు. నేటి స్నేహితుడు బాబు అవ‌స‌రం తీరాక శ‌త్రువుగా మారిపోతుంటారు. ఎవ‌రేమ‌నుకున్నా .. ఎవ‌రు న‌వ్వుకున్నా బాబు స‌హ‌జ సిద్ద ప్ర‌వ‌ర్త‌న‌లో బాబు రాదు.

Related image

ఇప్ప‌డు బాబు తెలంగాణా ఎన్నిక‌ల ప్ర‌చారంలో కొత్త దోస్ట్ రాహుల్‌తో క‌లిసి తిరుగుతున్నారు. టీడీపీ కండువాను కాద‌ని ,రాహుల్ ప్రాపకం కోసం కాంగ్రెస్ పార్టీ కండువా మొడ‌లో వేసుకొని త‌న స‌హ‌జ సిద్ద ప్ర‌వ‌ర్త‌న బ‌య‌ట‌పెట్టుకుంటున్నారు. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం జ‌రిగిన అనేక ప‌రిణామాల‌తో బాబు తెలంగాణాలో తిర‌టం మాని వేశాడు. ఎప్ప‌డైతే ఓటుకు నోటు కేసు బ‌య‌ట‌కు వ‌చ్చిందో అక్క‌డి నుంచి తెలంగాణా రాష్ట్రం అంటేనే వ‌ణికిపోయేవారు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రాజ‌ధాని కోసం స‌మ‌యం ఉన్నా హ‌డావిడిగా హైద‌రాబాద్ ఖాళీ చేయించి అమ‌రావ‌తికి చేరి పోయి బ్ర‌తుకు జీవుడా అనుకుంటూ కాల‌క్షేపం చేస్తున్నారు. అప్పుడ‌ప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఓటుకు నోటు కేసుపై చిన్న పాటి స‌మీక్ష నిర్వ‌హించినా అఘ‌మేఘాల‌పై హైద‌రాబాద్‌కి చేరుకొని సాగిలప‌డే వారు.తెలంగాణ సీఎం ప్ర‌ధాని మోడీని క‌లిసినా, కేసీఆర్ ప‌రిణితి చెందిన నాయ‌కుడ‌ని ప్ర‌శంసించినా బాబులో అస‌హ‌నం పెరిపోయేది.

Image result for chandrababu congress cloth rahul

తెలంగాణా ఎన్నిక‌ల ప్ర‌చారం లో బాబు మాట్లాడుతున్న మాట‌లు , ఇస్తున్న హామీలు చూసి ఏపీ ప్ర‌జ‌లు విస్తుపోతున్నారు. ఒక రోజు నేనే హైద‌రాబాద్ నిర్మించాన‌ని, కాదు కాదు నేనే సైబ‌రాబాద్ ను అభివృద్ది చేసానంటూ మ‌రో సారి ఒక‌సారి చెప్పిన మాట‌ల‌ను మ‌రో ఆయ‌నే ఖండిస్తూ ఉప‌న్యాసాలు ఇస్తున్నారు. తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు తనదైన మార్క్‌ వేయాలన్న తపన, ఆయన మాటల్లో స్పష్టంగా కన్పిస్తోంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు ఏం చేశారు.? ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో ఏం వెలగబెట్టారు.? 2014 ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌ని ఆయ‌న అక్క‌డ కొత్త హామీలు ఇస్తున్నారు. ఏపీకి తెలంగాణా కు చాల దూరం ఉంటుంది. ఏపీలో జ‌రిగిన ప‌రిపాల‌న తెలంగాణ ప్ర‌జ‌లు తెలియ‌దు. కాబ‌ట్టి నేనే చెప్పింది అక్క‌డి ప్ర‌జ‌లు వింటారు… అన్న‌ది బాబు భావ‌న‌. అయితే అవ‌కాశం దొరికితే చాలు కేసీఆర్ టీమ్ బాబు బ‌ట్ట‌లు ఊడ‌దీసి న‌గ్నంగా నిల‌బెడుతున్నారు. బాబు ప్ర‌చారం మాట ఎలా ఉన్న తెలంగాణా వెళ్లి మ‌రి వారి చేత క‌డిగించుకుంటున్నారు.

Image result for chandrababu harish rao ktr

ఎపి ప్రజలను ఆ రాష్ట్ర సీఎం ,టిడిపి అదినేత చంద్రబాబునాయుడు నిలువునా ముంచారని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవ‌ల ఆరోపించారు.ఏపీలో 2014 మేనిఫెస్టోను అమలు చేయలేదని తెలిపారు. ఏపీలో రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో.. వారు రోడ్డున పడ్డారని వ్యాఖ్యానించారు. ఏపీలో డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు.. వడ్డీలు కూడా కట్టలేదని బాబు చ‌రిత్ర‌ను త‌వ్వారు.కేటీఆర్ అయితే చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి కుట్రపన్నడం వాస్తవం కాదా ? మనవాళ్ళు బీఫ్రీడ్ మీ అంటూ అడ్డంగా దొరికిపోలేదా ? తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి ఉత్తరాలు రాసింది నిజం కాదా ?అలాంటప్పుడు మేము చంద్రబాబును విమర్శించకూడదా?“ అంటూ బాబు బండారం బ‌య‌ట‌పెట్టారు.
ఏపీలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి, ఇచ్చిన హామీల‌ను తుంగ‌లో తొక్కి వంచ‌న‌, ప్ర‌చార అర్బాట‌ల‌తో పాల‌న కొన‌సాగిస్తున్న బాబు ఇక్క‌డి నుంచి అక్క‌డి దాక వెళ్లి మ‌రీ క‌డిగించుకుంటున్నారు. బాబు బ‌తుకు బండారాన్ని తెలంగాణ నేత‌ల‌తో బ‌య‌ట‌పెట్టించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here