ఆ లేడీ బ్యూరోక్రాట్ కనుసైగ చేస్తే వెలగపూడి ఉలిక్కిపడుతుంది!

0
5354

వందల కోట్ల ఏ ఎం టీ జెడ్ స్కామ్ లో నిజాలను తొక్కిపెట్టేందుకు సి ఎం ఓ పై ఒత్తిడి

నిజాయితీ కి బ్రాండ్ అంబాసడర్ గా ఎల్లో మీడియాలో కథనాలు రాయించుకునే నేర్పరి

పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడైన ఒక మాజీ మంత్రి డైరెక్షన్ లో కథ నడిపిస్తున్న లేడీ ఐ ఏ ఎస్

ఒక భారతీయుడి ‘పిల్’ తో నెల లోగా పూర్తి స్థాయి విచారణ, నివేదికల కోసం ఏ సి బీ ని ఆదేశించిన హై కోర్టు…

ఇది జరిగి నాలుగు నెలలైనా ….ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్న ఏ సి బీ

రాజకీయాలు డాట్ కామ్ పరిశోధన లో వెలుగు చూసిన మరో సీనియర్ మంత్రి అల్లుడి ‘గిల్లుడు’ వ్యవహారం

Image result for poonam malakondaiah

వెలగపూడి సెక్రెటేరియాట్ లో లేడీ డాన్….ఆమె పేరు చెపితేనే ఆఫీసర్లు, పొలిటీషియాన్స్ ఉలిక్కిపడుతారు….కాలికేస్తే మెడకీ, మెడకేస్తే వెలగపూడికీ లింక్ పెట్టె ఆ బ్యూరోక్రాట్ ప్రసుతం అటు సి ఎం ఓ లోనూ….ఇటు ఉండవల్లి సి ఎం రెసిడెన్స్ లోనూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. మొన్నటికి మొన్న కొత్తగా క్యాబినెట్ బాధ్యతలు స్వీకరించిన సీనియర్ మోస్ట్ లీడర్ కూడా ఆమె వైఖరిపైన విస్మయం వ్యక్తం చేశారట. సంచలనాత్మ రాజకీయ కథనాలకు పేరు గాంచిన రాజకీయాలు డాట్ కామ్ పరిశోధన లో వెల్లడైన ఆసక్తికరమైన అంశాలను బట్టి చూస్తే, ఆమె అటు అవినీతి నిరోధక శాఖ -ఏ సి బీ ని, ఇటు బ్యూరోక్రసీ ని మూడు చెరువుల నీళ్ల్లు తాగిస్తోంది. వందల కోట్ల రూపాయల మెడికల్ డివైసెస్ స్కామ్ లో …..కీలక పాత్ర పోషించిన వారిని, దళారీలను వెనకేసుకొస్తున్న ఆమె మాజీ డి జి పి—సతీమణి గా ఊరందరికీ సుపరిచితురాలు…..అయిన దానికీ, కానీ దానికీ కింది స్థాయి సిబ్బందిని, ఆ మాట కొస్తే తన శాఖలో పనిచేసిన, చేస్తున్న యువ ఐ ఏ ఎస్ , ఐ పి ఎస్ అధికారులను తీవ్ర స్థాయిలో వేధించిన అధికారిణిగా వెలగపూడి సెక్రెటేరియాట్ బ్లాక్స్ లో ఆమెకు విపరీతమైన పేరుంది.
నేషనల్ హెల్త్ మిషన్ నిధులను పక్కదోవ పట్టించిన తీరు, తన బినామీ సంస్థలకు వాటిని మళ్లించిన వైనం పైన రాజకీయాలు డాట్ కామ్ లోతుగా పరిశోధిస్తే, లింక్ కాస్తా ఒక ఢిల్లీ కి చెందిన పవర్ బ్రోకర్ దగ్గర వచ్చి ఆగింది. వైజాగ్ ఏ ఎం టీ జెడ్ వ్యవహారాల్లో కీలక భూమిక పోషించిన ఆ నార్త్ ఇండియన్ –కలెక్టర్లు కాన్ఫరెన్స్ లో కూడా పలు దఫాలు తనదైన గీర ప్రదర్శించి సి ఎం ఓ అధికారులు సైతం ఇబ్బంది పడే వాతావరణం కల్పించాడు. ఆ మధ్య ఎప్పుడో అరెస్ట్ అయిన ఒక కేరళ కన్సల్టెంట్ జ్యుడిష్ రాజు ను బెదిరించి –పూర్వపు డీ జీపీ హయాంలో అతడి మీద తప్పులు కేసులు పెట్టించి, అరెస్ట్ చేయించిన ఈ నార్త్ ఇండియన్ కన్సల్టెంట్ అరాచకాలు మితి మీరటం, ఈ మొత్తం ఎపిసోడ్ లో అతడికి సహకరించిన ఒకప్పటి తెలుగుదేశం మిత్ర పక్షం తాలూకు మాకీ మంత్రి ఒత్తిడి వెరసి –ఆ స్కామ్ పూర్తిగా వెలుగు లోకి రాకుండా ఆగిపోయింది.
అయితే—పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక ‘భారతీయుడు’ ఈ మొత్తం వ్యవహారం మీద ఫోకస్ పెడితే..తేలిన విషయాలు, ఆ తర్వాత అతను హై కోర్టు లో కేసు దాఖలు చేయటం వల్ల ఏ సి బీ లో వచ్చిన కదలిక దరిమిలా………..ఈ లేడీ బ్యూరోక్రాట్ మీద విపరీతమైన ఒత్తిడి పెరిగింది…..
అయితే రివర్స్ ఇంజినీరింగ్ లో సిద్ధ హస్తురాలైన ఈ లేడీ బ్యూరోక్రాట్ ఇప్పుడు కొత్త పల్లవి అందుకుని..అటు ఏ సి బీ టాప్ బాసులను…ఇటు సి ఎం ఓ ముఖ్యులను ఆల్మోస్ట్ బెదిరించే స్థాయికి దిగిన వైన్నాన్ని గడిచిన కొన్ని రోజులుగా రాజకీయాలు డాట్ కామ్ పరిశీలిస్తూ వస్తోంది. తాజా పరిశోధన లో వెల్లడైన అంశాలను బట్టి….ఈ దమ్మున్న లేడీ బ్యూరోక్రాట్ కు నేషనల్ హెల్త్ మిషన్ లో పని చేస్తున్న మరో మహిళా అధికారి, అలాగే ఏ పీ ఎం ఎస్ ఐ డి సి లో ఒక కీ పోస్టు వెలగబెడుతున్న ఒక కీలక మంత్రి గారి అల్లుడు కలిసి ఇస్తున్న అపూర్వమైన మద్దతు ఇప్పుడు వెలగపూడి లో హాట్ టాపిక్.

Image result for dgp tagore
అవినీతి పరుల పాలిట కనపడని నాలుగో సింహంగా పేరు పడిన ఏ సి బీ బాస్ ఆర్ పీ ఠాకూర్ మాత్రం ఈ మెడికల్ డివైసెస్ స్కామ్ గురించి ఏమైనా ప్రశ్నలు అడిగితె ఉలిక్కిపడుతారు. తాము హై కోర్టు కు రిపోర్ట్ సబ్మిట్ చేయటానికి సీల్డ్ కవర్లు పేట్టుకుని తిరుగుతున్నామనీ, విషయం హై కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పటికిప్పుడు ఏమీ మాట్లాడలేమనీ ఠాకూర్ దొర గారు చెప్పుకు రావటమే…..ఇప్పుడు కొత్త సందేహాలకు తావు ఇస్తోందనేది రాజకీయాలు డాట్ కామ్ విశ్లేషణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here