ఐ ఏ ఎస్ లను వెంటాడుతున్న రాజధాని భయాలు…

0
1788

మొత్తం పంతొమ్మిది మంది ఐ ఏ ఎస్ లు సెంట్రల్ డిప్యూటేషన్ కు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. రాజధాని అవకతవకల్లో తాము ఎక్కడ సంతకాలు చేశామో, తమ చేత నారాయణ లాంటి మంత్రులు, ఇతర ప్రభుత్వ పెద్దలు ఇక్కడెక్కడ ఒత్తిడి చేసి ఫైళ్లలో మార్పులు చేయించారో బేరీజు వేసుకున్న తర్వాత ….ఐ ఏ ఎస్ లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వెలగపూడి సచివాలయం లోని సాధారణ పరిపాలన శాఖ ఈ విషయమై గోప్యత పానాటిస్తున్నప్పటికీ….ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం బట్టి మొత్తం పంతొమ్మిది మంది ఐ ఏ ఎస్ లు తాము కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతామని దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.

వాస్తవాన్నికి సీనియర్ అయిన ఎల్ వీ సుబ్రహ్మణ్యం ను కాదని, అనీల్ చంద్ర పునీత కు చీఫ్ సెక్రెటరీ పదవి ఇచ్చిన తర్వాత, ఎల్ వీ అంత సీరియస్ గా అయితే విధులకు హాజరు కావటం లేదు. దానికి తోడు, ఆయన కుమార్తె వివాహం కూడా ఈ నెల లో ఉండడటంతో ఆయన ఇప్పటికే సెలవుపై వెళ్లినట్టు తెలుస్తోంది. చీస్ప్ సెక్రెటరీ అనీల్ చంద్ర పునీత కూడా తన కుమార్తె వివాహం అరేంజిమెంట్స్ లో ఉన్నారు. ఇదిలా ఉంటె, ఈ పందొమ్మిది మంది ఐ ఏ ఎస్ లలో రాబోయే ఎన్నికల తర్వాత ఎవరి అంచనాలు వారికి ఉండడటం తో పాటు, ఇప్పటి వరకూ సి ఎం ఓ ఒత్తిడి మీదో, లేక ఇతర మంత్రుల ఒత్తిడి వల్లనో రక రకాల ఫైల్స్ మీద సంతకాలు పెట్టిన ఐ ఏ ఎస్ లు ఇప్పుడు దీర్ఘాలోచన లో పడటానికి గల ప్రధాన కారణం…ఈ సర్కార్ తప్పిదాలకు తామెక్కడ వీల్ చెయిర్స్ లో హాయ్ కోర్టు చుట్టూ తిరగాలని బెంగ పట్టుకున్నట్టు తెలుస్తోంది.

Image result for mp narayana

ప్రత్యేకించి…..మంత్రి నారాయణ శాఖ కు చెందిన సీనియర్ బ్యూరోక్రాట్ కారికల్ వెలవెన్ అసలే మాత్రం ఒత్తిడి ని తీసుకోవడానికి ఇష్టం గా లేరనీ, ఆరు నెలల క్రితమే ఆయన తన సెంట్రల్ డిప్యూటేషన్ కోసం తమిళనాడు సీనియర్స్ ద్వారా లాబీ చేసుకున్నారని తెలుస్తోంది. ఆయనను చూసి , మిగిలిన వారు కూడా ఒక్కరొక్కరు గా సెంట్రల్ డిప్యుటేషన్ రాగం అందుకున్నారు. ఇన్ని అవకతవకల మధ్య ఉద్యోగం చేసే కన్నా, కేంద్రం లో ఎదో ఒక శాఖ లో లూప్ లైన్ లో ఉండటమే మేలనే భావన లో వారు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే—నిజాయితీ కి మారు పేరుగా నిలిచిన హెల్త్ సెక్రెటరీ పూనమ్ మాలకొండయ్య కూడా కేంద్ర సర్వీసులకు వెళిపోతారని ప్రచారం జరుగుతోంది. ఒకే సారి ఇంత మంది ఐ ఏ ఎస్ లు..అదీ ఎన్నికల ముందర ఈ నిర్ణయం తీసుకోవటం సి ఎం ఓ ను కలవరపెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కితే, బీ జీ పీ కి, వై ఎస్ ఆర్ సి పీ కి చేతికి ఆయుధం దొరికినట్టేనని భావించిన ఉండవల్లి లాబీలు …సమాచారం బయటకు వెళ్లకుండా నానా తంటాలు పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here