నాయుడు బాబా…..ముప్పై రెండు మంది అసంతృప్తులు

0
5838

త్వరలో ఆంద్ర లో రాజకీయ సంక్షోభం ఆ ముప్పై రెండు మంది ఎం ఎల్ లు తిరుగుబాటు చేయబోతున్నారా? అసలేమీ జరుగుతోంది తెలుగు దేశంలో ….తెలంగాణ ఫలితాల తర్వాత…..తెలుగు దేశం స్ట్రాటజీ తిరగబడితే…..ఆంధ్రా లో అసంతృప్తి తో రగిలిపోతున్న ముప్పై రెండు మంది ఎం ఎల్ ఏ లు తమ రాజీనామా లేఖలతో గవర్నర్ దగ్గర కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉండవల్లి సమాచారం. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే టికెట్లు నిరాకరించినట్టుగా ప్రచారం లో ఉన్న ఆ ఎం ఎల్ ఏ లు —తెలంగాణా ఫలితాల సరళిని విశ్లేషించిన తర్వాతే —తమ రాజీనామా లేఖలను రాజ్ భావం కు నేరుగా వెళ్లి ఒప్ప చెపుదామని నిర్ణయించుకున్నట్టు రాజకీయాలు డాట్ కామ్ దృష్టికి వచ్చింది.

Image result for chandrababu

ఎలాగూ తమకు టికెట్లు ఇవ్వకూడదని నాయుడు గారు నిర్ణయం తీసుకున్నందువల్ల, తమ ప్రత్యామ్నాయాల కోసం, రాజకీయ భవిష్యత్ కోసం —ఈ నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని వారు వారి అనుచరులకు, కార్యకర్తలకు చెప్పుకుంటున్నట్టు తెలిసింది. ఇదే గనుక జరిగితే, రాష్ట్ర అసెంబ్లీ లో తెలుగు దేశం బలం డెబ్భై ఒకటికి పడిపోతుంది… టెక్నీకల్ గా వై ఎస్ ఆర్ సి పీ కి అరవై ఐదు మంది సభ్యులు ఉండటం, ఫిరాయించిన ఇరవై మూడు మంది ఎం ఎల్ ఏ ఆ విషయం లో స్పీకర్ ఇంకా ఒక నిర్ణయం తీసుకోకపోవటం వల్ల–అప్పుడు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాస్తవానికి–తెలంగాణ లో తన ఎన్నికల ప్రచారం తో టీ ఆర్ ఎస్ అధినేత కె సి ఆర్ కు చుక్కలు చూపించిన చంద్రబాబు నాయుడు వ్యూహానికి….ప్రతి వ్యూహం పన్నే క్రమంలో భాగం గానే—కె సి ఆర్ తన ముఖ్య అనుయాయులతో—ఆంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే పనిలో ఉన్నట్టు రాజకీయాలు డాట్ కామ్ కు స్పష్టమైనసమాచారం ఉంది. ఒక వేళ టీ ఆర్ ఎస్ తిరిగి అధికారం చేజిక్కించుకుంటే, కె సి ఆర్ తక్షణ కర్తవ్యమ్ —ఆంద్ర లో రాజకీయ సంక్షోభం సృష్టించటమే అనే ఒక విషయం తేట తెల్లమవటం వల్ల..ఈ ముప్పై రెండు మంది ఎం ఎల్ ఏ ల పని సులువు అవుతుందనేది ఇంటెలిజెన్స్ దృష్టి లో కూడా ఉన్నటు తెలుస్తోంది.

Related image

వాస్తవానికి ఈ మొత్తం ఎపిసోడ్ అంటా చంద్రబాబు నాయుడు దృష్టి లో ఉందనీ, అందుకే ఎక్కడికక్కడ ఆ ముప్పై రెండు మంది ఎం ఎల్ ఏ ల కదలిక మీద ఇంటెలిజెన్స్ ప్రత్యేక సృష్టి సారించిందని తెలుస్తోంది. తాజా గా రావెల కిషోర్ బాబు రాజీనామా దరిమిలా—తలెత్తిన పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నాయుడు ఎండ్ కంపెనీ ….ఒక వేళ రాజకీయ సంక్షోభం తలెత్తితే చేయవలసిన తక్షణ కార్యక్రమం ఏమిటి అనే దాని మీద వీ వీ వీ చౌదరి కి స్పెషల్ బాధ్యతలు ఒప్పచెప్పినట్టు రాజకీయాలు డాట్ కామ్ దృష్టికి వచ్చింది. అసలు ఈ ముప్పై రెండు మంది ఆ వై ఎస్ ఆర్ సి పీ కి, ఇటు జనసేన కు అనుసంధానం గా ఉన్నట్టయితే….వారిని నీరు గార్చటానికి పార్టీ ‘నిద్రాణ’ పొలిటికల్ బ్రోకర్ లింగమనేని రమేష్ ను రంగంలోకి దించటానికి కూడా నాయుడు గారి కంపెనీ ప్లాన్ బి ని సిద్హం చేసినట్టు తెలుస్తోంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here