చిన‌బాబు భ‌జ‌నకు మ‌రో ప‌థ‌కం ‘జలధార’ …!

0
632

నిన్న‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల సంక్షేమం గాలికి వ‌ద‌లివేసిన బాబు స‌ర్కార్ ఎన్నిక‌ల స‌మీపిస్తున్న త‌రుణంలో స‌రికొత్త ప‌థ‌కాల‌కు తెర‌తీస్తున్నారు. ఎన్నిక‌లు త‌రుముకు వ‌స్తున్న స‌మ‌యంలో, ప్ర‌జ‌ల్లో పూర్తి స్థాయిలో అస‌హ‌నం పెరిగి పోతున్న క్ర‌మంలో ఏదో చేస్తున్న‌ట్లు న‌మ్మించ‌టానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి. నాలుగున్న సంవ‌త్స‌రాల కాలంలో గ‌తంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమ‌లు కాని ప‌రిస్థితుల్లో మైలేజి పెంచుకోవ‌టానికి బాబు అండ్‌కో టీమ్ కొత్త ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. నిరుద్యోగభృతి, ఆశావ‌ర్క‌ర్ల , హోంగార్డుల జీతాలు పెంపు త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌న్ని ఎన్నిక‌ల స‌మయంలోనే పుట్టికొచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా, ఎవ్వరూ మంచినీళ్ల కోసం బిందెలు పట్టుకుని ట్యాంకుల వద్దకో, వీధి కొళాయిల వద్దకో వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వ భ‌జ‌న ప‌త్రిక భారీ క‌థ‌నాన్ని ఇచ్చింది. దీనికి ‘జలధార’ అనే పేరు పెట్టేసారు. రాష్ట్రంలోని 48,363 నివాస ప్రాంతాలకు తాగునీరు అందించటానినికి రూ.22,300 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తారట‌.

ప్ర‌స్తుతం బాబు స‌ర్కారు అమ‌లు చేయాల‌ను కున్న జ‌ల‌ధార ప‌థ‌కం తెలంగాణా స‌ర్కార్ మిష‌న్ భ‌గీర‌ధ‌కు అచ్చంగా కాపి ప‌థ‌కం. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ను ప్రారంభించింది. ఇందులో భాగంగా తాగునీటి సమస్యలను తీర్చడం,స్వచ్ఛమైన మంచినీరు అందించడం 2019 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లాను ఏర్పాటుచేసి, సురక్షిత మంచినీటిని అందించాలనే ఆశయంతో ఈ ప‌థ‌కాన్ని అక్క‌డ ప్రారంభించారు. ఆ స‌మ‌యంలో టీటీడీపీ నేత‌లు మిష‌న్ భ‌గీర‌ధ‌పై విమ‌ర్శ‌లు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ 2016, ఆగస్టు 7 ప్రారంభిస్తే ప్ర‌స్తుతం బాబు స‌ర్కార్ స‌రిగ్గా ఎన్నిక‌లకు ముందు ఈ ప‌థ‌కాన్ని ప్రారంభిస్తామ‌న‌టంలోనే ఎన్నిక‌ల మ‌త‌ల‌బు దాగి ఉన్న విష‌యం సుస్ప‌ష్ట‌మౌతుంది. ఏ ప‌థ‌క‌మైనా, ఏ కార్య‌క్ర‌మైనా ప్ర‌జా సంక్షేమానికి ,వారి అభ్యున్న‌తికి దోహ‌డ‌ప‌డితే మంచిదే. కాని బాబు స‌ర్కారులో ఈ చిత్తశుద్ది క‌రువైంది. ప్ర‌తి ప‌థ‌కాన్ని ప్ర‌చార ఆర్బాటాల‌కు వినియోగించుకుంటున్న బాబు ఈ ప‌థ‌కాన్ని సైతం ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో క‌రువు విల‌య‌తాండ‌వం చేస్తుంది.

స్వ‌చ్చ‌మైన నీటి మాట దేవుడెరువు తాగ‌టానికి గుక్కెడు నీళ్ల దొర‌క‌క ప్ర‌జ‌లు అల్లాడుతున్నారు. ప‌ల్లెలో స్వ‌చ్చ‌మైన తాగు నీరు అంటూ ప్ర‌చారం చేసుకొన్న ఎన్‌టీఆర్ సుజ‌ల స్ర‌వంతి కార్య‌క్ర‌మం టీడీపీ నాయ‌కుల వ‌శ‌మై, అక్ర‌మ నీటి వ్యాపారానికి తెర‌తీసారు. మ‌రికొన్ని చోట్ల అస‌లు ఈ ప‌థ‌కం ఉన్న విష‌య‌మే ప్ర‌జ‌ల‌కు తెలియ‌దు. రాష్ట్రంలో ప‌లు గ్రామ‌ల్లో ఎండ‌కాలం, వాన‌కాలంతో సంబంధం లేకుండా నీటి ఎద్ద‌డి స‌మ‌స్య తీవ్రంగా ఉంది. ప్ర‌బుత్వం త‌న డాష్‌బోర్డులో ప్ర‌క‌టించిన విధంగానే భూర్బ‌జలాలు అడుగంటాయి. నీరు-చెట్టు, సేధ్య‌పుకుంటలు, ఇంకుడు గుంత‌లు ఏ ప‌థ‌కం స‌క్ర‌మంగా అమ‌లుకు నోచుకోలేదు. ప్ర‌తి ప‌నిలోనూ ప‌చ్చ‌కండువా వేసుకొన్న పెద్ద‌ల జోక్యం తీవ్ర‌మైంది. దీంతో భూర్బ‌జ‌లాలు ఆశించిన మేర పెర‌గ‌లేదు. ఇప్పుడు యువ‌రాజు చిన‌బాబు శాఖ ప‌రిధిలో ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీరు అంద‌జేస్త‌మ‌ని చెబుతున్నారు.

Related image

ఒక్కో మనిషికి రోజుకు 70 లీటర్ల చొప్పున నీరిచ్చేలా ఆవాస ప్రాంతాల వారీగా గణన పూర్తయిందని ఈ పథకం కోసం సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటిని తీసుకునేందుకు అన్నీ అనుమతులు పొందారని వివ‌రిస్తున్నారు. నీటి లభ్యత లేని జిల్లాలలో సమీపంలోని ప్రాజెక్ట్‌ నుంచి నీటిని తీసుకుని అన్ని గ్రామాలకు కలిపి ఒకే స్కీం ఏర్పాటు చేసి ఇంటింటికీ నీరందిస్తార‌ట. తాగునీటి ఎద్ద‌డి తీవ్రంగా ఉన్న చోట్ల ముందుగా ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని చిన‌బాబు సెల‌విస్తున్నారు. ప‌థ‌కం అమ‌లుపై స్ప‌ష్ట‌మైన విధానం లేక‌పోవ‌టంతో ఈ ప‌థ‌కం చిన‌బాబు ప్ర‌మోష‌న్ కోసం, టీడీపీ ఎన్నిక‌ల ప్ర‌చారానికే ప‌రిమిత‌మ‌వ్వ‌నుంద‌ని ప్ర‌జ‌లు పెద‌వి విరుస్తున్నారు. ప‌థ‌కం అమ‌లు కాకుండానే భ‌జ‌న మీడియా వీర‌భ‌జన మొద‌లు పెట్టి రాష్ట్రానికి ఏదో ఉద్ద‌రిస్తున్న‌ట్లు ప్ర‌చారం చేస్తున్నారు. ఈ ప‌థ‌కం కూడా బాబు స‌ర్కార్ అన్ని ప‌థ‌కాల మాదిరి ప్రచార అర్బాటాల‌కే ప‌రిమిత‌మ‌వ్వ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here