బాబు బానిస మీడియా బాకా మొదలు

0
1139

చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేస్తున్న మీడియా మరోసారి ఆయనకు బాకా ఊదడం మొదలుపెట్టింది. నేడు ఢిల్లీలో జరగనున్న బీజేపీయేతర రాజకీయ పార్టీల సమావేశానికి కర్త, కర్మ, క్రియ అన్ని చంద్రబాబే అంటూ పతాక శీర్షికలో వార్తలు వండి వార్చేశాయి. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం ఢిల్లీ సభకు చంద్రబాబే నేత అంటూ ఊదరగొట్టాయి. వాస్తవానికి నేడు ఢిల్లీలో సమావేశం అవుతున్న పార్టీలూ, నేతలూ ఎప్పటినుండో ఐక్యంగానే ఉన్నారు. వారంతా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమిలో భాగస్వాములే. ఆయా పార్టీల మధ్య వైరుధ్యాలు ఉన్నా బీజేపీ వ్యతిరేకతతో వాళ్ళంతా గత రెండు దశాబ్దాలుగా ప్రత్యేకించి వాజపేయి నేతృత్వంలో ఎన్డియే ఏర్పాటైన రోజునుండి యూపీఏలో సభ్యులుగా ఉన్నారు. బీజేపీ వ్యతిరేకత వల్ల వామపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కు సానుకూలంగానే ఉన్నారు.

Related image

వాళ్ళే ఈ రోజు దేశరాజధానిలో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతున్నారు. నేటి సమావేశంలో కొత్తగా హాజరవుతున్నదల్లా చంద్రబాబు నాయుడు మాత్రమే. సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ సమావేశం ఇది. ఇలాంటి సమావేశాలు గతంలో అనేకం జరిగాయి. కానీ ఇక్కడ చంద్రబాబు బానిస మీడియా మాత్రం ఈ సమావేశం కేవలం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తున్నట్టు, అయన నేతృత్వంలో చివరికి సోనియా గాంధీ కూడా చేరుతున్నట్టు వార్తలు వండి వార్చారు. ఇలాంటి వార్తలు రాయటానికి ఈ మీడియా కు సిగ్గు లేకపోయినా వాస్తవాలు తెలిసిన తెలుగు ప్రజలు మీడియా మొహాన ఉమ్మేస్తున్నారు.

Image result for chandrababu

తాను చెప్పడం వల్లనే మమతా బెనెర్జీ, శరద్ పవార్, ఫారూఖ్ అభ్దుల్లా వంటి అగ్ర నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారని ఓ వైపు చంద్రబాబు చెప్పుకుంటుంటే, అయన -మోచేతి నీళ్ళు తాగి బ్రతుకుతున్న మీడియా ఆహా ఓహో అంటూ బాకా ఊదేస్తోంది. శరద్ పవార్, మమతా బెనెర్జీ కాంగ్రెస్ తానులో ముక్కలే అనే విషయం దేశ ప్రజలకు తెలియంది కాదు. కానీ ఈ ఇద్దరు నేతలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తానే మార్చేశానని చంద్రబాబు చెప్పటం, దాన్ని బానిస మీడియా పతాక శీర్షికలో రాయడం తెలుగువారి ఆత్మగౌరవానికి ద్రోహమే. కాంగ్రెస్ గూటిలో దూరిన చంద్రబాబు మొత్తం గూడు తానే నిర్మించి కాంగ్రెస్ కో9సం, ఇతర పార్టీలకోసం ఇస్తున్నట్టు చెప్పుకోవడం బాబుగారి సిగ్గులేని తెంపరితనానికి నిదర్శనం.

Image result for శరద్ పవార్999

అయితే చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు పూర్తిగా తెలిసిన శరద్ పవార్ వంటి నేతలు కూడా చంద్రబాబును పూర్తిగా నమ్మడం లేదు. బీజేపీ నాయకత్వం పట్ల అయన ఇప్పటికీ సానుకూలంగానే ఉన్నారని, చంద్రబాబు వ్యతిరేకత కేవలం నరేంద్ర మోడీ పై మాత్రమే అని అటు కాంగ్రెస్ నేతలకు, ఇటు శరద్ పవార్ వంటి నేతలకు స్పష్టంగా తెలుసు. అలాగే వామపక్ష పార్టీలు కూడా గతంలో లాగా చంద్రబాబును పూర్తిగా గుడ్డిగా నమ్మే పరిస్థితి కనిపించడంలేదు. అందుకే నేటి సమావేశానికి వారు హాజరు కావటం లేదు. చంద్రబాబు తన బీజేపీయేతర రాజకీయ సచ్ఛీలతనను నిరూపించుకోవాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే వామపక్షాలు ఆయనను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే వాస్తవాలు ఇలా ఉంటె చంద్రబాబు అయన భజన మీడియా మాత్రం ఢిల్లీని చంద్రబాబు ఖబ్జా చేస్తున్నారని దేశానికీ దశ దిశా నిర్దేశం చేయబోతున్నారని చెప్పడం సిగ్గుచేటు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here