తెరాస విజయం నుండి వైసీపీ ఏం నేర్చుకోవాలి?

0
3627

తెలంగాణ రాష్ట్రంలో తెరాస ఘనవిజయం సాధించింది. తెలుగుదేశం, యెల్లో మీడియా, యెల్లో సర్వేల ఉచ్చులన్నీ దాటుకొని తెరాస అనూహ్య విజయం సాధించింది. వంద సీట్లు పైగా గెలుపు లక్ష్యంగా చేసుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన తెరాస ఆశించినన్ని స్థానాల్లో గెలవలేకపోయినా 2014 కంటే మెరుగైన విజయమే సాధించింది. తెరాస ఓడిపోతోందని, కాంగ్రెస్- తెలుగుదేశం నేతృత్వంలోని మహాకూటమి బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని జరిగిన ప్రచారం తెరాస వ్యూహాల ముందు నిలవలేకపోయింది. కూటమి విజయం సాధిస్తోందంటూ ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు పచ్చ పార్టీ, పచ్చ మీడియా, పచ్చ సర్వే నేతలు చేసిన ప్రయత్నాలేవీ తెరాస వ్యూహాన్ని ఛేదించలేకపోయాయి. చివరికి పచ్చ నేతలు బొక్కబోర్లా పడాల్సి వచ్చింది . రేపు 2019లో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కూడా పచ్చ పార్టీ, పచ్చ నేతలు, పచ్చ మీడియా, పచ్చ సర్వేగాళ్ళు ఇలాంటి వ్యూహంతోనే ముందుకు రాబోతున్నారు.

Related image

ప్రస్తుతం అధికారంలో ఉండడం ఒక అనుకూల పరిస్థితి అయితే, ఈ నాలుగేళ్ళలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూడబెట్టుకున్న కోట్లాది రూపాయల డబ్బు మరో ఆయుధం. ఇక పచ్చ మీడియా ఎలాగో ఉంది. వీటితో పాటు ఇప్పుడు తెలంగాణాలో బొక్కబోర్లా పడ్డాం అనే అవమానం ఆ పచ్చ కులాన్ని మరింతగా రెచ్చగొట్టే అవకాశం కూడా ఉంది. పచ్చ కులం నేతలు ఇక్కడ అధికారం నిలబెట్టుకునేందుకు ఆస్తులు అమ్మి ఆ సొమ్ము ప్రచారంలో వాడే అవకాశం కూడా ఉంది. పార్టీ గెలిస్తే చేసిన ఖర్చులు వస్తాయని, అమ్ముకున్న ఆస్తులు కొనుక్కోవచ్చని వాళ్ళ గట్టి నమ్మకం. అమరావతిలో అధికారం నిలుపుకోడానికి ఎన్ని మార్గాల్లో అయినా పచ్చ కులపోళ్ళు గట్టి ప్రయత్నాలే చేస్తారు. వీటిని తట్టుకొని నిలబడడం వైసీపీ ప్రధాన కర్తవ్యం. భేషజాలకు పోకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకోకుండా గెలుపే లక్ష్యంగా వైసీపీ నేతలు పనిచేయాల్సి ఉంటుంది.

Image result for jagan padayatra

ఈ సారి వైసీపీని గెలిపించాలని ప్రజలు, కార్యకర్తలు ధృడ సంకల్పంతో ఉన్నారు. అయితే ఇలాంటి సంకల్పమే నాయకుల్లో కూడా కనిపించాలి. అప్పుడే పచ్చ పార్టీని ఓడించడం సాధ్యం. ధృడ సంకల్పంతో పాటు తెరాస అనుసరించిన వ్యూహాలు కూడా ఇప్పుడు వైసీపీకి అవసరం. తెరాస అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు మొత్తం ఎన్నికల ప్రచారాన్ని తన భుజాలపై వేసుకున్నారు. అయన ప్రతి నియోజకవర్గంలో పర్యటించి ప్రసంగించారు. ఇలాంటి పని జగన్ కూడా చేయాల్సి ఉంది. చేస్తారు కూడా. అయితే మిగిలిన నేతలు తమ బాధ్యతలు తాము చిత్తశుద్ధితో నిర్వర్తించాల్సి ఉంది. కేటిఆర్ ఒక 30 నుండి 35 స్థానాలపై ద్రుష్టి పెట్టారు. అలాగే హరీష్ రావు మరో 30 నుండి 40 స్థానాలపై ద్రుష్టి పెట్టారు. కవిత మరో 20 నుండి 25 స్థానాలపై ద్రుష్టి పెట్టారు. ఇంకొందరు ముఖ్యనేతలు ఒక్కొక్కరు 5 నుండి 15 స్థానాలపై ద్రుష్టి పెట్టారు. ఈ వ్యూహం తెరాసకు కలిసి వచ్చింది.

Image result for ktr harish rao kavitha

తాము దృష్టిపెట్టిన స్థానాల్లో ఎన్నికల ప్రచారం, అసంతృప్తుల బుజ్జగింపు, కార్యకర్తల పనితీరు, ఓటర్లను కలిసే విధానం వంటి అంశాలు ఈ సీనియర్ నేతలు దగ్గరుండి చూసుకున్నారు. తమ ఓటు చెదరకుండా అదనంగా కొత్తవోట్లు సాధించుకునే ప్రయత్నాలు చేశారు. ఇలాంటి వ్యూహం వైసీపీ సీనియర్ నేతలు ప్రదర్శించాల్సి ఉంది. సీనియర్ నేతలు వై వి సుబ్బా రెడ్డి, విజయ సాయి రెడ్డి, కరుణాకర్ రెడ్డి వంటి వాళ్ళు, వారితో పాటు ఇతర సీనియర్ నేతలు తాము పోటీ చేసినా చేయకపోయినా పార్టీ గెలుపుకోసం గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ఇలా ప్రతి నియోజక వర్గంలో తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాల్సి ఉంది.

అలాగే ప్రత్యర్థి పార్టీలోని కీలక నేతల ఓటమి కూడా ఎన్నికల్లో ప్రధానమే. తెరాస అదే వ్యూహాన్ని ప్రదర్శించింది. రేవంత్ రెడ్డి లాంటి నేతలు ఓడిపోవడం కూడా తెరాస అమలుచేసిన వ్యూహంలో భాగమే. ఇటువంటి వ్యూహాలను ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ నేతలు అమలు చేయాల్సివుంది. ప్రత్యర్థుల్లో కీలక నేతల ఓటమిపై ద్రుష్టి పెట్టకపోతే శత్రువు బలహీనపడదు. ప్రత్యర్థి పార్టీలోని కీలక నేతలు తమ గెలుపుపై ధీమాతో ఉండడం మంచిది కాదు. ఆ ధీమా వల్ల అలాంటి నేతలు పక్క నియోజకవర్గాల్లో కూడా పనిచేసి తమ పార్టీ నేతల గెలుపుకోసం కృషిచేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంతో పాటు పక్కనున్న ఓ ఐదారు నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని మొదట ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. అయితే తెరాస వ్యూహంతో ఖంగుతిన్న రేవంత్ రెడ్డి కనీసం తాను గెలవడంకోసం తన నియోజకవర్గానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయినా రేవంత్ రెడ్డికి ఓటమి తప్పలేదు. ఈ వ్యూహం వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ అమలు చేయాల్సి ఉంది. బలమైన ప్రత్యర్థుల్ని కట్టడి చేయాలి. ఇది తెరాస నుండి వైసీపీ నేర్చుకోవాల్సిన అంశం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here