శ్వేతపత్రాలన్నీ చెత్త పత్రాలేగా బాబుగారూ

0
243

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత నాలుగు రోజులుగా రోజుకొక్క శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. శ్వేతపత్రంలో అధికారులు అందించే కాకిలెక్కలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. వాటితోపాటు రాష్ట్రంలోని ప్రతిపక్షాలపైనా, కేంద్రంలోని బిజెపి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైనా ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు రాజకీయ పరమైనవే అయినా అవి పూర్తిగా ఏకపక్షం. తరచూ తాను మార్చుకొస్తున్న అవకాశవాద రాజకీయ ఆరోపణలు. 2014 ఎన్నికల్లో తాను బీజేపీతో పొట్టుకడితే అది చారిత్రక అవసరం. అప్పట్లో నరేంద్రమోదీ మహానేత. దేశాభివృద్ధిని కాంక్షించే ప్రజానేత.

Image result for chandrababu naidu series

ఆ ఎన్నికల తర్వాత మూడేళ్ళపాటు రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రత్యేకించి రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా ఇవ్వడంలో జరుగుతున్న జాప్యాన్ని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు, ప్రజలు నిరసిస్తున్నా చంద్రబాబుకు మాత్రం నరేంద్ర మోదీ ఒక మహా నేత. ఆదర్శ మూర్తి. ప్రత్యేక హోదాలో ఏమీ లేదు, ప్రత్యేక ప్యాకేజీ తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ప్రజలను నమ్మబలికే ప్రయత్నాలు చేశారు. హోదా అన్నవారిపై పోలీసులను ఉసిగొల్పారు. కేసులు పెట్టించారు. జైళ్ళపాలు చేశారు. తనకు 40 యేళ్ళ సుదీర్ఘ అనుభవం ఉందని, ఆ అనుభవంతోనే హోదా వదిలి ప్యాకేజి మంచిదని గ్రహించానని, అవగాహనా, అనుభవం లేని నేతలు మాత్రమే హోదాకోసం పోరాడుతున్నారని, రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Image result for rally charge a police

రాష్ట్రంలో ప్రతిపక్ష వైస్సార్ కాంగ్రెస్ సుదీర్ఘ పోరాటంతో ప్రత్యేకహోదా అంశం ప్రజల ఎజెండాగా మారడంతో చంద్రబాబు అప్పుడు కళ్ళు తెరిచి ప్యాకేజి వద్దు హోదాయే కావాలంటూ సరికొత్తరాగం అందుకున్నారు. తానె ఈ రాష్ట్రంలో హోదాకోసం పోరాటం చేస్తున్న నిజమైన నేతనని డబ్బాకొట్టుకున్నారు. అయన పచ్చమీడియా కూడా హోదాకు వ్యతిరేకంగా అయన చేసిన వ్యాఖ్యలను పక్కన పెట్టి అయన అనుడుకున్న సరికొత్త రాగానికి వంతపాడటం మొదలుపెట్టారు. అలాగే అయన బీజేపీని వదిలి కాంగ్రెస్ కౌగిట్లోకి చేరి ఇప్పుడు ఇంకో కొత్త రాజకీయం చేస్తున్నా అవేమీ మీడియాకు కనపడవు, వినపడవు. ఇది అయన అవకాశవాద రాజకీయం. ఇక శ్వేతపత్రాలు విషయానికి వస్తే రాష్ట్రం పదహారువేలకోట్ల రూపాల లోటుబడ్జెట్ తో మొదలయింది. కేంద్రంనుండి పెద్దగా నిధులు లేవు. రాష్ట్రంలో కూడా కొత్తగా ఆదాయం పెంచే వనరులు లేవు. అయినా రాష్ట్రంలో వృద్ధి రేటు 14 శాతం వరకూ వెళ్ళిందని చంద్రబాబు చెపుతున్నారు.

Image result for swatha patralu chandra babu naiduజాతీయ వృద్ధిరేటు కన్నా, మిగిలిన రాష్ట్రాల్లో వృద్ధిరేటు కన్నా ఆంధ్ర ప్రదేశ్ వృద్ధి రేటు గొప్పదని చెపుతారు. జనం నమ్మాలి. నిధులు లేవు. లోటు తీరలేదు. అప్పులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అయినా వృద్ధిరేటు ఎలా పెరిగిందో అయన చెప్పే లెక్కలు ఎక్కడినుండి వచ్చాయో తెలియదు. ఇక రాష్ట్రంలో వ్యవసాయం కూడా ప్రగతి పదంలోనే ఉందని చంద్రబాబు చెపుతున్నారు. ఈ నాలుగేళ్ళలో రాష్ట్రంలో సరైన వర్షపాతం లేదు. సగటు వర్షపాతం కంటే తక్కువ నమోదైంది. రాష్ట్రంలో అనేక జిల్లాలు కరువు భారిన పడ్డాయి. పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Related image

అనేక ప్రాంతాల్లో రైతులూ, రైతు కూలీలు వలసలు వెళ్ళారు. అయినా దేశంలో వ్యవసాయ వృద్ధి కంటే రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధి ఎక్కువగా ఉందంటూ లెక్కలు చెపుతున్నారు. ఆదాయం లేకున్నాయా అభివృద్ధి జరిగిందని, వర్షాలు లేకున్నా పంటలు పండాయని చంద్రబాబు చెపుతుంటే పచ్చమీడియా వంతపాడుతోంది. దోసిళ్ళతో నీళ్ళుపోస్తే పంటలు పండాయని, రైతులు లాభాలతో పండగ చేసుకుంటున్నారని చంద్రబాబు చెపుతున్నారు. పైగా ఈ నాలుగేళ్ళలో తాను కొత్తగా సారవంతమైన భూములు తయారు చేశానని చెపుతున్నారు. సబ్బులు, బ్లేడులు తయారుచేసినట్టు సారవంతమైన భూములు కూడా ఆయనే తయారు చేశారు. “వినేవాడు విలేకరి అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు” అని ఒక సామెత ఇప్పుడు మరోసారి రుజువు అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here