హైకోర్టు విభజన పై చంద్రబాబు విమర్శలు అర్ధరహితం

0
765
జగన్ కోసమే అన్న అనుమానం హాస్యాస్పదం ఎపి తెలంగాణ ఉమ్మడి హైకోర్టును విభజన చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొద్దిరోజులు మౌనం వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి విమర్శలు ప్రారంభించారు గడిచిన కొన్ని రోజులుగా మోదీ పర్యటన సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ముఖ్యమంత్రి. హైకోర్టు విభజన అంశాన్ని కూడా ఆఖాతాలో వేసినారు. పనిలో పనిగా జగన్ కేసులను ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందా అన్న అనుమానాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు. హైకోర్టు విభజనకు మూలం బాబుగారి ఆలోచనే…. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ లో ఏపీకి 10 సంవత్సరాలు పాటు ఉమ్మడి అధికారం ఉంది. దాన్ని వదులుకుంది ఎవరి ప్రయోజనాల కోసం. హైదరాబాద్ పై హక్కును వదులుకోవడం అంటే సీమాంద్ర ప్రజలకు హైదరాబాద్ లోని అవకాశాలను కూడా వదులు కోవడమే.
Related image
ఉమ్మడి ఎంసెట్ వదులు కోవడం వలన సీమాంధ్ర విద్యార్థులు ఉస్మానియా , గాంధీ మెడికల్ కళాశాలలలో 10 సంవత్సరాలు మెడికల్ సీట్లను కోల్పోయినారు. విభజన చట్టం ప్రకారం ఏపీ కి హైకోర్టును కేంద్రం సాయంతో నిర్మించుకునే అవకాశం ఉంది. ఏపీలో హైకోర్టు నిర్మాణం జరిగే వరకు ఉమ్మడి హైకోర్టు విభజనను ఏపీ ప్రభుత్వం ఎలా అంగీకారాన్ని తెలిపింది. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో తాము డిసెంబర్ 15 నాటికి హైకోర్టు నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటామని ఆపిడివిట్ దాఖలు చేసినట్లు పత్రికలలో వార్తలు వచ్చాయి. న్యాయమూర్తుల బృందం కూడా జరుగుతున్న ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చెందినట్లు ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. వీటి ఆధారంగానే బహుశా కేంద్రం కోర్టు విభజన కు నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. తాను విభజన కు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుని నేడు వ్యతిరేకంగా మాట్లాడటం రాజకీయం కాక ఇంకేంటి. జగన్ కేసులు ప్రభావితం హాస్యాస్పదం…… పనిలో పనిగా హైకోర్టు విభజనను జగన్ కేసులను ప్రభావితం చేయడానికేనా అన్న అనుమానం వచ్చేలా విమర్శలు చేసినారు.
Image result for high court ap
ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్క జగన్ కేసులు విచారణ చివరి దశకు చేరుకుంది కోర్టు విభజన జరిగి , జడ్జీ మారితే విచారణ మొదటికి వస్తుంది. వాస్తవానికి జగన్ కేసులు అసలు విచారణ ప్రారంభం కాలేదు. సిబిఐ తనపై పెట్టిన కేసును డిశ్చార్జి చేయాలని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్ ప్రస్తుతం దానిపై విచారణ జరుగుతుంది. న్యాయ ప్రక్రియలో ముద్దాయి తనపై పెట్టిన కేసును విచారణకు స్వీకరించకుండా డిస్మిస్ చేయాలని కోరడం అనేది సహజం. జగన్ పిటిషన్ ను సిబిఐ కోర్టు తిరస్కరించినచో జగన్ హైకోర్టు కు వెళ్ళవచ్చు అదే జగన్ పిటిషన్ కోర్టు అంగీకరించితే సిబిఐ హైకోర్టుకు వెళుతుంది.
Related image
అంటే ప్రస్తుతం జగన్ కేసులు విచారణ చేయాలా , వద్దా అనే విషయం తేలాల్సి ఉన్నది. దానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అలాంటి దశలో ఉన్న కేసును విచారణ చివరి దశకు చేరుకుంది అని విభజన కారణంగా మళ్ళీ మొదటికి వస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారు మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించడమే. హైకోర్టు విభజన చుట్టూ అనేక సమస్యలు….. హైకోర్టు విభజన ముఖ్యమంత్రి హైదరాబాద్ నుండి అమరావతికి వచ్చి నంత సులభం కాదు. కనీస సౌకర్యాలు కల్పించలేదు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని కోల్పోయిన రాయలసీమకు కనీసం హైకోర్టు అయినా ఇవ్వాలని సీమ ప్రజలు కోరుతున్నారు.
Image result for లాయర్ల court
అంతే కాదు కోర్టు విభజన అంశం చుట్టూ 2 వేల మంది లాయర్ల భవితవ్యం కూడా ఉంటుంది. అకస్మాత్తుగా 2 వేల మంది లాయర్లు హైదరాబాద్ నుండి విజయవాడ రావాలంటే , వారితో బాటు వారి సహాయకులు అంతా కలిసి 4 నుంచి 5 వేల కుటుంబాలు ఒక్కసారిగా అమరావతికి రావడం వలన వారి సౌకర్యాలు పరిస్థితి ఏమిటి పిల్లలను విద్యాసంవత్సరం మధ్యలో మార్చడం సాధ్యమా. అనుమానాలకు ఆస్కారం కలిపిస్తున్న బాబుగారి చర్యలు…. హైకోర్టు విభజన చుట్టూ ముడిపడి ఉన్న అంశాలను ఏపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండానే డిసెంబర్ 15 నాటికి కోర్టు నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటామని సుప్రీం కోర్టుకు తమ అంగీకారాన్ని ఎలా తెలిపింది.
ప్రతి చిన్న విషయానికి కేంద్రానికి లేఖలు వ్రాసే అలవాటు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టు విభజన అంశం పై విభజన చట్టం ఏమి చెపుతుంది. హైదరాబాద్ లో ఏపీకి ఉన్న హక్కు ఏమిటి లాంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తూ లేఖ వ్రాయాలి. అలా అధికారికంగా స్పందించకుండా కేవలం రాజకీయ విమర్శలకె ముఖ్యమంత్రి చంద్రబాబు పరిమితం అయితే మాత్రం టీపీపీ పార్టీకి రాజకీయ ప్రయోజనం తప్ప రాష్ట్ర ప్రయోజనాల పట్ల నిజాయితీ లేదని భావించాల్సి వస్తుంది
గాదె బ్రహ్మారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here