ప్రత్యేక హోదా పోగొట్టిన ద్రోహం నీదేగా బాబూ?

0
279

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడం పట్ల ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు రక్తం మరుగుతోంది. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని ఆయనకు ఇప్పుడు తెలిసొచ్చింది. నాలుగున్నరేళ్ళుగా బీజేపీ పొత్తిళ్ళలో పెరిగిన చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీని ప్రపంచంలోనే అత్యంత ఉత్తముడు అని రాష్ట్ర శాసనసభ సాక్షిగా బిరుదులిచ్చి బాకాలు కొట్టిన చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా కళ్ళు తెరిచి రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, అది బీజేపీ వల్లే అని గగ్గోలు పెడుతున్నారు. నిరసన పేరుతో నల్లచొక్కా కూడా తొడుక్కొని అసెంబ్లీకి హాజరయ్యారు.

Related image

బహుశా భారత దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి నిరసన స్వరంతో నల్ల బట్టలతో శాసనసభకు హాజరు కావడం ఇదే ప్రధమం. సాధారణంగా ప్రతిపక్ష నేతలు ఇలా నిరసనలు చేస్తుంటారు తప్ప అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇలా నిరసనలు తెలపడం ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు. అది చంద్రబాబుకే సాధ్యం. ఇక చంద్రబాబు గారి నిరసనల సంగతి పక్కన పెడితే ఆయనకు కోపం ఎందుకొచ్చిందో, అయన రక్తం ఎందుకు మరుగుతోందో కాస్త విశ్లేషిస్తే అయన అసలు రంగు బయట పడుద్ది. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అయన చెపుతుంటే ఆ అన్యాయానికి ఆయనే కారణం అని రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు.

Related image

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నది చంద్రబాబు. హోదా సంజీవని కాదు అన్నది చంద్రబాబు. హోదాతో ఏం వస్తుంది అన్నది చంద్రబాబు. హోదాతో ఈశాన్య రాష్ట్రాలు ఏం సాధించాయి అని ఎదురు దాడి చేసింది చంద్రబాబు. హోదా కోసం ఆందోళన చేస్తున్న పార్టీలు, ప్రజలపై పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయించింది చంద్రబాబు. హోదా అంటే జైలుకే అన్నది, జైలుకు పంపింది చంద్రబాబు. హోదా బదులు ప్యాకేజిని స్వాగతించింది చంద్రబాబు. ప్యాకేజి స్వాగతిస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయించింది చంద్రబాబు. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని ఘనంగా సత్కరించింది చంద్రబాబు. ప్యాకేజి ద్వారా దేశంలో ఏ రాష్ట్రం సాధించని నిధులు ఆంధ్ర ప్రదేశ్ సాధించింది అని ప్రకటించింది చంద్రబాబు.

Related image

తన నలభయ్యేళ్ళ రాజకీయ, పరిపాలనా అనుభవంలో తానింతవరకు ఇలాంటి అభివృద్ధి పధకాన్ని చూడలేదని చెప్పింది కూడా చంద్రబాబే. తాను ముందుచూపు ఉన్న, పరిణతి చెందిన రాజకీయ వెట్టనని, పరిపాలనాదక్షుడినని తన అనుభవం అంతా వడబోసి కేంద్రం అండతో రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో పరుగెత్తిస్తానని చెప్పింది చంద్రబాబే. ఈ నాలుగేళ్లుగా ప్రజలకు ఇలాంటి కబుర్లు చెపుతూ ప్రజల్ని మభ్యపెడుతూ కలాం గడిపిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు కేవలం రెండు నెలలే ఉండడంతో కళ్ళు తెరిచి రాష్ట్రానికి అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు.

Image result for chandra babu meetings

అన్యాయం కూడా బీజేపీ నాయకత్వం, నరేంద్రమోడీ ప్రభుత్వం చేసిందని మొసలి కన్నీరు కారుస్తున్నారు. పచ్చమీడియా అండ చూసుకొని తాను ఏం చెప్పినా ప్రజలు గుడ్డిగా గొర్రెల్లా నమ్ముతారని భ్రమ పడుతున్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను మోసం చేసి నాలుగేళ్లుగా దోచుకు తింటున్న చంద్రబాబు రాష్ట్రాన్ని మరోసారి దోచుకోడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. తన మొసలి కన్నీరు ప్రజలు నమ్ముతారని, మళ్ళీ తనకే పట్టం కడతారని నమ్ముతున్నారు. అయన నమ్మకాన్నీ, అయన పచ్చమీడియా నమ్మకాన్ని ప్రజలు తలకిందులు చేయబోతున్నారు. ఇదే జరిగేది. ఇక్క బాబుగారికి మిగిలింది నల్లచొక్కాయే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here