టైం చూసి దెబ్బ కొట్టిన జ‌గ‌న్ : వైసిపి లోకి వ‌ల‌స‌ల క్యూ..!

0
5625

నాడు వైసిపి నుండి గెలిచిన ఎమ్మెల్యేల‌ను టిడిపి ప్ర‌లోభ పెట్టింది. ఏకంగా 23 మంది ఎమ్మెల్యేల‌ను టిడిపిలో చేర్చుకొని అందు లో న‌లుగురికి మంత్రి ప‌ద‌వుల‌ను క‌ట్టబెట్టింది. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల ముందు వైసిపి అధినేత జ‌గ‌న్ టిడిపి అధి నేత చంద్రబాబుకు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ను ల‌క్ష్యంగా చేసుకొని మొద‌లు పెట్టి న జంపింగ్ లు ఇప్పుడు టిడిపికి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో..ఇప్పుడు టిడిపి లో అంత‌ర్మ‌ద‌నం మొద‌లైంది.

వైసిపి లోకి వ‌ల‌స‌ల వెల్లువ‌.. వైసిపి నుండి వ‌ల‌సలు ప్రోత్స‌హించి జ‌గన్ పై న‌మ్మ‌కం లేక వారంతా పార్టీని వీడుతున్నార‌ని పార్టీ నేత‌లు ప్ర‌చారం చే సారు. ఇప్పుడు ఎన్నిక‌ల ముందు స్వ‌యంగా చంద్రబాబు బుజ్జిగించినా కీల‌క నేత‌లు టిడిపిని వీడి వైసిపి బాట ప‌డు త‌న్నారు. టిడిపి నుండి తొలుత రావెల కిషోర్‌బాబు పార్టీని వీడి జ‌న‌సేన లో చేరారు. ఆ త‌రువాత విప్ గా ఉన్న మేడా మ‌ల్లిఖార్జున రెడ్డి టిడిపిని వీడి వైసిపి లో చేరారు. ఇక‌, చీరాల లో కీల‌న నేత‌గా ఉన్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ను టిడిపి వీడ‌కుండా చూసేందుకు ముఖ్య‌మంత్రి తో స‌హా అంద‌రూ అనేక ప్ర‌య‌త్నాలు చేసారు. కానీ, అమంచి త‌న నిర్ణ‌యం మార్చుకోలేదు. ఇక‌, తాజాగా ఏకంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న అన‌కాప‌ల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ టిడిపికి రాజనామా చేసి మ‌రీ వైసిపి లో చేరారు. అంత‌టితో ఆగ‌లేదు. చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలి..ఆయ‌న తీరు పైనా నిప్పులు చెరిగారు. జ‌గ‌న్ వ్య‌క్తిత్వాన్ని ఆకాశానికెత్తారు.

క్యూ లో మ‌రింత మంది .. టిడిపి నుండి వైసిపి లో వ‌ల‌స వ‌చ్చే వారు త‌మ‌తోనే ప్రారంభ‌మైంద‌ని..త్వ‌ర‌లో మ‌రింత మంది టిడిపి ని వీడ‌టానికి సిద్దంగా ఉన్నార‌ని అవంతి శ్రీనివాస్ వెల్ల‌డించారు. అయితే, వైసిపి నుండి అందుతున్న స‌మాచారం మేర‌ర‌కు మ‌రో ఎంపి రేపో మాపో వైసిపి లోకి వ‌స్తార‌ని చెబుతున్నారు. అదే విధంగా తూర్పు గోదావ‌రి లో కీల‌క ఎమ్మెల్యే..ఉత్త‌రాంధ్ర నుండి ఇద్ద‌రు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైసిపి లోకి రావ‌టానికి సిద్దంగా ఉన్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. విశాఖ లో వాప్త‌వంగా వైసిపి కొంత బ‌ల‌హీనంగా ఉంది. అక్క‌డి సామాజిక స‌మీక‌ర‌ణాలు..అంగ‌-ఆర్దిక బ‌లం ఆధారంగా ఇప్పు డు చేరుతున్న నేత‌ల ద్వారా వైసిపికి నైతికంగా బ‌లం పెరుగ‌తోంద‌ని అంచనా. ఎన్నో వ‌రాల ప్ర‌క‌ట‌న ద్వారా త‌మ‌కు ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరుగుతుంద‌ని భావిస్తున్న వేళ‌..జ‌గ‌న్ సరిగ్గా స‌మ‌యం చూసి కొడుతున్న దెబ్బ‌కు 40 ఏళ్ల అనుభ‌వం ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డి పోతోంది. అయితే, ఇప్పుడు ఇంకా టిడిపి నుండి ఎవ‌రు టిడిపిలోకి వ‌స్తార‌నేది ఆస‌క్తి క‌రంగా మారు తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here