జ‌గ‌న్ పై నాడు ఆలా..నేడు ఇలా : మారిందెవ‌రు..అందుకే ఈ చేరిక‌లు..!

0
2231

వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత ఏపిలో జ‌గ‌న్ పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు..విమ‌ర్శ‌లు..వ్య‌క్తిత్వ హ‌న‌నం..ఇలా మ‌రే నేత మీదా జ‌ర‌గి ఉండ‌దు. నాడు జ‌గ‌న్ ను పూర్తిగా వ్య‌క్తిత్వ హ‌న‌నం చేసి రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం పొందేందుకు టిడిపి అండ‌త‌లో చాలా మంది ప్ర‌య‌త్నాలు చేసారు. కానీ, జ‌గ‌న్ నిల‌బ‌డ్డాడు. పార్టీని నిల‌బెట్టాడు. నేడు..ఆ నేత‌లే జ‌గ‌న్ వ్య‌క్తిత్వాన్ని ప్ర‌శంసిస్తు న్నారు. జ‌గ‌న్ వ్య‌క్త‌త్వం ..ఆలోచ‌న‌..చిత్త‌శుద్ది ముందు చంద్రబాబు నిల‌వ‌ర‌ని చెబుతున్నారు. అయిదేళ్ల కాలంలో ఎంత మార్పు.. ఖ‌చ్చితంగా గెలుస్తుంద‌నే న‌మ్మం.. ఈ మార్పు ఇప్పుడు వైసిపి వైపు వ‌ల‌స‌లు పెర‌గ‌టానికి ప్ర‌ధాన కార‌ణం..

జ‌గ‌న్ ను నాడు దారుణంగా.. జ‌గ‌న్ ఎవ‌రితో మాట్లాడ‌డు..పెద్ద‌ల‌ను గౌర‌వించ‌డు..డ‌బ్బు మాత్ర‌మే కావాలి…ఫ్యాక్ష‌నిస్టు..తండ్రి మృత‌దేహం ప‌క్క‌న పె ట్టుకొని సీయం చేయాలంటూ సంతకాలు సేక‌రించారు..ల‌క్ష కోట్లు ఆర్జించారు..జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే అరాచ‌కం రాజ్య‌మేలుతుంది. అనుభ‌వం లేని జ‌గ‌న్ ఎలా ప‌రిపాల‌న చేస్తారు..ఇలా ఎన్నో ర‌కాలుగా రాజ‌కీయంగా.. వ్య‌క్తి గ‌తంగా జ‌గ‌న్ పై చేయ‌ని విమ‌ర్శ లేదు. చేయ‌ని ఆరోప‌ణ లేదు. అయినా..జ‌గ‌న్ త‌డ‌బ‌డ‌లేదు. వెన‌క్కు త‌గ్గ‌లేదు. త‌న తండ్రి నుండి అందిపుచ్చుకున్న విశ్వ‌స‌నీయ‌త అనే ఆయుధంతో ముందుకు వెళ్లారు. సుదీర్ఘ పాద‌యాత్ర చేసారు. నిర్మాణాత్మ క విమ‌ర్శ‌లు మిన‌హా.. అర్దం ప‌ర్దం లేని ఆరోప‌ణ‌లు చేయ‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం న‌వ ర‌త్నాలు ప్ర‌క‌టించారు. అవే ఇప్పుడు ఎన్నిక‌ల అస్త్రాలుగా మారాయి. ఇక‌, జ‌గ‌న్ వ్య‌క్తిత్వాన్ని..ప్ర‌జ‌లు ఎందుకు ఇంత గా ఆద‌ర‌ణ చూపిస్తున్నారో..అర్దం చేసుకున్న నాటి విమర్శ‌కులే నేడు అభినందిస్తున్నారు. లోట‌స్ పాండ్ కు క్యూ క‌డు తున్నారు. ప్ర‌జ‌ల ఆలోచ‌న‌కు త‌గిన‌ట్లుగా న‌డుచుకో కుంటే న‌ష్టం త‌ప్ప‌ద‌ని గ్ర‌హించారు.

ద‌గ్గుబాటి నుండి అవంతి వర‌కు.. జ‌గ‌న్ పై ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యుడు ప్ర‌శంస‌లు కురిపించారు. తాను జ‌గ‌న్ ను ఎంతో కాలంగా గ‌మ‌నిస్తున్నాన‌ని…తా ను విన్న దానికి..చూసిని దానికి పొంత‌న లేద‌న్నారు. ఒక పార్టీ అధినేత‌గా జ‌గ‌న్ పూర్తి స్థాయిలో స‌క్సెస్ అయ్యారంటూ ప్ర‌శ‌నంసించారు. జ‌గ‌న్ ప‌రిణితి చెందిన నేత అంటూ అభినందించారు. ఇక‌, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ సైతం జ‌గ‌న్ పై న‌మ్మ‌కం ఉంచారు. చంద్ర‌బాబు చేస్తున్న ప‌నుల‌ను..ఆయ‌న వ్య‌వ‌హార శైలి పై మండిప‌డ్డార‌దు. ఇక‌, సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్ సైతం ప్రత్యేక హోదా విష‌యంలో జ‌గ‌న్ నిబ‌ద్ద‌త‌ను ప్ర‌శంసించారు. వైసిపి ఎంపీలు రాజీనామా చేసిన స‌మ‌యంలోనే రాజీనామా చేద్దామ‌ని తాను ప్ర‌తిపాదిస్తే ముఖ్య‌మంత్రి అంగీక‌రించ‌లేద‌ని వివ‌రించారు. జ‌గ‌న్ ఎప్పుడైనా ఒకే స్టాండ్ మీద ఉన్నార‌ని..ఎప్పుడు ప‌డితే అప్పుడు త‌న నిర్ణ‌యాలు మార్చుకోలేద‌ని అభినందించారు. ఇప్పుడు..టిడిపి నేత‌ల్లో ఇదే భ‌యం వెంటాడుతోంది. తాము ఇంత‌కాలం చేసిన విమ‌ర్శ‌లకు విలు వ లేద‌ని తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు ఇదే కార‌ణంతో మ‌రి కొంత మంది వైసిపి వైపు ఆశ‌గా చూస్తున్నారు. ఇక‌, ఇది ప్ర‌జ‌ల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here