బాబూ, ఇంకా ఎందుకు మీ పాలన?

0
450
రాష్ట్రం ఇప్పుడు అట్టుడికి పోతోంది. ప్రధానంగా రెండు అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తెలుగుదేశం పాలనపై తిరుగుబాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. బాబూ మీ పాలన మాకొద్దు అని నినదిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుండి ఏ మారుమూల చూసినా ఇవే ఆందోళనలు. మూకుమ్మడిగా ప్రజలు బాబూ బై బై అంటున్నారు. ఈ ఆందోళనకు రెండు రెండు కారణాలు. ఒకటి గుంటూరు జిల్లాలో రైతు ఆత్మహత్య. రెండోది దళితులకు రాజకీయ హక్కు లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు. ఈ రెండు కారణాలూ చాలు ప్రపంచ మేధావిని ఇంటికి పంపించడానికి. ఈ రెండు కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు చేస్తున్న ఆందోళన చాలు దేశంలోని అత్యంత సీనియర్ నేతను అని చెప్పుకునే చంద్రం సార్ కి విశ్రాంతి ఇవ్వడానికి.
గుంటూరు జిల్లాలో కొండవీడు ప్రాంతంలో రైతు కోటేశ్వర రావు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రాన్ని కుదిపి వేసింది. వారం రోజుల క్రితం కొండవీడు ఉత్సవాలు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రాంతానికి హెలీకాఫ్టర్లో వెళ్ళారు. అయన హెలికాఫ్టర్ కోసం అధికారులు, పోలీసులు కోటేశ్వరరావు పంటపొలాన్ని ధ్వంసం చేసి హెలిపాడ్ నిర్మించారు. తన పంటపొలం ధ్వంసం చేయొద్దని కోటేశ్వర రావు కాళ్ళా వెళ్ళా పడ్డా అధికారులు వినిపించుకోలేదు. నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తే పోలీసులు లాఠీలకు పని చెప్పారు. నిర్ధాక్షిణ్యంగా కోటేశ్వరరావును కొట్టి, అయన బొప్పాయి పంటను ధ్వంసం చేసి అక్కడ హెలిపాడ్ ఏర్పాటు చేశారు. ఈ విషయాలు ముఖ్యమంత్రికి ముందుగా తెలియకపోవచ్చు. కానీ అక్కడ హెలికాఫ్టర్ దిగిన తర్వాత అయినా ధ్వంసం అయిన పంటపొలాన్ని చూసి అయినా చంద్రబాబు అధికారులను హెచ్చరించి ఉండాల్సింది. అప్పుడే ఆ పొలం ఎవరిదీ, రైతు ఎవరు అని ఆరా తీసి ఆ రైతుతో మాట్లాడి నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఉండాల్సింది. వ్యవసాయం దండగ అనే చంద్రబాబు, రాజధాని పేరుతో పచ్చని పంటపొలాలను ధ్వంసం చేసిన చంద్రబాబు తన బాద్యతను విస్మరించి, ధ్వంసం అయిన పంటపొలాన్ని, ఆ పొలానికి చెందిన రైతును పట్టించుకోకుండా ఉత్సవాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ రైతుకు నష్టం చేసి, రైతుకు కష్టం కలిగించి, రైతు కంట నీరు తెప్పించి, రైతును శోకంలో ముంచేసి అయన కొండవీడు ఉత్సవాల్లో పాల్గొన్నారు. అదీ చంద్రబాబు పనితీరు.
అయితే పంట నష్టపోయి, పోలీసుల చేతిలో దెబ్బలు తిని తీవ్ర అవమానానికి గురైన రైతు కోటేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయన ఆత్మహత్యకు పాల్పడడం అక్కడ విధినిర్వహణలో ఉన్న పోలీసులకు తెలుసు. అయినా ముఖ్యమంత్రి ఆ ప్రాంతం నుండి వెళ్ళేవరకు ఆ రైతుకు వైద్య సహాయం అందకుండా చూసి, ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాత హడావిడిగా రైతును భుజాలపై మోస్తూ, దాన్ని వీడియో తీసి తామేదో రైతు ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశామని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. కోటేశ్వరరావు మృతిపట్ల ఆ ప్రాంతంలో రైతులు, ప్రజలు రోజంతా ఆందోళన చేశారు. అధికారులు, పోలీసులు మాత్రం తమ తప్పేమీ లేదని చేతులు దులిపేసుకుంటున్నారు. పైగా ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఒకరిద్దరు రైతులను నిర్బంధించి వాస్తవాలను కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక బాబుకు విశ్రాంతి ఇవ్వాల్సిన మరో అంశం చింతమనేని ప్రభాకర్ దళితులపై చేసిన వ్యాఖ్యలు. “మీరు దళితులు. మీరు ఎస్సిలు. మీరు వెనుకబడిన కులం వాళ్ళు. మీకెందుకు రాజకీయాలు? రాజకీయాలు మావి. మీవి కాదు” అంటూ కుల దురహంకార పూరిత వ్యాఖ్యలు చేశారు. “ఎస్సిలుగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు” అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన తర్వాత అయన పచ్చ తమ్ముళ్ళు, ప్రత్యేకించి చింతమనేని ప్రభాకర్ వంటి నేతలు ఇంతకంటే తక్కువ వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేం. కుల దురహంకారం, అధికార మత్తు నిలువెల్లా ఎక్కిన తెలుగుదేశం నాయకులు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. కేవలం ఐదేళ్ళు అధికారంలో ఉన్నందుకే అహంకారం, పొగరు ఈ స్థాయిలో ఉంటే వీళ్ళకు మరో ఐదేళ్ళు అధికారం కట్టబెడితే ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో కమ్మకులం మినహా మిగిలిన ప్రజల్ని ఏస్థాయిలో, ఎంత హీనంగా చూస్తారో వేరే చెప్పనవసరం లేదు.
రాష్ట్రాన్ని నిలువునా దోచేస్తున్న తెలుగుదేశం నాయకులు, వనజాక్షిలాంటి అధికారులపై దాడులు చేస్తున్న తెలుగుదేశం నాయకులకు, ప్రత్యేకించి చింతమనేని ప్రభాకర్ వంటి నాయకులకు అధికారంలో ఉండే హక్కు లేదు. “మంచి అన్నది మాల అయితే, మాలను నేనవుతా” అంటూ రాష్ట్ర శాసనసభలో ప్రకటించిన ప్రతిపక్ష వైస్సార్ కాంగ్రెస్ నేత జగన్మోహన్ రెడ్డికి, “ఎస్సిలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు” అన్న చంద్రబాబు నాయుడుకు, బడుగు బలహీన వర్గాలకు 50 శాతం రేజర్వేషన్స్ కల్పిస్తా అని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డికి, దళితులకు రాజకీయాలెందుకు అని ప్రకటించిన చింతమనేని వంటి తెలుగుదేశం నేతలకు పోలిక ఎక్కడ? ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండాల్సిన పార్టీ ఏది? ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాల్సిన నేత ఎవరు? ఇప్పుడు తేల్చుకోవాల్సింది ప్రజలే. తేల్చుకోవాల్సిన సమయం ఇదే. పచ్చనేతలను ఇంటికి పంపించాల్సిందే. పచ్చ మీడియా గొంతు మూయించాల్సిందే. తప్పదు. ఇది ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఒక చారిత్రక అవసరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here