జెసి బ్ర‌ద‌ర్స్ కు చంద్ర‌బాబు ట్విస్ట్ : ఇప్పుడు ఏం చేయాలి..!

0
1541

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..అనంత‌పురం టిడిపి లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ సీటు వ‌దులుకోవ‌టానికి సిద్దంగా లేన‌ని చెబుతున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సీనియ‌ర్ నేతలైన జెసి బ్ర‌ద‌ర్స్ కు ఊహించ‌ని విధంగా నిర్ణ‌యా లు తీసుకుంటున్నారు. వారు పోటీ చేయ‌టం మొద‌లు..అనంత‌పురం లోక్‌స‌భ ప‌రిధిలో సీట్ల కేటాయింపు వ‌ర‌కూ తాను నిర్ణ‌యించిన విధంగానే చంద్ర‌బాబు ముందుకు వెళ్తున్నారు.

ఈ సారి ఎన్నిక‌ల్లో తాము పోటీ చేయ‌బోమ‌ని…త‌మ వార‌సులు అనంత‌పురం లోక్‌స‌భ నుండి అదే విధంగా తాడిప‌త్రి అసెంబ్లీ నుండి పోటీ చేస్తామ‌ని జేసి బ్ర‌ద‌ర్స్ ప్ర‌క‌టించారు. దీనికి అనుగుణంగానే జేసి దివాక‌ర్ రెడ్డి కుమారుడు ప‌వ‌న్ ఇప్ప‌టికే లోక్‌స‌భ ప‌రిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాడిప‌త్రిలోనూ జెసి ప్ర‌భాక‌ర్ రెడ్డి కుమారుడు సీటు పై ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, టిడిపి అధినేత తాజాగా ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. 2014 త‌ర‌హాలోనే జేసి బ్ర‌ద‌ర్స్ పోటీ చేయాల‌ని సూచించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్ఠాత్మ‌క‌మ‌ని..వార‌సుల‌ను రంగంలోకి దింపే ప‌రిస్థితి కాద‌ని తేల్చిన‌ట్లు తెలుస్తోంది. జెసి బ్ర‌ద‌ర్స్ పోటీ చేసే ఎంపి..అసెంబ్లీ సీట్లు ఇస్తామ‌ని..లేకుంటే ఒక్క సీటు మాత్ర‌మే ద‌క్కుతుంద‌ని తేల్చి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు ఏం చేయాలి..ఏ ర‌కంగా నిర్ణ‌యం తీసుకొని ముందుకు వెళ్లాల‌నే దాని పై జేసి బ్ర‌ద‌ర్స్ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.

Image result for jc diwakar prabhakar photosఒక వేళ‌..జేసి బ్ర‌ద‌ర్స్ పోటీకి ముందుకు రాక‌పోతే అనంత‌పురం ఎంపీగా ప్ర‌స్తుత మంత్రి కాల్వ శ్రీనివాసులును బ‌రిలో కి దించాల‌ని ముఖ్య‌మంత్రి యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. తాడిప‌త్రి నుండి జేసి బ్ర‌ద‌ర్స్ లో ఒక‌రు పోటీ చేయాల‌ని ఆయ‌న సూచింనట్లుగా తెలుస్తోంది. అదే విధంగా..అనంత‌పురం లోక్‌స‌భ ప‌రిధిలో మూడు సెగ్మెంట్ల‌లో అభ్య‌ర్ధుల‌ను మార్చాల‌ని జేసి..సీయం వ‌ద్ద ప్ర‌తిపాదించారు. కాగా, ముఖ్య‌మంత్రి మాత్రం కేవ‌లం గుంత‌క‌ల్ కు మాత్ర‌మే కొత్త వారికి అవ‌కాశం ఇస్తాన‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దీంతో..మాజీ ఎమ్మెల్యే మ‌ధుసూద‌న గుప్తాను బ‌రిలోకి దింపాల‌ని కొంత కాలంగా జేసి చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు సీయం ఆమోద ముద్ర వేసారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జితేంద‌ర్ గౌడ్ కు ఈ సారి ఛాన్స్ లేన‌ట్లే. అయితే, ఇప్పుడు ప్ర‌జ‌ల్లో త‌మ వార‌సులు రంగంలోకి దిగుతార‌ని ప్ర‌చారం చేసుకున్న త‌రువాత ఈ స‌మ‌యంలో పార్టీ అధినేత ఇచ్చిన ట్విస్ట్ తో జేసి బ్ర‌ద‌ర్స్ ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here