భయం గుప్పిట్లో పచ్చ బృందం

0
780

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలోని పచ్చ బృందానికి గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి. ఓటమి తప్పదని స్పష్టం అవుతుండడంతో రోజురోజుకూ పెరుగుతున్న భయాన్ని దాచుకోలేక నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారు. అలాగే ప్రజలనుకూడా భయ భ్రాంతులకు గురిచేసే వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వార్తలే వండి వార్చుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష వైస్సార్ కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవాలని, తమ అధికారాన్ని నిలుపుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, పచ్చ తమ్ముళ్ళు, బానిస మీడియా చేయని ప్రయత్నం లేదు.బీజేపీతో, తెరాస తో వైస్సార్ కాంగ్రెస్ కుమ్మక్కైందని, నరేంద్ర మోడీ, కెసిఆర్ తో జగన్మోహన్ రెడ్డి జట్టుకట్టి రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారని నోటికొచ్చిన అబద్దాలన్నీ మూటకట్టి జనంమీద రుద్దుతున్నారు. కూతుర్ని చూసేందుకు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ వెళితే హవాలా డబ్బు తేవడానికి వెళ్ళాడని నోరుపారేసుకుంటున్న పచ్చ ముఠా ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డికి వెయ్యికోట్ల రూపాయల సహాయం చేసేందుకు తెరాస నాయకత్వం సిద్ధం అయిందని ప్రచారం మొదలు పెట్టారు. ఇటీవల తెలంగాణాలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెరాసను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన చంద్రబాబు మొత్తం ఓ వెయ్యికోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయినా అక్కడ ఘోర పరాభవం జరగడంతో ఇప్పుడు అదే వెయ్యికోట్ల ఖర్చు జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసేందుకు ప్రచారం మొదలు పెట్టారు. లండన్ నుంచి తెచ్చే హవాలా డబ్బు కాకుండా తెరాస ఇచ్చే వెయ్యికోట్లతో ఎన్నికల్లో నెగ్గాలని జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నట్టు చంద్రబాబుకు కల వచ్చింది. ఆ కలను పచ్చ బానిస మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

మరోవైపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే రాష్ట్రంలో వీధిరౌడీలు పుట్టుకొస్తారని, ఎన్నికల్లో కడప రౌడీలను దించేందుకు, హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు కట్టుకథలు చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రజల్లో అభద్రతాభావం కలిగించి ఆ రకంగా ఎన్నికల్లో లబ్ది పొందాలనేది చంద్రబాబు ఉద్దేశం. ఓటమి భయాన్ని కప్పిపెట్టుకోడానికి, డబ్బు, రౌడీలు అంటూ చంద్రబాబు ఆరోపణలు మొదలు పెట్టారు. వైస్సార్ కాంగ్రెస్ ద్వారా రౌడీలు వస్తారని ప్రజలను భయపెడుతున్న చంద్రబాబు తన పార్టీలోని శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, బోండా ఉమాను మించిన రౌడీలు ఎక్కడున్నారో చెప్పాలి?చంద్రబాబు, అయన తెలుగుదేశం తెలంగాణాలో రాజకీయం చేస్తే అది ప్రజాస్వామ్యం. తెరాస ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయం చేస్తే అది కుట్ర. పైగా జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఆంధ్ర ప్రదేశ్ పై పెత్తనం చేసేందుకు తెరాస కుట్ర చేస్తోందని చంద్రబాబు చెప్పడం, పచ్చమీడియా ప్రచారం చేయడం చూస్తుంటే మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఎవరిమీద పెత్తనం చేద్దామని చంద్రబాబు పోటీ చేశారో పచ్చమీడియా చెప్పాల్సి ఉంది. తెలంగాణ వెళ్ళి అక్కడ తెరాస ను ఓడించాలని, ప్రత్యేకించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపును నిలువరించాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఓడించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తే అది రాజకీయం. చంద్రబాబును ఓడించడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రయత్నం చేస్తే అది అరాచకం, కుట్ర. ఇది చంద్రబాబు మార్కు నీతి.

అయితే ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా చంద్రబాబు చెప్పే మాటలు, చేసే పనులు ప్రజలు అర్ధం చేసుకునే స్థితిలో లేరని పచ్చతమ్ముళ్ళు, పచ్చమీడియా అనుకోవచ్చు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసే అలవాటు, అవకాశం తెలుగుదేశం పార్టీకే ఉంది. గత ఎన్నికల్లో విజయవాడలోని ప్రతిష్టాత్మక సిద్ధార్థ అకాడెమీ లో కోట్ల రూపాయలు దాచిపెట్టి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలలో అభ్యర్థులకు పంచిన చరిత్ర చంద్రబాబుది… ఈ డబ్బు ఎన్నికల అధికారులు పట్టుకున్నా ఆ తర్వాత ఆ కేసు ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అదే చంద్రబాబు మార్కు రాజకీయం. తాను ఎలాగో చిత్తశుద్ధి లేని రాజకీయాలే చేస్తున్నాను కాబట్టి అందరూ అలాగే చేస్తారని చంద్రబాబు నమ్మకం. అయితే పార్టీ స్థాపించిన నాటినుండి నేటివరకు రాజకీయాల్లో ఒక ప్రత్యేక ఒరవడిని జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. చంద్రబాబులాగా అవకాశవాద, అవినీతి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేయడం లేదు. తన పార్టీలో చేరే ప్రజాప్రతినిధులను తమ పదవులకు రాజీనామా చేయించి ఓ మంచి సంప్రదాయాన్ని అమలు చేస్తున్న నేత జగన్మోహన్ రెడ్డి అయితే ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను తన పార్టీలో చేర్చుకొని వారికీ మంత్రిపదవులు కూడా కట్టబెట్టిన ఘనత చంద్రబాబుది. ఇది ప్రజలకు తెలుసు. అందుకే పచ్చమీడియా దాడిని ప్రజలు మౌనంగా గమనిస్తున్నారు. తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు వారు సిద్ధమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here