అమ్ముల పొదిలో అస్త్రాలు అయిపోయాయా బాబూ, పాత కేసులు తోడుతున్నావ్?

0
671

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో అస్త్రాలన్నీ పోగొట్టుకొని మళ్ళీ పాత పాట మొదలుపెట్టారు. లక్షకోట్ల అవినీతి అంటూ 2014లో చేసిన ప్రచారాన్ని మరోసారి తెరమీదకు తెచ్చారు. తాజాగా 2017లో జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అప్పట్లో సీబీఐకి రాసిన లేఖను బయటకు తీసి జగన్ అవినీతిపరుడు అంటూ పాత చింతకాయ పచ్చడి పెట్టి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాత లేఖను పట్టుకొని ఇప్పుడు కొత్తగా తానేదో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు గంటలకొద్దీ ఉపన్యాసాలు ఇస్తున్నారు. జగన్ గజదొంగ అంటూ జనాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కుట్రల దొంగ చంద్రబాబు. రాజకీయాల్లో పొత్తులు మార్చడం, మాటలు మార్చడం, సిద్ధాంతాలు లేకుండా కేవలం అధికారమే పరమావధిగా పనిచేయడం చంద్రబాబు మార్కు రాజకీయం.

బీజేపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ ను తిట్టినా, కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకొని బీజేపీని తిట్టినా అది ఆయనకూ, అయన కుల మీడియాకు మాత్రమే చెల్లుతుంది. కమ్యూనిస్టులతో పొత్తుపెట్టుకొని బీజేపీని తిట్టినా, బీజేపీతో జట్టుకట్టి కమ్యూనిస్టులను ఎండగట్టినా అదికూడా చంద్రబాబుకే చెల్లుతుంది. ఇలాంటి రాజకీయాలు నడిపే చంద్రబాబు ఇప్పుడు గత తొమ్మిదేళ్ళుగా రాజకీయాల్లో నిబద్దత నిరూపించుకున్న జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూరిత ఆరోపణలు చేయడం, వాటిని కులమీడియా విస్తృతంగా ప్రచారం చేయడం జనాన్ని మోసం చేయడానికే. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కులమీడియా కుట్రలు నమ్మెందుకు ప్రజలు సిద్ధంగా లేరు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ కలిపి జగన్ పై కేసులు బనాయించి ఆయనను జైలుకు పంపిన తర్వాత ఇప్పటివరకూ మరో కొత్తకేసు ఏదీ ఆయనపై నమోదు చేయలేదు. పైగా అప్పట్లో పెట్టిన కేసులు కూడా ఒక్కొక్కటిగా కోర్టులు కొట్టేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాతకేసు ఒకటి దుమ్ముదులిపి బైటకు తెచ్చి ఇదేదో కొత్తగా పెట్టిన కేసు చందాన చంద్రబాబు ప్రచారం చేయడం దాన్ని కులమీడియా భుజానికెత్తుకొని విపరీతంగా ప్రచారం చేయడం చూస్తుంటే ఈ కుల నేతలు ఇంకా అప్డేట్ అయినట్టు కనిపించడం లేదు. తామేది చెపితే అదే నిజమని చంద్రబాబు, తామేది రాస్తే, తామేది చూపిస్తే అదే వార్తని కులమీడియా భ్రమల్లో ఉన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం, ఓట్ల కోసం ప్రభుత్వ ఖజానానుండి దోచిపెడుతుంటే కులమీడియా చప్పట్లు కొట్టడం ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం. వ్యాపారాల్లో ఆ కులమే. మీడియాలో ఆ కులమే. కాంట్రాక్టుల్లో ఆ కులమే. రాజకీయాల్లో ఆ కులమే. ఇప్పుడు కుట్రల్లో కూడా అగ్రస్థానం ఆ కులానిదే. రాష్ట్రానికి కులపిచ్చి పట్టించి రాష్ట్రాన్ని దోచుకోవాలని కులనేతలు చేస్తున్న కుట్ర ఇది. రాష్ట్రంలోని ఇతర కులాలకు గౌరవం లేదు. రాజకీయాల్లో గానీ, కాంట్రాక్టుల్లో గానీ, వ్యాపారాల్లో గానీ ఇతర కులాలను ముందుకెళ్లనివ్వకుండా ఎప్పటికప్పుడు ఈ కుల పిచ్చగాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కులపిచ్చి కాకపోతే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, దేశంలోనే అత్యంత సీనియర్ పొలిటిషన్ అని తనకు తానే చెప్పుకునే చంద్రబాబు ప్రతిపక్షంపై దిగజారుడు విమర్శలు ఎందుకు చేస్తారు? జగన్ అధికారంలోకి వస్తే మీ ఆస్తులు దోచుకుంటాడని, మీ ఇంటి ఆడపిల్లలు క్షేమంగా ఇళ్ళకు రారని పూర్తిగా బరితెగించి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అయనలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. వెన్నులో వణుకు వస్తోంది. కరకట్ట కింద సగం నదినీళ్ళల్లో పడుకున్నా ఆయనకు చమటలు పడుతున్నాయి తప్ప నిద్ర పట్టడం లేదు. అందుకే అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు.

గత ఎన్నికల్లో పోటీకి క్యూలు కట్టిన నేతల్లో ఇప్పుడు ఆ ఉత్సాహం ఏమైందో చంద్రబాబుకు, కులమీడియాకు అంతుచిక్కడం లేదు. పట్టుమని ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కూడా ఇప్పుడు పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు. రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజక వర్గాల్లో కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని శ్రీనివాస్, గల్లా జయదేవ్ మినహా ఏ సిట్టింగ్ ఎంపీ కూడా ఈ సారి పోటీకి సిద్ధంగా లేకపోవడంతో ముచ్చెమటలు పడుతున్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రతిపక్షాలకు కుట్ర రాజకీయాలు అంటగడుతున్నారు. అవినీతిని పెంచి పోషించిన చంద్రబాబు ఇప్పుడు ఓటమి భయంతో, కలిసిరాని నేతలతో అష్టకష్టాలు పడుతున్నారు. ఇంట్లో పోరు బయట పడనీయకుండా అబద్దలమీద అబద్దాలు ప్రచారం చేస్తూ తన కన్నీళ్ళు దాచుకుంటున్నారు. ఓ వైపు అవినీతి, మరోవైపు వైఫల్యాలు, ఇంకో వైపు రుణమాఫీ విద్రోహం. ఇవన్నీ వెంటాడుతుంటే ఓటమి భయం కళ్ళముందే కనిపిస్తుంటే 2014నాటి పాత అస్త్రాలను బయటకు తీసి దింపుడుకళ్ళం ఆశతో బ్రతికేస్తున్నారు చంద్రబాబు. కులమీడియా కూడా చంద్రబాబు దింపుడుకళ్ళం ఆశను భుజాలపై మోస్తూ ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గెలుపును అడ్డుకోవాలని చూస్తోంది. అందుకే పాత చింతకాయ పచ్చడిని బూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం గత రెండురోజులుగా చేస్తున్నారు. ప్రత్యర్థులంతా ఎవరి వ్యూహాల్లో వారుంటే వారిని ఎదుర్కొనే దమ్ము లేక వారిపై కుట్రలు చేస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఏడ్పులూ, పెడబొబ్బలతో ఓట్లు రావని, ఆ రోజులు పోయాయని, ఇప్పుడు నడుస్తున్నది సోషల్ మీడియా రోజులని ఈ కుల నేతలకు ఈ ఎన్నికల్లో అయినా తెలిసొస్తే మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here