RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

మోదీ సరే !! బాబు సంగ‌తేమిటి?! ‘ప‌చ్చ‌’ మీడియా ఆర్కే !!

  • February 12, 2018 | UPDATED 13:45 IST Views: 891
  • Share

 

ఏబీఎన్ ఆంద్ర‌జ్యోతి రాధాకృష్టా ఈ వారం కూడా కొత్త‌ప‌లుకు ప‌లికాడు. ఈ వారం వంతు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వ్య‌వ‌హార స‌ర‌ళి, ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం చేసిన‌. చేస్తున్న అన్యాయంపై చంద్ర‌బాబు నాయుడు మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో మోదీని నిల‌దీశాడు. ఏపీకి కేంద్రం విభ‌జ‌న సంద‌ర్భంగా చేసిన హామీలు. విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌ర్చిన అంశాల‌ను అమ‌లు చేయ‌లేదు. దీంట్లో వేరే మాట‌కు తావులేదు. ఇవి అమ‌లు కాక‌పోవ‌టానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీయేనా కార‌ణమా? ఏపీ ప్ర‌భుత్వానిది కానీ, చంద్ర‌బాబు నాయుడుకి పాత్ర‌, ప్ర‌మేయం ఏమీ లేదా? మోదీ ఒక్క‌డి వ‌ల్లే ఇది సాధ్య‌మా? అని ఆలోచించుకోవాల్సిన స‌మ‌యం ఇది. ఎందుకంటే టీడీపీ నేత‌లు అటు కేంద్రంలో కొన‌సాగుతూ ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌ప‌ర్చే ఎత్తులు వేస్తున్నారు.

కేంద్రంలోని న‌రేంద్ర‌మోదీ. ఏపీ సీఎంగా ఉన్న చంద్ర‌బాబు ఇద్ద‌రు క‌లిసే ఏపీకి ద్రోహం చేయ‌లేదా? చ‌ంద్ర‌బాబు స‌హ‌కారం లేకుండా మోదీ ఇలా చేయ‌టం సాధ్య‌మ‌య్యేదా? చంద్ర‌బాబు నాయుడు పాత్ర లేక‌పోతే గ‌త నాలుగేళ్లుగా కేంద్రం ఏపీకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వ‌కుండా, ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా ఉండేదా? ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా, బాబు ఎందుకు వెన‌కేసుకొచ్చారు. అంద‌రి కంటే ఎక్కువే ఏపీకి సాధించామ‌ని, హోదా వ‌స్తే ఏం వ‌స్తోంద‌ని చంద్ర‌బాబు హోదాను ఉద్య‌మాన్ని అణ‌చివేస్తూ వ్య‌వ‌హారించిన తీరుకు రాధాకృష్ట ఏం స‌మాధానం చెబుతారు?

ఏపీ విప‌క్ష వైసీపీ నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తొలి నుంచి ఏపీకి ప్ర‌త్యేక హోదానే శ్రీ‌రామ ర‌క్ష‌. దాని కోసం త‌మ పార్టీ పోరాడుతుంటే మీడియా ప‌ట్టిందా? జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా పై ఉద్య‌మిస్తుంటే ఏబీఎన్ సార‌ధ్యంలో న‌డుస్తున్న మీడియా గానీ, ప‌చ్చ మీడియా గానీ, ఏపీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎటువంటి వైఖ‌రి తీసుకున్నారు.? జ‌గ‌న్ పై నింద‌లు వేస్తూ. ఉద్య‌మాన్ని నీరుగార్చేందుకు సాయాశ‌క్తులా కుట్ర‌లు చేయ‌లేదా? రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు గురించి ఒక్క క్ష‌ణంమైనా ఆలోచించారా? ఆనాడు ఎలా ఎందుకు చేశారు. ఇప్పుడు ఎంద‌కు టీడీపీ నేత‌ల‌కు. ప‌చ్చ మీడియాకు పూన‌కాలు వ‌చ్చేస్తున్నాయి? ఏపీలో మీడియా పాత్ర ఏమిటి? చంద్ర‌బాబు నాయుడు నందంటే నంది. పందంటే పంది అని చెప్ప‌ట‌మేనా మీడియా పాత్ర‌? ఇప్పుడు మాట్లాడుతున్న‌ట్లుగా ఆనాడు చంద్ర‌బాబు నాయుడు హోదాను వ్య‌తిరేకిస్తూ మాట్లాడిన‌ప్పుడు ఎందుకు మాట్లాడ‌లేదు. ఆనాడు మీడియా త‌న పాత్ర పోషించి ఉంటే ఇప్పుడి ప‌రిస్థితి త‌తెత్తేదా? అధికారంలో ఉన్న వాళ్లు ఆ ప్రాంతానికి న‌ష్ట జ‌రిగే విధంగా వ్య‌హ‌రిస్తుంటే గుర్తు చేయాల్సిన బాధ్య‌త మీడియాకు లేదా? ఏపీలో మీడియాది విద్రోహ పాత్ర క‌దా? మీడియాను అడ్డం పెట్టుకుని ‘ప‌చ్చ’ రాజ‌కీయాలు చేయ‌టమేనా మీడియా ప‌ని? ఇప్పుడు ఏపీకి జ‌రుగుతున్న ద్రోహంలో మీడియా పాత్ర‌దారు క‌దా? చ‌ర్చిద్దాం.

ఏపీకి ద్రోహం చేసింది, చేస్తుందీ బాబునే

విభ‌జ‌న నేప‌థ్యంలో అధికారంలోకి వ‌చ్చిన బాబు ఏపీకి త‌న అనుభ‌వాన్ని ఉప‌యోగించి బాగు చేస్తార‌ని ఆశించారు. కానీ ఆయ‌న ఏపీని స‌ర్వ‌నాశ‌నం చేశారు. స‌మీప భ‌విష్య‌త్ లో కూడా కోలుకోలేని విధంగా భ్ర‌ష్టుప‌ట్టించారు. చంద్ర‌బాబు నాయుడు కావాల‌నే ఇలా చేశాడ‌ని అన‌టం కాదు కానీ, బాబు త‌న త‌ప్పులు క‌ప్పి పెట్టుకోవ‌టానికి, త‌న రాజ‌కీయ అవ‌స‌రాలు తీర్చుకోవ‌టానికి. ప్ర‌త్య‌ర్దుల‌ను రాజ‌కీయంగా అణ‌చివేయ‌టం కోసం, త‌న అవినీతిని క‌ప్పిపెట్టుకోవ‌టం కోసం ఏపీని బ‌లిప‌శువు చేశాడు. చంద్ర‌బాబు నాయుడు అవినీతి కార‌ణంగా ఇప్పుడు ఏపీ ద‌హించుకుపోతుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఏపీని విభ‌జించిన కాంగ్రెస్ కంటే. విభ‌జ‌న హామీలు అమ‌లు చేయ‌కుండా యూ ట‌ర్న్ తీసుకున్న మోదీ కంటే కూడా ఏపీ సీఎంగా ఉంటూ రాష్ట్రానికి ఈ ప‌రిస్థితి రావ‌టానికి చంద్ర‌బాబే ప్ర‌ధాన కార‌కుడ‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

ఏపీ త‌ల‌రాత‌ను మార్చేసిన ఓటుకు నోటు కేసు.

తెలంగాణ‌లో పార్టీ అధికారంలోకి తెచ్చే వ‌ర‌కు తాను హైద‌రాబాద్ వ‌దిలే ప్ర‌శ‌క్తే లేద‌ని, బాబు సీఎంగా అవ్వంగానే మొద‌టిసారి తెలంగాణ పార్టీ నేత‌ల‌కు చెప్పారు. కానీ ఓటుకు నోటు కేసుతో కేసీఆర్ పెట్టిన ష‌ర‌తుల‌తో అర్దాంత‌రంగా హైదారాబాద్ వ‌దిలేశాడు. తెలంగాణ పార్టీని వ‌దిలేశాడు. ప‌దేళ్లు హైద‌రాబాద్ లో ఉండి ఏపీలో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించుకుని ఏపీకి త‌ర‌లి రావాల్సి ఉండ‌గా దానికి భిన్నంగా చేశాడు. తాత్కాలిక క‌ట్ట‌డాల పేరుతో వేల కోట్లు నిర్మాణాలు చేప‌ట్టి దోచుకున్నారు. తాత్క‌లిక నిర్మాణాలు కాబ‌ట్టి నాణ్య‌త గాలికి వ‌దిలేశారు. వేల కోట్ల రూపాయ‌లు క‌ట్టిన అసెంబ్లీ, సచివాల‌యాల్లో వ‌ర్ష‌పు నీరు మ‌నం చేస్తుందే. ఆ ర‌కంగా ఏపీకి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆర్ధిక భారం ప‌డింది. అప్ప‌టికే హైద‌ర‌బాద్‌లో వంద‌ల కోట్ల రూపాలు పెట్టి రిపేర్లు చేసి, వాటిని గాలికి వ‌దిలేసి వ‌చ్చేశారు. అక్క‌డ నుంచి మొద‌టు పెడితే చంద్ర‌బాబు రోజు రోజుకి దిగ‌జారిపోవ‌టం త‌ప్పా, ఏపీ ప్ర‌జ‌ల‌నాల‌ను ప‌ట్టించుకోలేదు. ప‌ట్ట‌లేదు.

అధికారంలోకి వ‌చ్చిన ఏడాది ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడి వోటుకు నోటు కేసు త‌ర్వాత యూట‌ర్న్ తీసుకున్నారు. విజ‌చ‌న చ‌ట్టంలో పొందు ప‌ర్చిన వాటికి ప్ర‌త్యామ్నాయంగా స్పెష‌ల్ ప్యాకేజీ అంటే దాన్ని స్వాగ‌తించారు. దాంతో మోదీకి చంద్ర‌బాబుపైనా. ఏపీపైనా ప‌ట్టు వ‌చ్చేసింది. చ‌ట్టాన్ని ప‌క్క‌న పెట్టి చంద్ర‌బాబు, కేంద్రం క‌లిపి చ‌ట్టాన్ని ప‌క్క‌న పెట్టేశారు. అప్ప‌టి నుంచి కేంద్రం త‌న ప‌ని సులువు చేసుకుంది. లోప‌ల ఏం జ‌రిగినా చంద్ర‌బాబు. టీడీపీ నేత‌లు గ‌త నాలుగేళ్ల‌గా కేంద్రాన్ని వెన‌కేసుకుని వ‌స్తూనే ఉన్నారు. ఇప్పుడు హ‌ఠాత్తుగా ప్లేటు ఫిరాయించారు. గ‌త నాలుగేళ్ల‌గా లేని ప్రేమ చంద్ర‌బాబుకు. ప‌చ్చ మీడియాకు ఏపీ ప‌ట్ల ఎందుకు క‌లిగింది. అప్పుడే ఎందుకు క‌ల‌గ‌లేదు. ఇప్పుడే ఎందుకు క‌లిగింది? అనేది కూడా చర్చ‌నీయాంశ‌మే.

హోదా కోసం జ‌గ‌న్ పోరాటం

ఏపీకి గ‌త నాలుగేళ్లుగా అన్యాయం జ‌రుగుతుంద‌ని విప‌క్ష నేత జ‌గ‌న్ మొత్తుకుంటున్నారు. హోదా కోసం ప‌ట్టువీడ‌ని భ‌ట్టి విక్ర‌మార్కుడు వ‌లె పోరాడుతున్నాడు. స్పెష‌ల్ ప్యాకేజీ అనేది ట్రాస్‌, దాంట్లో కొత్త‌గా ఏమీ లేదుని అనేక సార్లు చెప్పారు. ఏపీకి దీక్ష‌లు చేశారు. బంద్ చేశారు. రాష్ట్ర మంతా య‌వ బేరీలు నిర్వ‌హించారు. ఏపీకి హోదానే సంజీవిని, దాని కోసం పోరాడ‌తాం. ఎంపీల‌తో రాజీనామాలు చేయిస్తాం. అంతే కాకుండా, ఏపీకి ప్ర‌త్యేక హోదా ను కేంద్రంలో ఉన్న ఏపార్టీ ఇస్తే ఆ పార్టీకే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ప‌చ్చ మీడియా జ‌గ‌న్ చెప్పిన దాన్ని వ‌క్రీక‌రించి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంది. ప‌చ్చ మీడియా ప‌నే వ‌క్రీక‌రించ‌టంగా మారిపోయింది. అయినా వైసీపీ త‌న పోరాటాన్ని కోన‌సాగిస్తోంది. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను గుర్తిస్తూ వాటి కోసం నిల‌బ‌డుతుంది. జ‌గ‌న్ పోరాటాన్ని త‌క్కువ‌గా చూపిస్తూ. వ‌క్రీక‌రిస్తూ చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు పొందాల‌ని భావించి బొగ్గ బోర్లా ప‌డ్డాడు.

హోదా , చ‌ట్ట‌బద్ద హ‌క్కులను ఆనాడు ఎందుకు విస్మరించారు? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు?

కేంద్రం రాష్ట్రానికి చేయాల్సిన సాయం మొద‌టి ఏడాది నుంచి మొద‌లు కావాలి. స‌రిగా రావ‌టం లేదంటే వెంట‌నే దానికి స్పందించాల్సి న బాధ్య‌త సీఎం. ఆనాడు బీజేపీని వెన‌కోసుకుని వ‌చ్చాడు. హోదా ఉద్య‌మాన్ని త‌ప్పుప‌ట్టాడు. హోదా వ‌స్తే ఏం వ‌స్తోంద‌ని ప్ర‌శ్నించారు. స్పెష‌ల్ ప్యాకేజీలో అన్నీ ఉన్నాయ‌ని చెప్పాడు. తీరా ఇప్పుడు అన్యాయం జ‌రిగిందంటే అనేక అనుమానాలు రావ‌టం స‌హజం. ఇప్పుడు అంద‌రికి అవే అనుమానాలు. ఆనాడు ఎంద‌కు వ్య‌తిరేకించారో టీడీపీ ఇప్ప‌టికీ చెప్ప‌టం లేదు. కాబ‌ట్టి చంద్ర‌బాబు ఎలా న‌మ్ముతారు?

అసెంబ్లీ సీట్లు కోస‌మేనా ఈ డ్రామాల‌న్నీ..

నాలుగేళ్ల‌గా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయ‌ని పార్టీ నేత‌ల‌కు చెప్పుకుంటూ వ‌చ్చిన బాబుకు అసెంబ్లీ సీట్లు పెర‌గ‌వ‌ని తెలిసిన త‌ర్వాత పూన‌కం వ‌చ్చేసింది. దాంతో ఆయ‌న‌కు ఏపీ హ‌క్కులు. ప్ర‌త్యేక హోదాలు గుర్తుకు వ‌చ్చాయి. 2017 హోదా కోసం ఉద్య‌మం జ‌రిగితే అణ‌చి వేసిన బాబు. ఇప్పుడు బంద్‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు. పార్ల‌మెంట్‌లో డ్రామాల‌కు తెర తీశారు. ఓ ప‌క్క కేంద్రంలో అధికారంలో ఉంటూ ఈ డ్రామాలేమిటి? అనే ప్ర‌శ్నే ప‌చ్చ మీడియాకు రాదు. నాలుగేళ్లుగా ఎందుకు నిద్ర‌పోయారు. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు రానున్నాయి. ప్ర‌భుత్వాలు మారితే వాళ్లు అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి చేయాల్సింది చేస్తారు త‌ప్పా, గ‌త కాలానిది ఏమీ చేయ‌రు క‌దా? 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న బాబు ఈ విష‌యం తెలియ‌దా? తెలుసు. కానీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు, రాష్ట్ర భ‌విష్య‌త్ ఏమై పోయినా ప‌ర్వాలేదు. కానీ త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు నెర‌వేరాలి. అందుకు కోసం ఏపీకి అన్యాయం జ‌రుగుతున్నా, కూడా దొంగ‌కు తేలికుంటిన‌ట్లుగా వ్య‌వ‌హారించాడు. అసెంబ్లీ సీట్లు పెంపు లేద‌ని తేలిన త‌ర్వాత ఇప్పుడు మాట్లాడితే ఏం విశ్వ‌స‌నీయ‌త ఉంటుంది? ప‌చ్చ మీడియాకు త‌ప్పా;

బాబు నందంటే నంది, పందంటే పంది ఏపీలో మీడియా తీరు !1

భార‌త రాజ్యాంగంలో ఫోర్త్ ఏస్టేట్‌గా గౌర‌వం పొందుతున్న మీడియా దాని ప‌రువును నిలువునా తీసుకుంటుంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. ఏపీలో త‌న బాధ్య‌త‌ను ఎప్పుడో విస్మరించింది. విభ‌జ‌న నేప‌థ్యంలో మీడియా కు చాలా ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. మీడియా త‌న పాత్ర పోషించి ఉంటే ఏపీ ప‌రిస్తితి ఇలా ఉండేది కాదు. జ‌ర్న‌లిజం పేరుతో ప‌చ్చ ప‌న్నాగాలు, డ్రామాలు ఆడుతున్నారు. మెరుగైన స‌మాజం, ద‌మ్మున్న ఛాన‌ల్స్ అయితే మ‌రీ బ‌రితెగింపు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల కంటే దారుణంగా మిగిలిన ప‌క్షాల‌పై ప్ర‌శ్న‌లు కురిపిస్తున్నారు. ప్ర‌జ‌ల ప‌క్షాన కాకుండా టీడీపీ ప‌క్షాన ప‌ని చేయ‌టానికి సిద్ద‌ప‌డిపోయారు. కాబ‌ట్టి చంద్ర‌బాబు నందంటే నంది. పందంటే పంది అనే ప‌ద్ద‌తినే వ్య‌వ‌హారిస్తున్నారు. ఎన్నిక‌ల ముందు 15 ఏళ్లు హోదా కావాల‌ని అడిగిన బాబు. గెలిచిన త‌ర్వాత హోదా వ‌స్తే ఏం వ‌స్తోంద‌ని నిల‌దీస్తుంటే ఈ ప‌చ్చ మీడియాకు సావ్వ‌గా ఉంది. క‌నీసం ఆ విష‌యాన్ని ప్ర‌శ్నించ‌లేదు. ఇప్పుడు పున‌కాల‌తో ఊగితుంది. చంద్ర‌బాబు మారిదిరిగానే. కాబ‌ట్టి ఏపీకి జ‌ర‌గిన అన్యాయం మోదీకి పాత్ర ఉంది కానీ ప్ర‌ధాన పాత్ర దారుడు మాత్రం చంద్ర‌బాబు. ఆయ‌న‌కు వంత పాడుతున్న మీడియాకు కూడా ఉందిని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

 

 

 

చంద్ర‌బాబు. రాథాకృష్టాలు ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి ఆలోచించారా?