RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

వారెవ్వా..ఆంధ్ర‌జ్యోతి..!

  • March 10, 2018 | UPDATED 13:25 IST Views: 1850
  • Share

 

ఆంద్ర‌త్యోతి తీరు మార‌టం లేదు. YCPని..జ‌గ‌న్ ను డామేజ్ చేయ‌ట‌మే ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. TDP ఏ లైన్ తీసుకుంటే అదే త‌మ విధానంగా ఆంధ్ర‌జ్యోతి వ్య‌వ‌హ‌రిస్తోంది. ఒక క‌ధ‌నంలో జ‌గ‌న్ వ‌ల‌నే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని కేంద్ర మంత్రులే చెబుతున్నారని పేర్కొంటారు. మ‌రో క‌ధ‌నంలో జ‌గ‌న్ BJPకి ద‌గ్గ‌ర‌వ్వ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని రాస్తారాఉ. మ‌రో క‌ధ‌నంలో చంద్ర‌బాబు మాత్ర‌మే మోదీని ఎదిరించార‌ని చెబుతారు. తాజాగా విజ‌యసాయి రెడ్డి ప‌త్ర్యేక హోదా లో త‌మ విధానం..ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇచ్చే అంశం పై చెప్పిన అంశానికి TDP నేత‌ల పేరుతో వ‌క్ర‌భాష్యం చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. చ‌ర్చ లో భాగంగా..విజ‌యసాయిరెడ్డి..మోదీ పై త‌మకు హోదా ఇస్తార‌నే న‌మ్మ‌కం ఉంద‌నే విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నాయి. కేంద్రం పై అవిశ్వాసం అనేది త‌మ ఆవేద‌న జాతీయ స్థాయిలో గుర్తించ‌టానికి..ఒత్తిడి పెంచ‌టానిక‌నే విష‌యం జ‌గ‌న్ చాలా స్ప‌ష్టంగా చెప్పారు. ఇక వైపు కేంద్ర మంత్రుల‌ను విత్ డ్రా చేసి..NDA లో ఎందుకు కొన‌సాగుతోంది. మోదీ పై న‌మ్య‌కంతోనా లేక భ‌యంతో నా.. ఇవ‌న్నీ కాకుండా రాజ‌కీయంగా ఏవైనా ప్ర‌యెజ‌నాలు ఉన్నాయా. మంత్రివ‌ర్గం నుండి బ‌య‌ట‌కు వ‌చ్చినా..16వ పార్ల‌మెంట్ ముగిసే వ‌ర‌కూ NDAతోనే ఉంటామ‌ని TDP నేత‌లు చెబుతున్నారు. మ‌రి..అది ఆంధ్ర‌జ్యోతి ఎందుకు ప్ర‌స్తావించ‌టం లేదు. కేవ లం విజ‌య‌సాయి రెడ్డిని..YCP ని టార్గెట్ చేస్తూ వారెవ్వా..YCP అంటూ క‌ధ‌నం ఇవ్వటం వెనుక ఉన్న అస‌లు క‌ధ ఏంటి..

YCP ని..YCP నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ క‌ధ‌నాలు ఇవ్వ‌టం ఆంధ్ర‌జ్యోతికి కొత్త కాదు. కానీ, తాజాగా విజ‌య‌సాయి రెడ్డి జాతీయ ఛాన‌ల్ నిర్విహించిన చ‌ర్చ‌లో పాల్గొన్నారు. ఆయ‌న త‌మ పార్టీ అధినేత జ‌గన్ చెప్పిన‌ట్లుగా ఎవ‌రైతే APకి ప్ర‌త్యేక హోదా కోసం మ‌ద్ద‌తు ఇస్తారో వారితోనే తాము క‌లుస్తామ‌నే విష‌యం స్ప‌ష్టంగా చెప్పారు. అదే స‌మ‌యంలో కేంద్రం పై పెడుతున్న అవిశ్వాసంకు TDP సైతం మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని డిమాండ్ చేసారు. ప్ర‌త్యేక హోదా ఇస్తార‌నే న‌మ్మకం ఇంకా మోదీ మీద ఉంద‌న సాయి రెడ్డి అభిప్రాయ ప‌డ్డారు. కేంద్ర బ‌డ్జెట్‌లో APకి అన్యాయం జ‌రిగింద‌ని..ఆ స‌మ‌యం నుండే NDA భాగ‌స్వామిగా ఉన్న TDP గ‌ళం ఎత్తింద‌ని..ఆ రోజు నుండే కేంద్రం పై పోరాటం మెద‌లు పెట్టామంటూ TDP నేత‌లు చెప్పిన‌ట్లుగా ఆంధ్ర‌జ్యోతి త‌న క‌ధ‌నంలో పేర్కొంది. కానీ, ఆంధ్ర‌జ్యోతి ఒక్క‌డ ఉద్దేశ పూర్వ‌కంగానే ఒక విష‌యాన్ని విస్మ‌రిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం నుండి బ‌ట‌య‌కు వ‌చ్చినా ఇంకా NDA లో ఎందుకు కొన‌సాగుతుంద‌నే విష‌యం పై స్ప‌ష్ట‌త ఇప్ప‌టికీ ఇవ్వ‌లేదు. ప్ర‌ధాని మోదీతో ముఖ్య‌మంత్రి ఫోన్ లో మాట్లాడిన స‌మ‌యంలోనూ తాము ఇంకా NDA లో భాగ‌స్వామిగా ఉన్న విష‌యాన్ని గుర్తు చేసార‌ని ఇదే ప‌త్రిక రాసింది. అంటే త‌మ ఒత్తిడి పెంచుతూ..కేంద్రం ఏదైనా చేస్తుందోమేననే ఆశ‌తోనే TDP కొనసాగ‌టం లేదా.

మోదీ మీద ఇంకా ఆశ‌తో TDP NDA లో కొన‌సాగ‌టం లేద‌నుకోవాలా. లేక‌..ఇత‌ర‌త్రా అంశాలు ఏమైనా ఉన్నాయా. జ‌గ‌న్ ఒత్తిడి కార‌ణంగానే TDP-BJPకి దూర‌మైంద‌ని కేంద్ర మంత్రి అనంత‌కుమార్ వ్యాఖ్యానించార‌ని పేర్కొంది ఆంధ్ర‌జ్యోతి. మ‌రో క‌ధ‌నంలో YCP ని చూసుకొనే BJP..TDPని దూరం చేసుకుంటుంద‌ని పేర్కొంటుంది. ఇక‌, మోదీని ఎద‌రుర్కొన్న ఏకైక వ్య‌క్తి చంద్ర‌బాబు అని కీర్తిస్తుంది.

ఇలా..కేవ‌లం చంద్ర‌బాబు భ‌జ‌న కోస‌మే అన్న‌ట్లుగా ఆంధ్ర‌జ్యోతి వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజాగా..కాంగ్రెస్ అధినేత రాహుల్ ప్ర‌త్యేక హోదా పై హామీ ఇచ్చినా..అది వారు అధికారంలోకి వ‌స్తే జ‌రిగే సంగ‌తి. కానీ, ప్ర‌స్తుతం ప్ర‌ధాని సీట్లో ఉన్న వ్య‌క్తి ఒక్క నిర్ణ‌యం తీసుకుంటే వెంట‌నే APకి హోదా రావ‌టం పెద్ద క‌ష్ట‌మేమి కాదు. ఇదే అంశాన్ని విజ‌య సాయి రెడ్డి స్ప‌ష్టం చేసారు. కేవ‌లం రాజ‌కీయ నిర్ణ‌యం లేక‌నే హోదా ఆగింది. దీనికి తోడు TDP ప్ర‌భుత్వం హోదా స్థానంలో ప్యాకేజికి అంగీక‌రించ‌టం మ‌రో ప్రధాన కార‌ణం. ఇక‌, ప్ర‌ధాని పై న‌మ్మ‌కం ఉంటే అవిశ్వాసం ఎందుక‌ని ఆంధ్ర‌జ్యోతి TDP నేత‌ల పేరుతో ప్ర‌శ్నిస్తోంది. AP ప్ర‌జ‌ల ఆకాంక్ష దేశ ప్ర‌జ‌ల‌కు తెలియాల‌న్నా.. కేంద్రం పై ఒత్తిడి పెర‌గాల‌న్నా..AP MPల ఐక్య‌త తెలియాల‌న్నా ఇదొక అవ‌కాశం గా YCP భావిస్తోంది. అందుకోస‌మే TDPని సైతం క‌లిసి రావాలని జ‌గ‌న్ పిలుపునిచ్చారు. ఆంధ్ర‌జ్యోతి త‌న క‌ధ‌నం ద్వారా YCP-BJP తో పొత్తు కోసం వేచి చూస్తుంద‌నే విధంగా అపోహ క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తోంది. కానీ, ఒక రాజ్య స‌భ స‌భ్యుడిగా…ప్ర‌ధానితో స‌త్సంబంధాలు న‌డిపితే త‌ప్పేంటి. ప్ర‌ధానిని క‌లిస్తే వ‌చ్చిన న‌ష్ట‌మేంటి. నిజంగా మోదీ తో ఇక ఏదీ APకి న్యాయం జ‌ర‌గ‌ద‌ని TDP భావిస్తే..వెంట‌నే NDA నుండి బ‌ట‌య‌కు రావాల‌ని YCP నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. అప్ప టి దాకా TDP నేత‌లు ఏం చెప్పినా ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి ఉండ‌ద‌ని తేల్చి చెబుతున్నారు. ఇక‌, YCP MPలు ఎందుకు రాజీ నామాలు చేయ‌లేద‌ని ముఖ్య‌మంత్రి మొద‌లు TDP నేత‌లు వ‌ర‌కు విమ‌ర్శించారు. ఇప్పుడు YCP MPల రాజీనామాల తేదీ ప్ర‌క‌టిస్తే..దీని ద్వారా BJPకి ప్ర‌యోజ‌నం క‌లిగించ‌టానికేన‌ని కొత్త వాద‌న మొద‌లు పెట్టారు. ప్ర‌త్యేక హోదాలో సైతం యూ ట‌ర్న్ తీసుకున్న TDP..YCP వ్యూహాల‌తో ఇరుకున ప‌డింద‌నే విష‌యం వారి ప్ర‌క‌ట‌న‌ల ద్వారానే స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇదే స‌మ‌యంలో ..TDP కి మ‌ద్ద‌తుగా..YCPకి వ్య‌తిరేకంగా ఆంధ్ర‌జ్యోతి తన స‌హ‌జ ధోర‌ణిలో లాజిక్ లేని క‌ధ‌నాల‌ను వండి వారుస్తుంద‌ని YCP నేత‌లు ఆరోపిస్తున్నారు. వీటికి త‌గిన విధంగా స్పందిస్తామ‌ని YCP నేత‌లు చెబుతున్నారు.