RajakeeyaaluRajakeeyaalu

Friday, February 23, 2018

ఇక‌…స‌మ‌ర‌మే…!

  • September 17, 2017 | UPDATED 12:33 IST Views: 24587
  • Share

 

AP అధికార పార్టీకి ఊహించ‌ని షాక్‌. ఆసలు ఆట మొద‌లైంది. నంద్యాల‌-కాకినాడ ఎన్నిక‌ల‌తో సంబ‌ర‌ప‌డుతున్న TDP కి కొత్త టెన్ష‌న్. ఒక్క అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ‌మో..మున్సిప‌ల్ ఎన్నికో కాదు..ఏకంగా రెండు పార్ల‌మెంట్ స్థానాల‌కు APలో ఉప ఎన్నిక దిశగా వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. AP – తెలంగాణ నుండి పార్టీలు ఫిరాయించిన MPల పై వేటుకు రంగం సిద్ద‌మైంది. నంద్యాల‌- అర‌కు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాలకు ఉప ఎన్నిక‌లు త‌ప్పేలా లేవు. కేంద్రంలో వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌తో APలో అధికార పార్టీలో అల‌జ‌డి మొద‌లైంది. స‌మ‌యం కోసం ఎదురు చూస్తున్న YCP  ఇప్పుడు త‌న స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తోంది. తాజా ట్విస్ట్ తో AP లో ఏం జ‌ర‌గ‌బోతోంది…ఏ పార్టీలో ఎటువంటి అంచ‌నాలు ఉన్నాయి..
APలో మ‌రో ఎన్నిక‌ల స‌మ‌రం తప్పేలా లేదు. నంద్యాల ఉప ఎన్నిక‌..కాకినాడ మున్సిప‌ల్ ఎన్నిక ల్లో గెలిచి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలిచినంతగా సంబరప‌డుతున్న TDP..ఇప్పుడు ఒక్కో మున్సిపాల్టీలో విడివిడిగా ఎన్నిక‌లు నిర్వ‌హించి అధికారం చాటున ఆధిప‌త్యం చాటుకొనే వ్యూహాల‌ను సిద్దం చేస్తోంది. ఇదే స‌మ‌యంలో..ఢిల్లీలో AP-తెలంగాణ‌కు సంబంధించి వేగంగా పరిణామాలు మారుతున్నాయి. AP – తెలంగాణ లో పార్టీ ఫిరాయింపు MPల పై వ‌చ్చిన ఫిర్యాదుల పై ఇప్ప‌టి దాకా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఇక‌, దీని పై ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఉన్న‌త స్థాయిలో ఆలోచ‌న చేస్తున్న‌ట్లు స‌మాచారం. దీని పై MPల పై చ‌ర్య‌ల‌కే అవ‌కాశాలు ఉన్నాయ‌నేది అత్యంత విశ్వ‌సనీయ స‌మాచారం. ఇప్పటికే తెలంగాణ‌లో కాంగ్రెస్ నుండి గెలిచి TRS లో చేరిన న‌ల్గొండ MP గుత్తా సంఖేంద‌ర్ రెడ్డి..AP నుండి YCP లో గెలిచి TDP లో చేరిన నంద్యాల MP SPY రెడ్డి..అర‌కు MP కొత్త‌ప‌ల్లి గీత ల‌పై అన‌ర్హ‌త పిటీష‌న్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీరి పై వేటు వేసే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఉన్న‌త స్థాయి వ‌ర్గాల స‌మాచారం. ఇదే జ‌రిగితే..ఇప్ప‌టి వర‌కూ…త‌మ‌కు తిరుగులేద‌ని భావ‌న క‌ల్పించేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్న AP – తెలంగాణ‌లోని అధికార పార్టీలకి ఖ‌చ్చితంగా షాక్ ఇచ్చే అంశంగానే ప‌రిగ‌ణించాలి..
APలో చూస్తే…నంద్యాల అసెంబ్లీ స్థానంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో గెలిచిన అధికార పార్టీ ఇప్పుడు నంద్యాల లోక్‌స‌భ స్థానంలో గెల‌వ‌టం అంత సులువు కాదు. నంద్యాల అసెంబ్లీ స్థానం కోస‌మే అభివృద్ది పేరుతో వంద‌లాది కోట్లు ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. ఇక‌, ఇప్పుడు నంద్యాల పార్ల‌మెంట్ ప‌రిధిలో అసెంబ్లీ త‌ర‌హా ఫార్ములా వ‌ర్క‌వుట్ చేయటం అంత సులువైన ప‌ని కాదు. ఇక‌, అదే విధంగా అర‌కు లోక‌స‌భ స్థానం పూర్తిగా గిరిజ‌న ప్రాంతాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న ప్రాంతం. ఇప్ప‌టి వ‌ర‌కు AP ప్ర‌భుత్వంలో గిరిజ‌నుల‌కు మంత్రి ప‌ద‌వి కానీ, క‌నీసం గిరిజ‌న మండ‌లి కానీ ఏర్పాటు చేయ‌లేదు. ఈ ప‌రిస్థితుల్లో అర‌కు పార్ల‌మెంట్ స్థానంలో ఉప ఎన్నిక ఎదురైతే అధికార పార్టీ గింగ‌రాలు తిర‌గ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇక‌, న‌ల్గొండ స్థానంలో సైతం అక్క‌డ సామాజిక వ‌ర్గాలు–కాంగ్రెస్ ఆధిక్య‌త ఉండ‌టంతో.. అక్క‌డ అధికార పార్టీకి విజ‌యం అంత సులువు కాదు. ఇటువంటి ప‌రిస్థితుల్లో అటు ఢిల్లీ నుండి వ‌స్తున్న సంకేతాలు చూస్తుంటే రెండు చోట్ల అధికార పార్టీలకి షాక్ త‌ప్పే నిర్ణ‌యాలు వెలువ‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. మ‌రి.. కేంద్రంలో భాగ‌స్వామిగా ఉన్న‌ప్ప‌టికీ..TDP అధినాయ‌క‌త్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు పై కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు అసంతృప్తితో ఉన్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో..ఇక‌, ఇప్పుడు అందుతున్న స‌మాచారం మేరకు ఈ MPల పై నిర్ణయం తీసుకుంటే…ఏ పార్టీ బ‌లం ఏంటో ..ప్ర‌జలు ఎవ‌రితో ఉన్నారో స్ప‌ష్టం కానుంది..