RajakeeyaaluRajakeeyaalu

Monday, December 11, 2017

YCP వాద‌నే నిజ‌మ‌ని తేల్చిన ఆంధ్ర‌జ్యోతి..!

  • September 3, 2017 | UPDATED 15:19 IST Views: 43150
  • Share

 

నంద్యాల‌లో YCP వాద‌న నిజం. TDP నేత‌లు బ‌య‌టకు చెప్పకున్నా..లోలోపల అంగీకరిస్తున్నారు. ఇప్పుడు YCP చెబుతున్న విష‌యాల‌నే ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక సైతం వాస్త‌వ‌మ‌ని తేల్చింది. YCP ని ఓడించ‌టం కోసం MLAల‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుండి ఏం చెప్పిందీ..MLAలు ఎలా వ్య‌వ‌హ‌రించిందీ..ఖ‌ర్చు విష‌యంలోనూ MLAల మ‌ధ్య ఏ ర‌కంగా పోటీ వాతావ‌ర‌ణం సృష్టించిందీ…గెలిచిన త‌రువాత అధికార పార్టీ MLAల‌కు ఏ ర‌కంగా ..ఎక్క‌డ విందుల‌ను ఏర్పాటు చేసిందీ…త‌న క‌ధ‌నంలో స్ప‌ష్టంగా వివ‌రించింది ఆంధ్ర‌జ్యోతి. మ‌రి..అధికార పార్టీ నంద్యాల గెలుపు నిజ‌మైన గెలుపేన‌ని..ప్ర‌జా విజ‌య‌మ‌ని ఇంకా ప్ర‌జ‌ల మ‌ధ్య దైర్యంగా చెప్పుకోగ‌ల‌రా…
నంద్యాల గెలుపు కోసం TDP చేస్తున్న అన్ని ప్ర‌య‌త్నాల‌ను YCP బ‌య‌ట పెట్టింది. నంద్యాల లో TDP ఏ ర‌కంగా గెలిచిందీ..ఏం చేసిందీ..ఇప్ప‌టి వ‌ర‌కు YCP నేత‌లు చెబుతూనే వ‌స్తున్నారు. కానీ, TDP నేత‌లు..వారి మ‌ద్ద‌తు మీడియా నేత‌లు మాత్రం YCP చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను త‌ప్పు బ‌ట్టారు. కానీ, TDP ని భుజాన వేసుకొని నంద్యాల గెలుపు త‌రువాత ఇక YCP ప‌ని అయిపోయిందంటూ ప్ర‌చారం చేసిన ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక ప్ర‌చురించిన ఓ క‌ధ‌నం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలోని YCP బ‌లంగా ఉన్న గోస్పాడు మండ‌లంలో అధికార పార్టీ ఎవ‌రెవ‌రికి బాధ్య‌త‌లు అప్ప‌గించిందీ..ఎంత మొత్తంలో ఖ‌ర్చు చేయాలో ఎలాంటి సూచ‌న‌లు చేసిందీ స‌వివ‌రంగా వివ‌రించింది. TDP MLAలు ఆల‌పాటి రాజేంద్ర ప్ర‌సాద్‌..చీరాల నుండి గెలిచి TDPలో చేరిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కు గోస్సాడు మండలంలోని గ్రామాల బాధ్య‌త‌ల‌ను పార్టీ అప్ప‌గించింది. వీరికి ఇన్‌ఛార్జ్‌గా మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డికి అక్క‌డ ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌ల‌ను కేటాయించింది. అయితే, వీరికి గెలుపు కోసం పార్టీ ఆఫీసు నుండి ఎలాంటి ఆదేశాలు వ‌చ్చాయో..ఈ క‌ధ‌నంలో స్ప‌ష్టం చేసింది.
గోస్పాడు మండ‌లంలో ఆమంచి కృష్ణ‌మోహ‌న్ త‌న 40 మంది కీల‌క అనుచ‌రుల‌తో పార్టీ గెలుపు బాధ్య‌త‌లు స్వీకరించారు. ఎన్నిక స‌మ‌యంలో పార్టీ కేంద్ర కార్యాల‌యం నుండి గోస్పాడు లో ఖ‌ర్చు గురించి ఫోన్ వ‌చ్చిందంటూ జ‌రిగిన సంభాష‌ణ రాసారు. మీ ప‌ని తీరు బాగుంది. కానీ, డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌టం లేదు. ఆ విష‌యంలో వెనుక‌డుగు వేయ‌కుండా ముందుకు వెళ్లండి అంటూ అదేశాలు వ‌చ్చాయ‌ని ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లోనే స్ప‌ష్టంగా పేర్కొన్నారు. ఇక‌, స‌హ‌చ‌ర MLA ఇప్ప‌టికే 1.25 కోట్లు ఖ‌ర్చు చేస్తే..మీరు ఇంకా 25 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసార‌ని..డ‌బ్బు విష‌యంలో వెనక్కు త‌గ్గ‌వ‌ద్ద‌ని సూచించిన‌ట్లు ఆంధ్ర‌జ్యోతి క‌ధ‌నంలో స్ప‌ష్టంగా పేర్కొంది. ఇక‌, ఫ‌లితం రాగానే..ముఖ్య‌మంత్రి త‌ర‌పున మిమ‌ల్ని అభినందిస్తున్నామంటూ ఆయ‌న‌కు MLC జ‌నార్ద‌న్ ఫోన్ చేసార‌ని..YCPకి కీల‌క‌మైన గోస్పాడు లో గెలిపించిన మీకు ..మీ అనుచ‌రుల‌కు విందు ఏర్పాటు చేసామ‌ని..క్రియాశీల‌కంగా ప‌ని చేసిన అనుచ‌రుల‌తో గోవా వెళ్లేందుకు నిర్ణ‌యించామ‌ని వివ‌రించిన‌ట్లు ఆంధ్ర‌జ్యోతి క‌ధ‌నంలో స్ప‌ష్టం చేసారు.
మ‌రి..ఇప్పుడు TDP నేత‌లు ఏం చెబుతారు. YCP నేత‌లే కాదు..ఆంధ్ర‌జ్యోతి ప‌త్రికే TDP చేసిన ఖ‌ర్చు గురించి.. ఇంత వివ‌రంగా పేర్కొంటే..ఇదే స‌మ‌యంలో..మ‌రి నంద్యాల బాధ్య‌త‌లు పంచుకున్న మిగిలిన మంత్రులు-MLA లు ఏ ర‌కంగా టార్గెట్ల వారీగా ఖ‌ర్చు చేసారో..ఎలా వ్య‌వ‌హ‌రించారో చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రి..నంద్యాల విజ‌యం వెనుక అస‌లు క‌ధ‌ను ఆంధ్ర‌జ్యోతి బ‌ట‌య పెట్ట‌టంతో ఇప్పుడు అధికార పార్టీ నంద్యాల విజ‌యం పై ప్ర‌చారాన్ని త‌గ్గించిన‌ట్లు క‌నిపిస్తోంది.