RajakeeyaaluRajakeeyaalu

Friday, February 23, 2018

మెడ‌కు చుట్టుకుంటోంది…!

  • September 17, 2017 | UPDATED 16:17 IST Views: 23259
  • Share

 

TDP నంద్యాల విజ‌య ర‌హ‌స్యాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. నంద్యాల‌లో అధికారం చాటున జ‌రిగిన మేనే జ్ మెంట్ ఏస్థాయిలో ఉందో ఆధారాల‌తో స‌హా బ‌య‌ట ప‌డుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో అమ‌ల‌వ్వాల్సిన పాల‌సీ నిర్ణ‌యాల‌ను..ఎన్నిక‌లు జ‌రిగే ప్రాంతాల‌కే ప‌రిమితం చేసి…గెలుపే ప‌ర‌మావ‌ధిగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింది. అంద‌రికీ ఒకే విధంగా అమ‌లు చేయాల్సిన పధ‌కాల‌ను సైతం ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకే నంద్యాల‌లో మాత్ర‌మే అమ‌లు చేసారు. మ‌రి రా ష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల్లోని వారు డ్వాక్రా మ‌హిళ‌లు కాదా..వారికి ప్ర‌భుత్వ డ‌బ్బులు అంద‌వా..ఏంటీ వివ‌క్ష‌..ఎన్నిక‌లు జ‌రిగితేనే ఖాతాల్లో డ‌బ్బులు వేస్తారా..ఇది మొత్తంగా బూమ్‌రాంగ్ అయ్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌తిప‌క్షం ఇవే ఆధారాల‌తో రాష్ట్ర ప్ర‌జ‌ల ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించింది. రాష్ట్ర వ్యాప్తంగా TDP అనుస‌రిస్తున్న పక్ష‌పాత వైఖ‌రిని ఎండ‌గట్టాల‌ని భావిస్తోంది. ఇంత‌కీ..నంద్యాల‌లో ప్ర‌భుత్వం చేసిన నిర్వాకం ఏంటో ఆధారాల‌తో స‌హా..
నంద్యాల‌లో గెలుపు వెనుక ప్ర‌భుత్వం చెబుతున్న పొలిటిక‌ల్..పోల్ మేనేజ్‌మెంట్ వెనుక చాలా క‌ధలే ఉన్నాయి. అక్కడ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ప్ర‌భుత్వం అక్క‌డ వంద‌ల కోట్ల విలువైన అభివృద్ది ప‌నుల చాటున‌…స్థానికుల‌ను ప్ర‌లోభ పె ట్టే ప్ర‌య‌త్నం చేసింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ట్రాక్ట‌ర్లు..కుట్టుమిష‌న్లు..చీర‌లు..ముక్కుపుడుక‌లు..న‌గ‌దు పంపిణీ వంటి వాటితో పాటుగా ..రోడ్ల వెడల్పు పేరుతో కొందరికి సంబంధించిన నిర్మాణాల‌ను కూల్చివేయ‌టం వంటివి చేసింది. ఇక, సామాజిక వ‌ర్గాల వారీగా వాగ్దానాలు..ఆర్దిక సాయం వంటివి జ‌రిగాయి. అయితే, నంద్యాల‌లో మొత్తం 79.2 శాతం పోలింగ్ న‌మోదైంది. అందులో అధికంగా మ‌హిళా ఓటింగ్ 88,503 ఉండ‌గా..పురుషుల ఓటింగ్ 84 వేలు గా ఉంది. ఇక‌, పోలింగ్ తమ‌కు అనుకూలంగా చేయ‌టం కోసం..అదే విధంగా..పోలింగ్ కు రాకుండా ఉండేందుకూ న‌గ‌దు పంపిణీ చేసిన‌ట్లు YCP నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ప్ర‌భుత్వం ఎన్నిక‌ల షెడ్యూల్ కు ముందు న‌జ‌రానా ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మ‌హిళ‌ల‌కు అంద‌రికీ ఒకే విధంగా అమ‌లు చేయాల్సిన న‌గ‌దు పంపిణీని నంద్యాల డ్వాక్రా సంఘాల వ‌ర‌కే ప‌రిమితం చేసింది. అందులోనే ప‌లు మిన‌హాయింపులు ఇచ్చిన‌ట్లు YCP చేసిన అధ్య‌య‌నం లో తేలింది.
నంద్యాల ప‌ట్ట‌ణంలో  29 వేల మంది డ్వాక్రా స‌భ్యులు ఉన్నారు. ఇక‌, రూర‌ల్ లో 726 గ్రూపులు, గోస్పాడులో 669 గ్రూపు లు ఉన్నాయి. ఈ సంఘాల్లో మొత్తంగా 43 వేల మంది స‌భ్యులుగా ఉన్నారు. TDP ప్ర‌భుత్వం అధికారంలో వ‌చ్చిన త‌రువాత అంత‌కు ముందు ఇచ్చిన హామీని విస్మ‌రించి..ప్ర‌తీ డ్వాక్రా స‌భ్యురాలికి ప‌దివేలు రుణ ఉప‌శ‌మ‌నం ఇస్తామని ప్ర‌క‌టించింది. అయితే, అందులో తొలి విడ‌త‌గా మూడు వేలు ఇచ్చి అది రివాల్వింగ్ ఫండ్‌..విత్ డ్రాకు అవ‌కాశం లేద‌ని కండిష‌న్ పెట్టింది. ఇక రెండో విడ‌త‌గా ఇచ్చిన మూడు వేలు ప‌సుపు-కుంకుమ గా పేరు పెట్టింది. ఈ రెండు విడ‌త‌లు రాష్ట్ర వ్యాప్తంగా అమ‌ల‌య్యాయి. అయితే, మూడో విడ‌త‌గా ఇవ్వాల్సిన నాలుగు వేలు మాత్రం..కేవ‌లం ఉప ఎన్నిక‌ను దృష్టిలో ఉంచుకొని నంద్యాల మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే అమ‌లు చేసారు. ఎన్నిక‌ల షెడ్యూల్ కు ముందు జూ లై 14న ప్ర‌తీ గ్రూపు స‌భ్యురాలికి నాలుగు వేలు అందేలా ప్ర‌భుత్వం నిధులు విడుద‌ల చేసింది. అదే స‌మ‌యంలో..తొలి విడ‌త‌లో రివాల్వింగ్ ఫండ్ కింద  నాలుగు వేల విత్ డ్రా మీద ముందు పెట్టిన ష‌ర‌తు ఎత్తి వేసింది. ఈ నిధుల విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌వ‌ద్ద‌ని..చెప్పినా-TDP కి ఓటు వేయ‌కున్నా..ఆ త‌రువాత వ‌చ్చే నిధులు ఆగిపోతాయ‌ని త‌మ స‌ర్వే టీం ల‌తో స‌భ్యురాళ్ల‌ను భ‌య పెట్టింద‌ని YCP ఆరోపిస్తోంది. ప్ర‌భుత్వం ఈ విధంగా కేవలం నంద్యాల‌లో మాత్ర‌మే నిధులు విడుద‌ల చేసిన ఆధారాలు బ‌య‌టకు వ‌చ్చాయి. వీటిని రాష్ట్రం మొత్తం అర్ద‌మ‌య్యేలా ప్ర‌చారం చేస్తూ..రాష్ట్రం లోని మిగిలిన మ‌హిళ‌ల‌కు ఇది ఎందుకు అమ‌లు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించ‌టానికి YCP నిర్ణ‌యించింది.
కేవ‌లం నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని డ్వాక్రా స‌భ్యుల కోస‌మే ఎన్నిక‌ల సంద‌ర్భంగా 47 కోట్ల 24 ల‌క్ష‌ల 39వేల రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.
ఇలా..ఉప ఎన్నిక‌ల్లో గెల‌వ‌టం కోసం రాష్ట్రం మొత్తం స‌మానంగా చూడాల్సిన ప్ర‌భుత్వం..ఇలా వ్య‌వ‌హ‌రించ‌టం తో ఇప్పుడు ఈ అంశం ఖ‌చ్చితంగా TDP మెడ‌కు చుట్టుకోనుంది.