RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

అనుమానమా…అవ‌మాన‌మా…!

  • March 7, 2018 | UPDATED 19:36 IST Views: 622
  • Share

 

AP ప్ర‌భుత్వం పై కేంద్రానికి అనుమానాలు ఉన్నాయా. ప్ర‌త్యేక హోదా లేద‌ని చెబుతూ AP ప్ర‌జ‌ల‌ను కేంద్రం అవ‌మానిస్తుందా. ఆరుణ్ జైట్లీ వ్యాఖ్య‌లు ఏం స్ప‌ష్టం చేస్తున్నాయి. పోల‌వ‌రం..రాజ‌ధాని పై జైట్లీ వ్యాఖ్య‌ల వెనుక ప‌ర‌మార్ధం ఏంటి. నాలుగేళ్లుగా మ‌రి..AP ముఖ్య‌మంత్రి ఏం చేస్తున్న‌ట్లు. రాజ‌ధానికి నిధులు ఇచ్చేసామ‌ని జైట్లీ స్ప‌ష్టం చేసారు. పోల‌ర‌వం నిధుల విష‌యంలోనూ ఇదే విధంగా వ్యాఖ్యానించారు. పోల‌వ‌రం నిర్మాణం వేగ‌వంతం అవ్వాల్సి ఉంద‌ని అభిప్రాయ ప‌డ్డారు. AP ప్ర‌భుత్వం యుటిలైజేష న్ స‌ర్టిఫికెట్లు ఇవ్వ‌క‌పోవ‌టం తో కేంద్రానికి అనుమానాలు పెరుగుతున్నాయా. లోపం ఎక్క‌డ‌. ఢిల్లీలోనా.. అమ‌రావ‌తిలోనా… చంద్ర‌బాబు ప్ర‌సంగంలో జైట్లీ ప్ర‌తిపాదించిన అంశాలేవి…అస‌లు ఏం జ‌రుగుతోంది…

AP అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి దాదాపు మూడు గంట‌ల సుదీర్ఘ ప్ర‌సంగం చేసారు. AP పున‌ర్విభ‌జ‌న చ‌ట్టాన్ని అంశాల వారీగా వివ రించే ప్ర‌య‌త్నం చేసారు. కేంద్ర ప్ర‌భుత్వం పై ఒత్తిడి తెచ్చే విధంగా కాకుండా..కేవ‌లం అభ్య‌ర్ధించే విధంగా ముఖ్య‌మంత్రి ప్ర‌సం గం కొన సాగింది. ఈ బ‌డ్జెట్ స‌మావేశాల్లోనే చ‌ట్టం అమ‌లు పై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని డిమాండ్ చేసారు. ప్ర‌త్యేక హోదా అంశంతో వైసిపి ప్ర‌జ‌ల తో మ‌మేకం అయింద‌నే సంకేతాల‌తో..ప్లేట్ ఫిరాయించారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. ఇప్పుడు ప్ర‌త్యేక హోదాకు ఎన‌లేని ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇక్క‌డ చంద్ర‌బాబు ప్ర‌సంగం ముగియ‌గానే..ఢిల్లీలో కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసారు. APకి ప్ర‌త్యేక హోదా సాధ్యం కాద‌ని తేల్చి చెప్పారు. హోదా సాధ్యం కాద‌ని ..అందు కోస‌మే హోదా స్థానంలో క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను మ‌రో రూపంలో APకి ఇచ్చే విధంగా AP ప్ర‌భుత్వంలో సంప్ర‌దింపులు జ‌రిపామ‌ని..అందుకు ప్యాకేజి రూపంలో ల‌బ్ది క‌లిగేలా ప్యాకేజికి AP ప్ర‌భుత్వం అంగీక‌రించ‌దే విష‌యాన్ని జైట్లీ గుర్తు చేసారు. అయితే, అ ప్ర‌యోజ‌నాల ను నాబార్డు ద్వారా పొందేలా చూడాల‌ని AP ప్ర‌భుత్వం తాజాగా కోరింద‌నే విష‌యాన్ని చెప్పుకొచ్చా రు. అదే జ‌రిగితే APకి న‌ష్ట‌మ ని వివ‌రించారు. స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్ ఏర్పాటు చేసుకోవాల్సిందా సూచించామ‌ని స్ప‌ష్టం చేసారు. ముఖ్య‌మంత్రి అసెంబ్లీలో ఈ విష‌యాల‌ను చెప్ప‌క‌పోవ‌టం..జైట్లీ స్ప‌ష్టంగా చెప్ప‌టంతో విష‌యం ముదిరిన‌ట్లు అర్దం అవుతోంది.

నాడు హోదా వ‌ద్ద‌ని..ప్యాకేజికి అంగీక‌రించింది ముఖ్య‌మంత్రేన‌నే విష‌యం మ‌రో సారి జైట్లీ స్ప‌ష్టంగా చెప్పారు. ఇదే స‌మావేశం లో జైట్లీ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. AP రాజ‌ధాని కోసం తాము ముందుగానే అడ్వాన్స్ రూపంలో 2500 కోట్లు ఇచ్చామ‌ని చెప్పుకొచ్చారు. అయితే, రాష్ట్ర ప్ర‌భుత్వం తాత్కాలిక నిర్మాణ‌ల‌ని చెబుతున్న క‌ట్ట‌డాల‌తో త‌మకు సంబంధం లేద‌నే విధంగా జైట్లీ స్ప‌ష్ట‌త ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. పున‌ర్విభ‌జ‌న చట్టం ప్ర‌కారం రాజ‌ధాని కోసం ఇవ్వాల్సిన నిధులు ఇచ్చేసామ‌ని అరుణ్ జైట్లీ ప‌రోక్షంగా చెప్పుకొచ్చారు. ఇక‌, పోల‌వ‌రం విష‌యంలోనూ జైట్లీ చేసిన వ్యాఖ్య‌లు కొత్త చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌య్యాయి. పోల‌వ‌రం కో సం నిధులు ఇస్తున్నామ‌ని చెబుతూనే..నిర్మాణం వేగం పంజుకోవాల్సి ఉంద‌ని..దీనికి అనుగుణంగా నిధులు విడుద‌ల ఉంటుంద‌ని సంకేతాలిచ్చారు. ఇప్ప‌టికే తామిచ్చిన నిధుల‌కు యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్లు ఇవ్వ‌లేద‌ని కేంద్ర ఆర్దిక శాఖ కొర్రీలు వేస్తున్న‌ట్లు గా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, లెక్క‌లు చెప్పాల్సిన అవాస‌రం లేద‌నేది AP ప్ర‌భుత్వ వాద‌న‌. ఇక‌, ముఖ్య‌మంత్రి శాస‌న‌స‌భ‌లో కేంద్రం ప్యాకేజికి సంబంధించిన చెప్పిన అంశాల‌ను ప్ర‌స్తావించారు. కానీ, AP ప్ర‌భుత్వానికి ఎస్పీవి ఏర్పాటుకు సూచన చేసింద నే విష‌యాన్ని ప్ర‌స్తావించ‌క‌పోవ‌టాన్ని బిజెపి నేత‌లు గుర్తు చేస్తున్నారు. అయితే, ప్ర‌త్యేక హోదా లేదంటూ APకి ఇచ్చిన హామీని విస్మ‌రిస్తూ అవ‌మానించేలా వ్య‌వ‌హ‌రిస్తున్న కేంద్రం..AP ప్ర‌భుత్వం తీరు పై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని విశ్లే ష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. దీని ద్వారా…బిజెపి సైతం టిడిపితో అమీ తుమీ తేల్చుకోవటానికే సిద్ద‌ప‌డిన‌ట్లు అర్ద‌మ‌వు తోంది. మ‌రి..ముఖ్య‌మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.