RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

బాబు ఫాలోస్ జ‌గ‌న్‌…!

  • March 8, 2018 | UPDATED 17:08 IST Views: 1005
  • Share

 

సీనియ‌ర్ పొలిటిషియ‌న్. 40 ఏళ్ళ రాజ‌కీయ అనుభ‌వం. APకి ముఖ్య‌మంత్రి. కానీ, విప‌క్ష నేత రాజ‌కీయ వ్యూహాల్లో దిగ్బంధ నం. YCP అధినేత జ‌గ‌న్ నిర్ణ‌యాల‌నే అమ‌లు చేయాల్సిన ప‌రిస్థితి. జ‌గ‌న్ బాట‌లోనే ప‌య‌నిస్తున్న అధికార పార్టీ. చంద్ర‌బాబు త‌లొగ్గేలా ఒత్తిడి చేయ‌టంలో జ‌గ‌న్ స‌క్సెస్‌. తొలి నుండి YCP APకి ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తూనే ఉంది. అధికార TDP అనేక విమర్శ‌లు చేసింది. హోదా స్థానంలో ప్యాకేజి స‌రిపోతుంద‌నే విధంగా వ్యాఖ్య‌లు చేసింది. తిరిగి..హోదా వ‌ద్ద‌కే వ‌చ్చింది. కేంద్ర మంత్రుల రాజీనామా చేసి కేంద్రం పై ఒత్తిడి పెంచాల‌ని జ‌గ‌న్ ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ వ‌చ్చారు. నో అన్న‌ది. కానీ, ఇప్పుడు రాజీనామాలు చేయ‌క త‌ప్ప‌లేదు. ఇక‌, 45 ఏళ్ల‌కే మ‌హిళ‌ల‌కు పెన్ష‌న్ ఇస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టిస్తే TDP నేత‌లు త‌ప్పు బ‌ట్టారు. ఇప్పుడు AP ప్ర‌భుత్వ బ‌డ్జెట్‌లో 50 ఏళ్ల మ‌త్స్య‌కారుల‌కు పెన్ష‌న్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇలా..అన్ని విష‌యాల్లో జ‌గ‌న్ ను ఫాలో అవుతోంది AP ప్ర‌భుత్వం…

2014 ఎన్నిక‌ల త‌రువాత‌..జ‌గ‌న్ విప‌క్ష నేత‌గా తొలి నాళ్ల‌లో అనేక ర‌కాలుగా TDP నేత‌లు అన‌మానించారు. అవ‌హేళ‌న చేసారు. కానీ, సీన్ మారిపోయింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌దేప‌దే చెప్పుకొనే త‌న అనుభ‌వం కంటే జ‌గ‌న్ ఆలోచ‌న‌లే స‌రైన‌వ‌నే అంశా న్ని TDP నేత‌లే రుజువు చేస్తున్నారు. 2014 ఎన్నిక‌ల త‌రువాతి నుండి APకి ప్ర‌త్యేక హోదా పై జ‌గ‌న్ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇందు కోసం దీక్ష‌లు చేసారు. యువ‌భేరీలు నిర్వ‌హించారు. కానీ, అధికార పార్టీ TDP..కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల‌న కేంద్రంతో ప్ర‌త్యేక హోదా స్థానంలో ప్ర‌త్యేక ప్యాకేజికి ఒప్పందం చేసుకుంది. దీని పై విప‌క్ష నేత అప్ప‌ట్ల్లోనే అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. APకి ప్ర‌త్యేక హోదా కోసం డెడ్‌లైన్ పెట్టి…అప్ప‌టికీ ఇవ్వ‌క‌పోతే కేంద్రంలోని TDP మంత్రుల‌తో రాజీనామా చేయించాల‌ని డిమాండ్ చే సారు. TDP అధినాయ‌క‌త్వం నో అన్న‌ది. కానీ, ఇప్పుడు అదే చేసింది. ప్యాకేజి ప్ర‌క‌ట‌న స‌మ‌యంలో జైట్లీ ఏం చెప్పారో..ఇప్పుడు కూడా అదే చెప్పారు. కానీ, జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన కార్యాచ‌ర‌ణ‌..ప్ర‌త్యేక హోదా కోసం తీసుకున్న నిర్ణ‌యాల‌తో TDP పై ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు TDP సైతం APకి ప్ర‌త్యేక హోదా కావాలంటూ యూ ట‌ర్న్ తీసుకుంది. జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన అవిశ్వాసం ద్వారా TDP ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. AP కి ప్ర‌త్యేక హోదా కోసం ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా జారిపోకుండా..అదే ఒత్తిడి కొన‌సాగించ‌టం తో ఇప్పుడు TDP సైతం జ‌గ‌న్ ను అనుస‌రించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఇక‌, జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా చేస్తున్న విమ‌ర్శ‌లు..ఇస్తున్న వ‌రాల‌ను TDP హైక‌మాండ్ జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తోంది. జ‌గన్ ప్ర‌కటించిన వ‌రాల‌నే తాము అమ‌లు చేసే విధంగా నిర్ణ‌యాలు తీసుకుంటుంది. అధికారంలోకి రాగానే 45 ఏళ్ల‌కే పెన్ష‌న్ విధానం అమ‌లు చేస్తామ‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌ను TDP అనేక ర‌కాలుగా విమ‌ర్శించింది. జ‌గ‌న్ హ‌మీలు అమ లు సాధ్యం కాద‌ని వాదించింది. కానీ, తాజాగా ప్ర‌తిపాదించిన బ‌డ్జెట్‌లో మ‌త్స్య‌కారుల‌కు 50 ఏళ్ల‌కే పెన్ష‌న్ ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టంగా పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి హామీ పై జ‌గ‌న్ ప్ర‌తీ స‌భ‌లోనూ చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ, జ‌గ‌న్ విమ‌ర్శ‌ల జోరు పెర‌గ‌టంతో…నిరుద్యోగ భృతి కోసం వెయ్యి కోట్లు కేటాయిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. గ‌తంలో ప‌దేళ్ల పాటు విప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు..ఈ స్థాయిలో ప్ర‌భుత్వాన్ని ప్ర‌భావితం చేయ‌లేకోపోయారు. అదే విధంగా.. 9 ఏళ్ల పాటు చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి గా ఉన్న స‌మ‌యంలోనూ ఈ ర‌కంగా విప‌క్ష నేత‌ల ఒత్తిడికి లొంగ‌లేదు. కానీ, జ‌గ‌న్ వ్యూహాత్మ కంగా వేస్తున్న అడుగులు..తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో…ముఖ్య‌మంత్రి పై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో..ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డుతున్న అధికార పార్టీ..జ‌గ‌న్ ను ఫాలో అవుతోంది. ఇప్పుడు ఇదే పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ మారుతోంది.