RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

ఆ న‌లుగురు ఎవ‌రితో…!

  • March 6, 2018 | UPDATED 20:20 IST Views: 974
  • Share

 

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల హీలో APలో రోజు రోజుకీ పెరిగిపోతోంది. మూడు స్థానాలు ద‌క్కించుకోవాల‌ని TDP…మాకు ద‌క్కాల్సిన స్థా నం మేము ద‌క్కించుకుంటామంటూ YCP నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అధికార TDP బ‌రిలో ముగ్గురు అభ్య‌ర్ధుల‌ను నిలిపితే ప్ర‌తీ ఓటు కీల‌కంగా మార‌నుంది. TDP ఇద్ద‌రు అభ్య‌ర్ధుల‌నే దించితే పోటీ ఏక‌గ్రీవంగా మారుతుంది. అయితే, TDP వ్యూహాల ను పరిశీలిస్తే..ముగ్గురు అభ్య‌ర్ధుల‌ను బ‌రిలోకి దించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే, ఇప్పుడు TDP మూడు స్థానాలు గెలవాలంటే..వారికి త‌మ పార్టీతో పాటుగా..ఫిరాయింపు MLAలు మాత్ర‌మే కాకుండా .. BJP MLAల ఓట్లు కీల‌కంగా మారు తున్నాయి. ప్ర‌స్తుతం TDP -BJP మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ ప‌తాక స్థాయికి చేరింది. ఈ ప‌రిస్థితుల్లో BJP MLAలు TDP ప్ర‌తి పాదించిన అభ్య‌ర్ధుల‌కు మ‌ద్ద‌తుగా ఓటేస్తారా లేదా అనే అనుమానం TDP నేత‌ల్లో క‌నిపిస్తోంది.

రాజ్య‌సభ ఎన్నిక‌ల్లో ముగ్గురు అభ్య‌ర్ధుల‌ను బ‌రిలోకి దించేందుకు TDP రంగం సిద్దం చేసుకుంటుంది. YCP త‌మ అభ్య‌ర్దిని ఇప్ప‌టి కే ఖ‌రారు చేసింది. నామినేష‌న్ దాఖ‌లు కోసం రంగం సిద్దం చేసుకుంది. ఈ నెల 12వ తేదీ నామినేష‌న్ల‌కు చివ‌రి తేదీ కావ‌టంతో అప్ప‌టికి TDP ముగ్గురు అభ్య‌ర్ధుల‌నే బ‌రిలోకి దించే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. లెక్క ప్ర‌కారం TDPకి రెండు స్థానా లు..YCPకి ఒక్క స్థానం ద‌క్కాల్సి ఉంది. కానీ, TDP మూడు స్థానాలు ద‌క్కించుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తు న్న‌ట్లు స‌మాచారం. దీంతో..YCP సైతం త‌మ పార్టీ నుండి గెలిచి TDPలో ఫిరాయించిన MLAల పై చర్య‌ల కోసం ఒత్తిడి పెంచింది. TDP నుండి గెలిచిన 102 మంది స‌భ్యుల‌తో పాటుగా విలీనం అయిన ఇద్ద‌రు స‌భ్యులు..YCP నుండి ఫిరాయించిన 23 మందిని క‌లుపుకుంటే మొత్తం 127మంది మ‌ద్ద‌తు ఉంటుంది. YCPకి త‌మ అభ్య‌ర్ధిని గెలిపించుకోవ‌టానికి కావాల్సిన ఖ చ్చిత‌మైన 44 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు ఉంది. దీంతో..ఏ ఒక్క‌రు జారీ పోకుండా YCP వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అటు TDP నేత‌లు మాత్రం తమ‌తో YCP MLAలు కొంద‌రు ట‌చ్‌లో ఉన్నార‌ని మైండ్ గేమ్ ప్రారంభించారు. ఇదే స‌మ‌యంలో ..YCP సైతం రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో TDP కి ఊహించ‌ని షాక్ ఇస్తామ‌ని చెబుతున్నారు. ప్ర‌తీ ఓటు కీల‌కంగా మారిన ఈ ఎన్నిక ల్లో అస‌లు ట్విస్ట్ ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చింది. న‌లుగురు MLAలు ఉన్న BJP రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రి స్తుంద‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

బ‌లం లేక‌పోయినా..ఫిరాయింపు MLAల మ‌ద్ద‌తుతో మూడో అభ్య‌ర్ధిని TDP బ‌రిలోకి దింపేందుకు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది. అయితే, BJP నుండి న‌లుగురు MLAల మ‌ద్ద‌తు పై TDPలోనూ సందేహాలు వినిపిస్తున్నాయి. త‌మ‌ను APలో పూర్తి స్థాయిలో డామేజ్ చేస్తున్న TDPకి షాక్ ఇవ్వాలంటే..రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా త‌ట‌స్థ వైఖ‌రితో ఉండాల‌ని కొంద‌రు BJP నేత‌లు ఢిల్లీ పెద్ద‌ల‌ను కోరుతున్న‌ట్లు స‌మాచారం. అయితే, రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు కోసం BJP MLAల పై ఎటువంటి విమ‌ర్శ‌లు చేయ‌వ‌ద్ద‌ని..వారి తో స‌ఖ్య‌త‌గా ఉండాల‌ని పార్టీ నేత‌ల‌కు TDP అధినాయ‌క‌త్వం సూచించిన‌ట్లు స మాచారం. ప్ర‌స్తుతం పొత్తు ఇంకా కొన‌సాగుతున్న స‌మ‌యంలో..BJP నేత‌లు త‌మ‌కు మ‌ద్ద‌తు ఇస్తార‌ని TDP నేత‌లు పైకి చెబు తున్నా..BJP MLAల స‌హ‌కారం TDP నేత‌ల్లో లోలోప‌ల మాత్రం సందేహాలు వ్య‌క్తం అవుతూనే ఉన్నాయి. BJP ఇదే స‌రైన స‌మ‌యంగా భావించి..మ‌ద్దతు కు దూరంగా ఉంటే..TDPకి మూడో అభ్య‌ర్ధిని గెలిపించుకోవాల‌నే అశ‌లు నెర‌వేర‌టం అం త సులువుగా క‌నిపించ‌టం లేదు. ఇక‌, ఇదే స‌మ‌యంలో YCP నుండి ఫిరాయించి వ‌చ్చిన కొంద‌రు MLAలు సైతం YCP కే మ‌ద్ద‌తు ఇస్తార‌నే ప్ర‌చారం సైతం TDPకి మింగుడు ప‌డ‌టం లేదు. దీంతో పాటుగా కొంద‌రు TDP MLAలే పార్టీ నేత‌ల పై బ‌హిరంగంగా చేస్తున్న వ్య‌తిరేక వ్యాఖ్య‌లను చూస్తుంటే..వారు మ‌న‌స్పూర్తిగా స‌హ‌క‌రిస్తారా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతు న్నాయి. మ‌రి..ఈ నెంబ‌ర్ గేమ్‌లో రాజ్య‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రింత ఆస‌క్తిని పెంచుతున్నాయి.