RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

TDP పై BJP అస్త్రాలు సిద్దం..!!

  • March 9, 2018 | UPDATED 13:25 IST Views: 1804
  • Share

 

TDP నేత‌లు మంత్రి ప‌దువులు వ‌దులుకున్నారు. భారీ ప్ర‌చారం చేసుకుంటున్నారు. కానీ, NDA లో కొన‌సాగుతున్నారు. అందుకు కార‌ణాలు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తాము APకి చాలానే చేసామ‌ని చెబుతున్న BJP నేత‌లు..TDP నేత‌లు త‌మ పై చేస్తున్న ప్ర‌చారాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఇందుకు కౌంట‌ర్ ప్ర‌చారం సిద్దం చేస్తున్నారు.ఇప్ప‌టికే కార్యాచ‌ర‌ణ ఖ‌రారు చేసుకు న్నారు. TDP ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని నిర్ణ‌యించారు. త‌మ నిర్ణ‌యం త‌రువాత త‌మ కు స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని..ఇబ్బందులు ఉంటాయ‌ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రే చెబుతున్నారు. అందు కోస‌మే NDA లో కొన‌సాగుతున్నారు. అయినా…BJP మాత్రం AP లో ప‌రిణామాల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతంది. APలో ఇక TDPని అష్ట‌దిగ్బంధ‌నం చేయ‌ట‌మే మిగిలింది…

ప్ర‌జల ఒత్తిడి మేర‌కు TDP కేంద్ర మంత్రులు రాజీనామా చేసారు. కానీ, ఇత‌ర అవ‌స‌రాల కోసం NDAలో కొనసాగుతున్నారు. రా ష్ట్రంలోని BJP మంత్రుల రాజీనామాల‌ను AP ముఖ్య‌మంత్రి వెంట‌నే ఆమోదించారు. దీంతో కేంద్రంలోని TDP మంత్రుల రాజీ నా మాల‌కు సైతం వెంట‌నే ఆమోదం ల‌భించింది. TDP NDA లో భాగ‌స్వామిగా ఉన్నామ‌ని చెబుతున్నా..APలో BJPని చేయాల్సి న న‌ష్టం చేసేసింది. దీంతో..ఇప్పుడు BJP నేత‌లు TDP ని టార్గెట్ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందు కోసం ప‌క్కా కార్యాచ‌ర‌ణ సిద్దం చేసుకుంటున్నారు.

AP కోసం తాము చేసింది ఏనాడు TDP ప్ర‌భుత్వం చెప్ప‌లేద‌న్న‌ది BJP నేత‌ల వాద‌న‌. ఇందు కోసం సాధార‌ణంగా TDPకి మద్ద‌తుగా ఉండే తెలుగు మీడియా అధిప‌తుల‌తోనూ సంప్ర‌దింపులు జ‌రుగుతున్నాయి. తమ వాయిస్ వినిపిం చేందుకు స్సేస్ ను తీసుకుంటోంది BJP. ఇక‌, త‌మ నిధుల‌తో నిర్మాణంలో ఉన్న ఏయిమ్స్‌, నిట్ తో పాటుగా ఇత‌ర విద్యా సంస్థ‌ల నిర్మాణాల‌ను క్షేత్ర స్థాయిలో చూపించి…వాటి లో ప్ర‌భుత్వం తీసుకున్న లోప భూయిష్ట‌మైన నిర్ణ‌యాల‌ను బ‌హిర్గతం చేయాల‌ని ఇప్ప టికే BJP హైక‌మాండ్ రాష్ట్ర నేత‌ల‌కు దిశా నిర్ధేశం చేసింది. దీంతో పాటుగా రాష్ట్ర ప్ర‌భుత్వం చెబుతున్న ఆర్దిక లెక్క‌లు..వాస్త‌వాల పైనా ఉన్న‌ది ఉన్న‌ట్లు ప్ర‌జ‌ల‌కు తెలియ చేయాల‌ని ఇప్ప‌టికే BJP డిసైడ్ అయింది.

తాము కేంద్ర మంత్రి మండ‌లి నుండి బ‌య‌ట‌కు రావ‌టం ద్వారా.. నెపం అంతా BJP మీద‌కు వెళ్తుంద‌ని..త‌మ‌కు రాజ‌కీయంగా భారీ మైలేజ్ వస్తుంద‌ని TDP ఆశిస్తోంది. కానీ, BJP నేత‌లు మాత్రం దీన్ని సీరియ‌స్‌గానే ప‌రిగ‌ణిస్తున్నారు. కేంద్ర మంత్రి మండలి నుండి బ‌ట‌య‌కు వ‌స్తున్నార‌నే సంగ‌తి తెలిసినా..ప్ర‌ధాని మోదీ-అమిత్ షా ద్వ‌యం ఎవ‌రూ కూడా TDP ని నిలువ‌రించే ప్ర య‌త్నాలు చేయ‌లేదు. ఇక‌, TDP ని కార్న‌ర్ చేసే అంశాల పై దృష్టి పెడుతున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. పోల‌వ‌రం పై ఎంతో కాలంగా అనేక ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. పోల‌వ‌రం ప్రాజెక్టు బాధ్య‌త‌ల‌ను ఇప్పుడు కేంద్ర‌మే స్వీక‌రించే అవ‌కాశాలు స్ప ష్టం గా క‌నిపిస్తున్నాయి. ఇక‌, రాజ‌ధాని అంశంలో సింగపూర్ ప్ర‌భుత్వంతో జ‌రిగిన స్విస్ ఛాలెంజ్ విధాన‌ప‌ర‌మైన ఒప్పందాల మీద దృష్టి సారించే ప‌రిస్థితులున్నాయ‌నే వాద‌న తెర మీద‌కు వ‌చ్చింది. దీంతో పాటుగా రాజ‌ధాని భూముల క్ర‌య విక్ర‌మాల లావాదేవీల మీద సైతం కేంద్ర సంస్థ‌లు ఇప్ప‌టికే స‌మాచారం సేక‌రించాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇక ఇదే స‌మ‌యం లో BJP ప్ర‌ముఖుల‌ను APలో మొహ‌రించి..వాస్త‌వాల‌ను తెలియ చేయ‌టంతో పాటుగా TDP ప్ర‌భుత్వలోపాల‌ను సైతం ప్ర‌జల్లో ఎండ గ‌ట్టాల‌ని BJP నిర్ణ‌యించిన‌ట్లు విశ్వ‌స నీయ స‌మాచారం. మ‌రి కొద్ది రోజుల్లోనే BJPలోని ట్ర‌బుల్ షూట‌ర్స్‌కు ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నారు. ఇక‌, అమిత్ షా సైతం ఈ నెలాఖ‌రులో APలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇలా..రాజ‌కీయంగానే కాకుండా..కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని కీల‌క నిర్ణ‌యాల ద్వారా..AP పై త‌మ‌కు ఉన్న చిత్త‌శుద్దిని చాటుకొనేలా ప‌నులు జ‌రుగుతాయ‌ని.. అదే స‌మ‌యంలో TDP ని కార్న‌ర్ చేయ‌టం సాధ‌రణంగానే జ‌రిగే ప‌రిణామామ‌ని BJP నేత‌లు గ‌ట్టిగా చెబుతున్నారు. దీంతో.. రానున్న రోజుల్లో AP లో కీల‌క రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకొనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాన‌యి.