RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

ఎవ‌రిది పై చేయి..!

  • March 8, 2018 | UPDATED 10:53 IST Views: 926
  • Share

 

కేంద్ర ప్ర‌భుత్వం నుండి విత్ డ్రా అయ్యేలా చంద్ర‌బాబు త‌లొగ్గే ప‌రిస్థితి తెచ్చిందెవ‌రు. AP అధికార పార్టీ జ‌గ‌న్ ను ఫాలో కావాల్సిందేనా. ప్ర‌త్యేక హోదా కోసం ఒత్తిడి పెంచేందుకు జ‌గ‌న్ వేస్తున్న వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డు ల‌కు TDP చిత్త‌వుతోందా. ఇప్పుడు తీసుకుం టున్న తాజా నిర్ణ‌యాల‌తో మైలేజ్ సాధిస్తుందా. జ‌గ‌న్ చెబుతున్న‌ట్లుగా TDP నిర్ణ‌యం ప్ర‌జ‌ల విజ‌య‌మేనా. కేంద్ర ప్ర‌భుత్వం నుండి TDP మంత్ర‌లు విత్ డ్రా వెనుక అసలు కార‌ణం ఏంటి. YCP వ్యూహం ఎలా ఉంటోంది . TDP ఏం చేయ‌బోతోంది. కేంద్రం ఆ లోచ‌న‌లు ఎలా ఉన్నాయి. APలో వేగంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌తో ఒక్క సారిగా AP భ‌విష్య‌త్ రాజ‌కీయాల పై అ నేక అంచ‌నాలు క‌నిపిస్తున్నాయి. తాజాగా కేంద్రం పై జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన అవిశ్వాసం అంశంలో TDP వైఖ‌రి ఏంట‌నేది హాట్ టాపిక్ గా మారింది .మొత్తానికి TDP ఒత్తిడి లో ఉన్న‌ట్లుగా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

కేంద్ర ప్ర‌భుత్వం నుండి TDP త‌మ కేంద్ర మంత్రుల‌ను విత్ డ్రా చేసుకుంది. ఇప్పుడే ఈ నిర్ణ‌యం ఎందుకు తీసుకుంది. కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా స‌మావేశం త‌రువాత ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మ‌ద్ద‌తు మీడియా ప్ర‌చారం చేస్తోంది. దీని వెనుక వైసి పి ఒత్తిడి..ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న అసంతృప్తి ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. పార్ల‌మెంట్ బ‌డ్జెట్ రెండో విడ‌త స‌మావేశాల స‌మ‌యం లో విప‌క్ష నేత జ‌గ‌న్ APకి ప్ర‌త్యేక హోదా కోసం త‌న కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించారు. కేవ‌లం ప్ల కార్డులు ప‌ట్టుకొని నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్న TDP ఎంపీల‌కు ధీటుగా..ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ ఖ‌రారు చేసారు. ఈనెల 5న ఢిల్లీలో మ‌హా ధ‌ర్నా.. 21న కేంద్రం పై అవిశ్వా సం..చివ‌రిగా YCP ఎంపీల రాజీనామాలు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీతో..TDP పై ఒత్తిడి పెరిగింది. ప్ర‌త్యేక హోదా పై తొలి నుండి పోరాడుతున్న పార్టీగా YCP మైలేజ్ ద‌క్కించుకుంది. దీంతో..TDP సైతం యూ ట‌ర్న్ తీసుకుంది. గ‌తంలో అనేక ర‌కాలుగా ప్ర‌త్యేక హోదా అంశాన్ని మ‌రుగున ప‌డేలా చేసిన TDP..ఇప్పుడు ఎన్నిక‌ల ముందు ప్ర‌త్యేక హోదా పై సానుకూల ధోర‌ణితో లేక‌పో తే..ప్ర‌జ‌ల నుండి వ్య‌తిరేక‌త త‌ప్ప‌ద‌ని గుర్తించింది. అయితే, కొన్ని బ‌ల‌హీన‌త‌ల కార‌ణంగా..కేంద్రం పై ఒత్తిడి పెంచే కార్య‌క్ర‌మాల్లో మాత్రం ముందుకు రాలేక పోయింది. ఇప్ప‌టికీ, కేంద్ర నుండి మంత్రుల‌ను ఉప సంహ‌రించుకుంది కానీ, ఎన్డీఏ నుండి మాత్రం ఇంకా బ‌య‌ట‌కు మాత్రం రాలేదు. దీంతో..అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

TDP కేంద్రం నుండి త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో ..ప్ర‌జ‌ల ఒత్తిడి కార‌ణంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఏడాది కాలంలో ఎన్నిక‌లు..YCP అధినేత ప్ర‌క‌టించిన కార్యాచ‌ర‌ణ TDPని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింది. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ త‌న వ్యూహా ల‌కు మ‌రింత ప‌దును పెట్టారు. జైట్లీ నిన్ని చేసిన ప్ర‌క‌ట‌నే గ‌తంలోనూ చేసార‌ని..అప్పుడే ఈ నిర్ణ‌యం తీసుకొని ఉంటే ఇప్ప‌టికే APకి హోదా వ‌చ్చేద‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. ఇప్ప‌టికైనా..YCP ఈ నెల 21న కేంద్రం పై అవిశ్వాసం ప్ర‌తిపాదిస్తుంద‌ని దీనికి TDP ఎంపీలు కూడా క‌లిసి రావాల‌ని సూచించారు. ఇంకా ముందే అవిశ్వాసం పెట్టాల‌ని TDP కోరితే అందుకు సిద్ద‌మ‌ని కూడా జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. మొత్తం APకి చెందిన 25 మంది ఎంపీలు క‌ల‌సి క‌ట్టుగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. TDP యే ముందుకు వ‌చ్చి..అవిశ్వాసం పెడితే మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ద‌మ‌ని కూడా జ‌గ‌న్ తేల్చి చెప్పారు. ఇంకా ఎన్డీఏ నుండి బ‌య‌ట‌కు రాని TDP..కేంద్రం తాము తీసుకున్న నిర్ణ‌యం ద్వారా ఏ ర‌కంగా రియాక్ట్ అవుతుందో అని వేచి చూస్తోంది. కేంద్రం APకి అన్యా యం చేస్తుంద‌ని..ఆంధ్రుల ఆత్మ గౌర‌వం దెబ్బ తీసింద‌ని చెబుతున్న TDP..ఇంకా ఎన్డీఏ లో కొన‌సాగ‌టం..ఇదే స‌మ‌యం లో జ‌గ‌న్ TDP పై మ‌రింత ఒత్తిడి పెంచేలా అవిశ్వాసం పై వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు తో TDP ఢిఫెన్స్లో ప‌డిన‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో..YCP APకి ప్ర‌త్యేక హోదా సాధించే కార్యాచ‌ర‌ణ ఫిక్స్ చేయ‌టం.. త‌మ‌ను TDP ఫాలో అయ్యేలా ఒత్తిడి పెంచ‌టంలో పై చేయి సాధించిన‌ట్లు క‌నిపిస్తోంది. రానున్న రెండు మూడు రోజుల్లో రాజ‌కీయంగా వ్యూహ – ప్ర‌తి వ్యూహాలు మ‌రింత వేడి పుట్టించ‌నున్నాయి.