RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

హోదాపై బాబు పిల్లి మొగ్గ‌లు !!

  • February 21, 2018 | UPDATED 13:40 IST Views: 922
  • Share

 

ప్ర‌భువును మించి భ‌క్తి చాటుకుంటున్న ప‌చ్చ ప‌త్రిక‌లు !!

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఎన్నిక‌ల ఫ‌లితాలు అనుహ్యంగా వ‌చ్చాయి. YCP అధికారంలోకి వ‌స్తుంద‌ని అంద‌రూ భావిస్తే BJP,TDPలు అధికారంలోకి వ‌చ్చాయి.దీనికి ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇచ్చిన సంగ‌తి తెల్సిందే. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అనుభ‌వం ఉన్న నేత‌. ఆ అనుభ‌వాన్ని రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఉప‌యోగిస్తే మేలు జ‌రుగుతుంద‌ని భావించిన ప్ర‌జ‌లు గ‌త ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించారు. కానీ అనుకున్న‌దొక్క‌టి. అయ్యిందొక్క‌టి అన్న చందంగా ప‌రిస్ధితి రివ‌ర్స్ అయింది. చంద్ర‌బాబు అనుభ‌వం రాష్ట్రంఅభివృద్దికి ఏమాత్రం దో హ‌ద ప‌డ‌లేద‌ని వాస్త‌వం గ‌త నాలుగేళ్ల పాల‌న‌లో తేలిపోయింది. ఇప్పుడు దాన్ని క‌వ‌ర్ చేసుకోవ‌టానికి కొత్త కొత్త డ్రామాల‌కు తెర లేపుతున్నారు. దానికి అస్ధాన ప‌చ్చ మీడియా ప్ర‌భువును మించి ప్ర‌భు భ‌క్తి చాటుకునే విధంగా వార్త క‌థ‌నాల‌తో ర‌క్తిక‌ట్టిస్తోంది.

బాబు అప్ప‌డేమ‌న్నారు? ఇప్పుడేమంటున్నారు?

బాబు అధికారంలోకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో ఆయ‌న ఎంతో ఆత్మ‌విశ్వాసంతో ప్ర‌క‌ట‌న‌లు చేసే వారు. అమ‌రావ‌తి నిర్మాణం గురించి కానీ, అలాగే ప‌దేళ్లు హైద‌రాబాద్ లోనే ఉంటామ‌ని గానీ చేసిన ప్ర‌క‌ట‌న‌లు తెలంగాణ TDPకి, ప్ర‌జ‌ల‌కు కూడా ఏదో మేర‌కు న‌మ్మ‌కం క‌ల్గించేవి కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. గ‌త నాలుగేళ్లుగా BJPని వెన‌కేసుకొచ్చిన బాబు ఇప్పుడు క‌ళ్లు తేలేశారు.నాలుగేళ్లు త‌ర్వాత కేంద్రంలోని BJP స‌ర్కార్ ఏపీకి త‌గిన నిధులు ఇవ్వ‌టం లేదని ఇప్పుడు ఆరోపిస్తున్నారు. గ‌త నాలుగు బ‌డ్జెట్ల లోనూ కూడా BJP ఇదే వైఖ‌రి ప్ర‌ద‌ర్శించింది. ఈనాడు ఏపీ కంటే ఎక్కువ నిధులు ఏ రాష్ట్రానికి వ‌చ్చాయో చెప్పండంటూ ప్ర‌తిప‌క్షాల‌కు స‌వాల్ విసిరిన బాబు ఇప్పుడు అదే నోటితో ఏపీకి ఏమీ ఇవ్వ‌లేదంటున్నారు. దాంతో ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు మాట‌పై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం స‌న్న‌గిల్లింది. ఏపీలో BJP నేత‌లు మాత్రం చంద్ర‌బాబు నాయుడుకి కౌంటర్‌గా ఆనాడు చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన స్టేట్ మెంట్ల‌ను ఉప‌యోగిస్తూ చంద్ర‌బాబును మ‌రింత ఇర‌కాటంలో పెడుతున్నారు. ఎన్నిక‌ల వేళ గ‌త నాలుగేళ్ల‌లో జ‌రిగిన లోపాలు స‌రిదిద్దుకుని ప్ర‌జ‌ల‌కు ఏదో చేసిన‌ట్లుగా బిల్డ‌ప్ ఇవ్వాల్సిన త‌రుణంలో చంద్రబాబుకు కొత్త క‌ష్టాలు మొద‌లైనాయి. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్ట‌డ‌మే కాకుండా ఏపీ ప్ర‌యోజ‌నాలే అంతిమ ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. మొద‌టి నుంచి ఏపీ ప్ర‌త్యేక హోదాకు క‌ట్టుబ‌డి అనేక ఉద్య‌మాలు చేస్తూ విడిపోయిన రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సంజీవిని అని చాటుతూ కోసం పోరాడుతున్న జ‌గ‌న్ ఇప్పుడు ఆ దిశ‌గా మ‌రింత వేగంగా పావులు క‌దుపుతున్నారు. దాంతో బాబు అండ్ కో తో పాటు ప‌చ్చ మీడియా కూడా బాబుకు ర‌క్షించే ప‌నిలో ప‌డ్డాయి. దానికి నిద‌ర్శ‌న‌మే ఆంధ్ర‌జ్యోతి, ఈనాడులో వ‌చ్చిన వార్త క‌థ‌నాలంటున్నారు.

ప్ర‌త్యేక హోదా వ‌స్తే , ఏం వ‌స్తోంది? అదేమ‌న్న సంజీవినా?ఈ మాట‌లెక్క‌డ‌కు పోయాయి ఇప్పుడు?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ ప్ర‌త్యేక హోదాపైన , హోదా ఉద్య‌యంపైనా దుర్మార్గ‌మైన దాడి చేశారు. ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం వైఎస్ జ‌గ‌న్ ఉద్య‌మిస్తుంటే హేళ‌న చేశాడు. హోదా అడిగితే పీడీ యాక్ట్ పెట్టాల‌ని ఆదేశించాడు. హోదా మీటింగ్ కు పంపితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. జైల్లో పెడ‌తామ‌ని కూడా చెప్ప‌ట‌మే కాకుండా. విజ‌య‌వాడ వంటి సెంట‌ర్స్‌లో హోదా కోసం ఉద్య‌మిస్తున్న వారిపై దాడుల‌కు కూడా TDP గుండాలు తెగ‌బ‌డ్డారు.అయినా YCP అధినేత జ‌గ‌న్‌. వామ‌ప‌క్షాలు. కొంద‌రు వ్య‌క్తులు సంస్ద‌లు అంద‌రూ క‌లిసి ఏపీ ప్ర‌త్యేక హోదా డిమాండ్‌ను కాపాడుకుంటూ వ‌చ్చారు. హోదాకు బ‌దులుగా కేంద్ర ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తే దాన్ని స్వాగ‌తించాడు చంద్ర‌బాబు. ఆనాడు అంద‌రూ ప్యాకేజీని వ్య‌తిరేకించిన కూడా ప‌ట్టించుకోని బాబు ఇప్పుడు మ‌ళ్లీ ప్లేట్ ఫిరాయిస్తున్ఆన‌డు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ప్ర‌త్యేక హోదా కావాల్సి వ‌చ్చింది.ఆనాడు ఎందుకు చంద్ర‌బాబు అలా మాట్లాడారు. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారంటే మాత్రం స‌మాధానం లేదు. కానీ అస్దాన మీడియా మాత్రం బాబును కాపాడుకునే ప‌నిలో నిమ‌గ్న‌మైంది.

ఇర‌కాటంలో బాబు అండ్ కో

ప్ర‌తీదాన్ని రాజ‌కీయం చేయ‌టానికి ప‌చ్చ మీడియా ఎప్పుడు సిద్దంగా ఉండ‌టంతో బాబు రాజ‌కీయాల‌తో ఈ నాలుగేళ్లు కాలం వెళ్ల‌బుచ్చారు. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ఉండ‌టంతో బాబు అప్ర‌మ‌త్తం అయ్యారు. BJPతో క‌టిఫ్ ఇద్దామంటే లొసుగులు బ‌య‌ట‌కు వ‌స్తాయేమోన‌నే భ‌యం. ఇక‌పోతే పోల‌వ‌రం వంటి జాతీయ ప్రాజెక్టును కేంద్రం నిర్మించాల్సి ఉండ‌గా రాష్ట్ర స‌ర్కార్ కోరి మ‌రీ తెచ్చుకుంది. ఇప్పుడు BJPతో విబేధాలు వ‌స్తే ఆ ప్రాజెక్టు ప‌రిస్థితి గంద‌ర‌గోళంలో ప‌డుతుంది. కాబ‌ట్టి చంద్రబాబు త‌న ప‌చ్చ‌మీడియా ద్వారా BJPపై ఏదో పోరాటం చేస్తున్న‌ట్లుగా బిల్డ‌ప్ లు ఇస్తున్నారు.కానీ ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌ల్గించ‌లేక‌పోతున్నారు. గ‌త నాలుగేళ్లుగా రాజ‌కీయ ఎత్తుల‌తోనే ముందుకు వెళ్లిన బాబు ఇప్పుడు అదే పంధాతో ముందుకు సాగుతున్నారు. త‌న వైఫ‌ల్యాల‌ను క‌వర్ చేసుకోవ‌టానికి విప‌క్షంపై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తున్నాడు. తొలి నుంచి ప్ర‌త్యేక హోదా కోసం జ‌గ‌న్ పోరాడుతున్న విష‌యాన్ని ప్ర‌జ‌ల మ‌ది నుంచి చెర‌ప‌టం ప‌చ్చ మీడియా వ‌ల్ల కావ‌టం లేదు. దాంతో ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు అండ్ కో పిల్లి మొగ్గ‌లు వేస్తున్నారు. జ‌గ‌న్ దారికి రావాల్సిన ప‌రిస్థితికి నెట్ట‌బ‌డ్డారు. అయితే ఆనాడు బాబు ఫ్ర‌త్యేక హోదాను ఎందుకు వ‌ద్ద‌న్నారు? అనేదాన‌కి బాబు ద‌గ్గ‌ర స‌మాధానం ఉందా? ప‌చ్చ ప‌త్రిక‌లు స‌మాధానం చెప్ప‌గ‌ల‌వా? ఈ ప్ర‌శ్న నేడు ఏపీలో ప్ర‌తి ఒక్క‌డు వేయ‌టానికి సిద్దంగా ఉన్నారు. బాబు స‌మాధానం చెప్ప‌గ‌ల‌డా?