RajakeeyaaluRajakeeyaalu

Monday, December 11, 2017

ఆ వ్యూహాలు ఎలా ఎదుర్కోవాలి…!

  • September 13, 2017 | UPDATED 14:04 IST Views: 8388
  • Share

 

TDP అధినాయ‌క‌త్వంలో కొత్త అల‌జడి. జ‌న‌నేత కు వ్యూహ‌క‌ర్త తోడ‌య్యారు. కొత్త కార్యక్ర‌మాలు సిద్దం చేస్తున్నారు. వ‌చ్చే నెల నుండి జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభిస్తున్నారు. ఏం చేయాలి..ఎలా ముందుకెళ్లాలి. నైతికంగా చేయాల్సిందేంటి. రాజ‌కీయంగా వేయాల్సిన ఎత్తుగ‌డ‌లు ఏంటి. పార్టీ MLA ల పని తీరు ఎలా ఉంది. YCP కోసం ప్ర‌శాంత్ కిషోర్ ఏ ర‌కంగా అయితే వ్యూహాలు సిద్దం చేస్తున్నారో..TDPకి అంత కంటే మెరుగైన వ్యూహాలు కావాలి. ఇలా కోరింది ఎవ‌రో కాదు..న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత‌..అడిగింది ఎవ‌రినో అర్ద‌మైంది క‌దా..ఇంత‌కీ ఆయ‌న ఏమ‌డిగారు..ఈయ‌న ఏం చెప్పారు..
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును కాంగ్రెస్ మాజీ MP ల‌గ‌డ‌పాటి క‌లిసారు. దాదాపు ఇద్ద‌రే త‌మ స‌మావేశం స‌మ‌యంలో ఏ ఒక్కరినీ రానీయ‌కుండా దాదాపు మూడు గంట‌ల పాటు ఏకాంతంగా సమావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశం పై ర‌క‌ర‌కాల వాదన‌లు ప్ర‌చారం లోకి వ‌చ్చాయి. ల‌గ‌డ‌పాటి TDP లో చేరుతున్నార‌ని..వ్యాపార ప‌రంగా సాయం కోసం వ‌చ్చార‌ని ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే, స‌మావేశం త‌రువాత ల‌డ‌గ‌పాటి తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌న లేద‌ని స్ప‌ష్టం చేసారు. అయితే, ఆయ‌న TDPలోకి అధికారికంగా చేర‌క‌పోయినా..ఆయ‌న వ్యాప‌ర ప‌రంగా అధికార పార్టీతో స‌త్సంబంధాలు న‌డుపుతున్నార‌ని..ల‌గ‌డ‌పాటి అవ‌స‌రం కూడా TDPకి ఉంద‌ని ఆ పార్టీ నేత‌లే చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి ఆహ్వానిస్తేనే తాను వ‌చ్చి చంద్ర‌బాబు ను క‌లిసాన‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌టం ద్వారా..TDP -ల‌గ‌డ‌పాటి ఏం ఆశిస్తున్నారో అర్దం చేసుకోవచ్చు. ఇక‌, ముఖ్య‌మంత్రి- ల‌గ‌డ‌పాటి మూడు గంట‌ల ఏకాంత స‌మావేశంలో ప్ర‌ధానంగా YCP కోసం వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్ అమ‌లు చేస్తున్న వ్యూహాలు..అవి YCP ఏ ర‌కంగా మేలు చేసే అవ‌కాశం ఉందీ..TDP ఎటువంటి వ్యూహాలు సిద్దం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌నే అంశం పై వారిద్ద‌రూ చ‌ర్చించిన‌ట్లు అత్యంత విశ్వ‌సనీయ స‌మాచారం.
ఇక‌, YSR కుటుంబం ద్వారా కోటి మందిని YCP లోకి చేరిస్తే అది ఎన్నిక‌ల్లో ఎటువంటి ప్ర‌భావం చూపుతుందనే అంశం పై కూడా ఇద్ద‌రూ చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. YCP స‌భ్య‌త్వంలో లక్ష్యాన్ని చేరుకున్న‌ట్ల‌యితే ఖ‌చ్చితంగా అది YCP కి నైతికంగా ఊహించ‌ని బ‌లాన్ని ఇస్తుంద‌ని ల‌గ‌డ‌పాటి సైతం అంగీక‌రించార‌ని తెలుస్తోంది. ఇక‌, జ‌గ‌న్ పాద‌యాత్ర గురించి చ‌ర్చించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. గ‌తంలో YS పాద‌యాత్ర స‌మ‌యంలో ల‌గ‌డ‌పాటి సైతం పాల్గొన్నారు. అప్ప‌టి- ఇప్ప‌టి పరిస్థితుల ఆధారంగా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంద‌. ఇక‌, ల‌గ‌డ‌పాటి స‌ర్వే సంస్థ ద్వారా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా అధికార‌- ప్ర‌తిప‌క్ష పార్టీల ప‌రిస్థితి ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌చేయాల‌ని..అనుస‌రించాల్సిన వ్యూహాల‌ను సూచించాల‌ని TDP అధినేత కోరిన‌ట్లు విశ్వ‌స నీయ స‌మాచారం. ప్ర‌ధానంగా ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌ధాని మోదీ..బీహార్‌, పంజాబ్ ల్లో ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకొనే విధంగా అమ‌లు చేసిన వ్యూహాలు..ఇక్క‌డ అదే ర‌కంగా ఎటువంటి వ్యూహాలు అమ‌లు చేసే అవ‌కాశం ఉంది.. ఏ వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను వారు ప్ర‌ధానంగా ఆక‌ట్టుకొనే ప్ర‌యత్నాలు చేస్తార‌నే దాని పైనా ఇద్ద‌రూ త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక‌, ప్ర‌శాంత్ కిషోర్ ద్వారా జ‌గ‌న్ వ్యూహాల‌ను క్షేత్ర స్థాయిలో అమ‌లు చేసే లోగానే…TDP నుండి ఏం చేయాలో ఒక స్ప‌ష్ట‌మైన వ్యూహాన్ని త‌మ సంస్థ ద్వారా ప్ర‌జ‌ల్లో అధ్య‌య‌నం చేసి ఇవ్వాల‌ని TDP అధినేత‌..ల‌గ‌డ‌పాటిని కోరిన‌ట్లు స‌మాచారం.  2019 ఎన్నిక‌ల వ‌ర‌కు వ్యూహాలు..స‌ర్వేల ద్వారా TDPకి అండ‌గా నిల‌వాల‌ని TDP అధినేత కోర‌గా..అందుకు ల‌గ‌డ‌పాటి సైతం అంగీక‌రించిన‌ట్లు స్ప‌ష్ట‌మైన స‌మాచారం.
దీని ద్వారా..ఇక TDP- YCP మ‌ధ్య పోరు..రాజ‌కీయ వ్యూహాల్లో PK వ‌ర్సెస్ ల‌గ‌డ‌పాటిగా మార‌నుంద‌ని తేలిపోయింది.