RajakeeyaaluRajakeeyaalu

Friday, February 23, 2018

న‌వ సంక‌ల్పానికి ఈనాడు ఫ్లాట్ ….!

  • July 10, 2017 | UPDATED 16:20 IST Views: 52870
  • Share

 

ఈనాడు కేమైంది..జ‌గ‌న్ న‌వ సంక‌ల్పానికి ఈనాడు ఫ్లాట్ అయింది. జ‌గ‌న్ న‌వ ప‌ధ‌కాల‌కు భారీ క‌వ‌రేజ్ ఇచ్చింది. ఈనాడు ప‌త్రిక చూసిన TDP నేత‌ల‌కు షాక్ ఇచ్చింది. ప్ర‌తీ ప‌ధ‌కం గురించి వివ‌రించింది. న‌వ సంక‌ల్పం అంటూ AP ఎడిష‌న్ లో ప్ర‌చురిస్తే..అన్నొస్తున్నాడు..మంచి రోజులొస్తున్నాయి అంటూ…హైదరబాద్ ఎడిషన్ లో జ‌గ‌న్ నినాదానికి ప్రాధాన్యత ఇచ్చింది. YCP ప్లీన‌రీ తొలి రోజున ప్ర‌భుత్వ అవినీతి పై YCP చేసిన ఆరోప‌ణ‌లు..పుస్త‌క విడుద‌ల వార్తను ప్ర‌ముఖంగా ప్ర‌చురించింది. ఇది.. ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ ల్ లో హాట్ టాపిక్ గా మారింది…
 
YCP రెండు రోజుల ప్లీన‌రీ ముగిసింది. చివ‌రి రోజున ముగింపు ప్ర‌సంగంలో జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల ల‌క్ష్యంగా తొమ్మ‌ది ప‌ధకాల‌ను ప్ర‌క‌టించారు. ఈ ప‌ధ‌కాల‌కు YCP నేత‌లు..కార్య‌క‌ర్త‌లు..అభిమానులు ఫ్లాట్ అయ్యారు. సామాన్య  ప్ర‌జ‌ల‌నూ ఇవి ఆకట్టుకున్నాయి. సాక్షి పత్రిక ప్ర‌త్యేకంగా క‌ధ‌నాలు ఇచ్చింది. ఇందులో ప్ర‌త్యేక‌త ఏమీ క‌నిపించ‌దు. కానీ, YCP నేత‌లే ఆశ్చ‌ర్యప‌డేలా..TDP నేత‌లు ఖంగు తినేలా ఈ రోజు జ‌గ‌న్ క‌ధ‌నాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చింది. AP ఎడిష‌న్‌లో..హైద‌రాబా ద్ ఎడిష‌న్‌ లో ప్ర‌ముఖంగా క‌వ‌రేజ్ ఇచ్చింది. సాధార‌ణంగా..ఈనాడు TDP కి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే ముద్ర ఉన్న ప‌రిస్థితుల్లో ..YCP అధినేత జ‌గ‌న్ చేసిన నవ ప‌ధ‌కాల‌కు అంత ప్రాధాన్య‌త ఇవ్వ‌టం పై ఇప్పుడు చ‌ర్చ మొద‌లు అయింది. కొంత కాలంగా ఈనాడు ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు..లోపాల పై పెద్ద ఎత్తున క‌ధ‌నాల‌ను ఇస్తోంది. అదే స‌మ‌యంలో YCP క‌ధ‌నాల‌కు ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇక‌, తాజాగా..TDP పై విజ‌య‌మే ల‌క్ష్యంగా…వ‌చ్చే  సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట్లు కొల్ల‌గొట్ట‌ట‌మే ల‌క్ష్యంగా YCP అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించిన కొత్త ప‌ధ‌కాల‌ను ఇంత పెద్ద ఎత్తున విశ్లేషిస్తూ..క‌వ‌రేజ్ ఇవ్వ‌టం మాత్రం..AP లో స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయ‌నే వాద‌న‌కు కార‌ణ‌మైంది.
ప్ర‌జ‌లకు మేలు చేసే నిర్ణ‌యాల‌నా….
 
TDP ప్ర‌భుత్వానికి ఈనాడు-ఆంధ్ర‌జ్యోతి రెండు ప‌త్రికలు మ‌ద్ద‌తుగా నిలిచే విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ, ఈనాడు లో కొంత కాలంగా మార్పు క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక క‌ధ‌నాల‌ను వ‌రుస‌గా ప్రచురిస్తోంది. దీనికి తోడు YCP పై వ్య‌తిరేక వార్త‌ల‌ను క‌ల్పించి ఎక్క‌డా రాయ‌టం లేదు. ఆంధ్ర‌జ్యోతి ప్ర‌తీ రోజు జ‌గ‌న్ – YCP టార్గెట్ గా క‌ధ‌నాలు ప్ర‌చురించ‌టం..వాటి పై TDP నేత‌లు వెంట‌నే మీడియా ముందుకు వ‌చ్చి..వంత పాడ‌టం సాధార‌ణంగా జ‌రుగుతూ వ‌స్తోంది. ఇదే స‌మ‌యంలో..జ‌గ‌న్-YCP పై ఈనాడు ఆ విధంగా ప్ర‌వ‌ర్తించ‌లేదు. ఇక‌, జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకోవ‌ట‌మే ల‌క్ష్యంగా చేసిన ఎన్నిక‌ల వాగ్దానాల‌కు అంత‌గా ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. AP ప్ర‌ధాన ఎడిష‌న్‌లో దాదాపుగా రెండు పేజీలు కేటాయించ‌టం వెనుక .. ఈ ప‌ధ‌కాలు ప్ర‌జ‌ల‌కు మేలు చేసే నిర్ణ‌యాలు గా భావించింది కాబ‌ట్టే..ఇంత ప్రాధాన్య‌త ఇచ్చార‌నే చ‌ర్చ  జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో..జ‌గ‌న్ దాదాపుగా ఎన్నిక‌ల శంఖారావం పూరించటంతో ఈనాడు ఇంత ప్రాధాన్య‌త ఇచ్చింద‌నే వాద‌న వినిపిస్తోంది.
TDP కి ఈనాడు దెబ్బ‌..
 
ప‌ధ‌కాల‌తో పాటుగా..  చంద్ర‌బాబు పై జ‌గ‌న్‌..ష‌ర్మిల‌..విజ‌యమ్మ చేసిన విమ‌ర్శ‌ల‌కు ప్రాధాన్య‌త ఇచ్చింది ఈనాడు. ఇక‌, కాపుల‌ను సంఘ విద్రోహులుగా చిత్రీక‌రిస్తున్నారంటూ YCP నేత‌లు చేసిన విమ‌ర్శ‌ల‌ను అదే శీర్షిక తో పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో ప్రాధాన్య‌త ఇవ్వ‌టంతో ఒక్క సారిగా అధికార పార్టీ నేత‌లు ఖంగు తిన్నారు. రాజ‌కీయంగా ఎలా ఉన్నా.. TDP కి అనుకూలంగా ఉంద‌నే ముద్ర ఉన్న ఈనాడు లాంటి ప‌త్రిక కాపుల కు మోసం చేస్తున్నారంటూ YCP నేతలు చేసిన విమ‌ర్శ‌ల వార్త‌కు అంత ప్ర‌యార్టీ ఇవ్వ‌టం మాత్రం వారికి మింగుడు ప‌డ‌టం లేదు. ఇది..కాపుల్లో ప్ర‌భుత్వం పై వ్య‌తిరేక‌త పెంచుతుంద‌నే భ‌యం వారిని వెంటాడుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ త‌మ‌కు లేని ఇమేజ్ ను పెంచ‌టానికి ఉపయోగ‌ప‌డుతున్న రెండు ప‌త్రిక‌ల్లో..ఈనాడు కొంత కాలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు పై TDP నేత‌లు బ‌య‌ట ప‌డ‌లేక‌.. లోప‌ల దాచుకోలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
మొత్తంగా..ఈనాడు వైఖ‌రిలో క‌నిపిస్తున్న మార్పు..ఎటువంటి ప‌రిణామాల‌కు కార‌ణం అవుతుందో కానీ..ఇప్పుడు TDP ప్ర‌భుత్వానికి ఉన్న టెన్ష‌న్ల‌కు తోడు .ఇది, జీర్ణించుకోలేని ప‌రిణామంగా మారుతోంది. రానున్న రోజుల్లో ఈనాడు TDP పెద్ద‌ల‌కు ఇంకా ఎన్ని షాక్‌లు ఇస్తుందో చూడాలి…