RajakeeyaaluRajakeeyaalu

Friday, February 23, 2018

ముంద‌స్తు ఎన్నిక‌లకే మొగ్గు…!

  • September 14, 2017 | UPDATED 13:20 IST Views: 10542
  • Share

 

2019లో కాదు..ముంద‌స్తుగానే సార్వ‌త్రిక ఎన్నిక‌లు. స్ప‌ష్ట‌మైన సంకేతాలిచ్చిన ప్ర‌ధాని. లోక్‌స‌భ తో పాటుగానే AP-తెలంగాణ‌ల్లోనూ ముంద‌స్తు ఎన్నిక‌లే. ముంద‌స్తు స‌మాచారం తొలుత YCP కే వ‌చ్చిందంటున్న ఢిల్లీ వ‌ర్గాలు. ఎన్నిక‌ల‌కు సిద్ద మంటున్న AP -తెలంగాణ. ఇప్ప‌టికే APలో వేడి పుట్టిస్తున్న రాజ‌కీయం. ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే TDP-YCP నేత లు. పోటా పోటీ కార్య‌క్ర‌మాలు. BJP తో పొత్తు ఉంటేనే ముంద‌స్తుకు TDP సిద్ద‌ప‌డే అవ‌కాశం. ఎన్నిక‌లకు ఎప్పుడైనా సిద్ద‌మంటున్న YCP. సొంతంగా ఎదుగుతామంటున్న BJP నేత‌ల వ్యాఖ్య‌ల‌తో TDPలో గుబులు. ఇంత‌కీ..ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిగితే AP లో ఏ పార్టీ ప‌రిస్థితి ఏంటి.. ఏం జ‌రిగే అవ‌కాశం ఉంది……..
కొద్ది రోజులుగా ముంద‌స్తు ఎన్నిక‌ల పై APలోని అధికార‌- ప్ర‌తిప‌క్ష నేత‌లు ప్ర‌క‌ట‌న‌లు చేస్తూనే ఉన్నారు. 2018 డిసెంబర్ లోనే సార్వ‌త్రిక ఎన్నిక‌లు జరిగే అవ‌కాశం ఉంద‌ని..సిద్దంగా ఉండాల‌ని చెబుతూ వ‌స్తున్నారు. అయితే, దీని పై ఇప్ప‌టి దాకా స్ప‌ష్ట‌త లేద‌ని భావించారు. కానీ, తాజాగా కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ త‌రువాత జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ దీని పై స్ప‌ష్ట‌త ఇచ్చేసారు. 2018 డిసెంబ‌ర్ లోనే సార్వ‌త్రిక ఎన్నిక‌లు ఉంటాయ‌ని..క్యాబినెట్ మంత్రులంతా దీనికి అనుగుణంగా సిద్ద‌మ‌వ్వాల‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇక‌, ఈ ముంద‌స్తు ఎన్నిక‌ల పై కేంద్ర BJP నాయ‌క‌త్వం ముందు నుండి వ్యూహాత్మ‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. 2014 లో ఉన్న ప‌రిస్థితులు ఇప్పుడు లేవ‌ని..మోదీ వ్య‌క్తిగ‌త ఛ‌రిష్మా ఉన్న స‌మ‌యంలోనే ముంద‌స్తుగా ఎన్నిక‌ల‌కు వెళ్ల‌టం ద్వారా ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని BJP కేంద్ర నాయ‌క‌త్వం ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. ఈ ఏడాది గుజ‌రాత్, వ‌చ్చే ఏడాది అయిదు రాష్ట్రాల్లో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వాటిలో BJP పాలిత రాష్ట్రాలు ఉండ‌టంతో..BJP కేంద్ర నాయ‌కత్వం ముంద‌స్తు చ‌ర్య‌లు ప్రారంభించింది. ముంద‌స్తు ద్వారా రాష్ట్రాల్లో స్థానికంగా ఉండే ప‌రిస్థితులు త‌మ పై వ్య‌తిరేక ప్ర‌భావం చూప‌కుండా మోదీ ఛ‌రిష్మాతో ఎన్నిక‌ల‌కు వెళ్లిన‌ట్లైతే..సానుకూల ఫ‌లితాలు ఉంటాయ‌ని ఆశిస్తున్నారు. అందులో భాగంగానే..
ఈ ఏడాది మే 10వ తేదీన ప్ర‌ధాని మోదీ తో YCP అధినేత జ‌గ‌న్ స‌మావేశ‌మైన స‌మ‌యంలో దీనికి సంబంధించి చ‌ర్చకు వ‌చ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మా చారం. ఆ త‌రువాత తెలంగాణ ముఖ్య‌మంత్రి KCR తోనూ ప్ర‌ధాని దీని పై చర్చించిన‌ట్లు తెలుస్తోంది.
ఇక‌, 2018 లోనే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు APలో TDP – YCP సిద్ద‌మ‌ని చెబుతున్నాయి. అయితే, TDP మాత్రం త‌మ పై ఉన్న ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కార‌ణంగా కొంత ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. BJPతో పొత్తు పైనా క్లారిటీ లేక‌పోవటంతో..ఏం చేయాల‌నే దాని పై పార్టీ అధినాయ‌క‌త్వం శిబిరంలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. BJPతో పొత్తు ఉంటే ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లినా..కొంత మేర న‌ష్ట నివార‌ణ జ‌రుగుతుంద‌ని అంచ‌నా వేస్తోంది. ఒక వేళ BJP తో పొత్తు లేకుండా ముంద‌స్తుకు వెళ్లితే ఏం జ‌రిగే అవ‌కాశం ఉంద‌నే దాని పైనా చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకొనేందుకు TDP అనేక కొత్త వ‌రాలు..ఇంటింటికి TDP వంటి వాటికి ప్రాధాన్య‌త ఇస్తోంది. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తే..త‌మ‌కు రాజ‌కీయంగా మ‌రింత న‌ష్టం క‌లుగుతుంద‌నే భావ‌న వారిలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇక‌, ప్ర‌తిప‌క్ష YCP మాత్రం ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా సిద్ద‌మ‌ని చెబుతోంది. ఇప్ప‌టికే “YSR కుటుంబం” ద్వారా..కోటి మందిని పార్టీలోకి చేర్చుకోవాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్నారు. ఇక‌, అక్టోబ‌ర్ లో YCP అధినేత జ‌గ‌న్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశాలు..అక్టోబ‌ర్ 27 నుండి జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సిద్ద‌మ‌వుతున్నారు. ఆరు నెలల పాటు జ‌గ‌న్ జ‌నంలోనే ఉండ‌నున్నారు. అంటే దాదాపుగా 2018 మే వ‌ర‌కు జ‌గ‌న్ యాత్ర సాగ‌నుంది. దీని త‌రువాత ఎన్నిక‌ల షెడ్యూల్ కు అనుగుణంగా..కొత్త వ్యూహాల‌తో అభ్య‌ర్ధుల ఖ‌రారు..ప్ర‌చారానికి YCP సిద్దం అవ్వాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించింది.
ఇక‌, ఏకంగా కేంద్ర క్యాబినెట్ లోనే ముందస్తు ఎన్నిక‌ల సంకేతాలు రావ‌టంతో..ఇప్పుడు APలో రాజ‌కీయం మ‌రింత రంజు గా మార‌నుంది..