RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

ప‌త్రిక‌లు చెప్ప‌ని నిజాలు(06-03-2018)

  • March 6, 2018 | UPDATED 15:11 IST Views: 453
  • Share

 

బాబు రాజ‌కీయ అవ‌స‌రాలకు త‌గిన‌ట్లుగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగ‌మా?

 

తాను ఎన్నిక‌ల‌ప్పుడే రాజ‌కీయాలు చేస్తాను. మిగిలిన టైంలో మాత్రం అభివృద్దే నా ప్రాధాన‌త్య అంటూ AP CM చంద్ర‌బాబు నాయుడు 1999లో తిరిగి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌దే ప‌దే చెబుతూ వ‌చ్చాడు. కానీ ఇప్పుడు అది పూర్తిగా రివ‌ర్స్ అయింది. 2014లో BJPతో పొత్తులో అధికారంలో వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కు కూడా రాజ‌కీయం చేయ‌ని రోజు లేదు. అభివృద్ది. పాల‌న తీరు ఎలా ఉన్నా, చంద్ర‌బాబు నాయుడు త‌న రాజ‌కీయ అవ‌స‌రాల‌కు అనుగుణంగానే అడుగులు వేస్తున్నాడ‌ని చెప్ప‌టానికి తాజాగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగ‌మే ఉదాహ‌ర‌ణ‌. AP అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ చేసిన ప్ర‌సంగం పూర్తి రాజ‌కీమ‌యంగా తీర్చిదిద్దారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం అంటే ప్ర‌భుత్వం ప‌థ‌కాలు. సంక్షేమ‌. అభివృద్దికి సంబందించిన ప్ర‌ణాళిక‌లు. ప్ర‌భుత్వం సాధించిన ప్ర‌గ‌తి. చేప‌ట్ట‌బోయే ప‌నుల‌కు సంబంధించిన విష‌యాలు ఉంటాయ‌ని అందరూ భావిస్తూ వ‌చ్చారు. కానీ APలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగ పాఠం వింటే మాత్రం పూర్తి రాజ‌కీయ మ‌యం అయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌త ఏడాది గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి. ఏ ఏడాది గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ఒకే విష‌యంలో చాలా తేడా క‌న్పిస్తోంది. గ‌త ఏడాది ప్యాకేజీని కీర్తిస్తే. ఇప్పుడు మ‌ళ్లీ హోదా కావాల‌ని గ‌వ‌ర్న‌ర్ త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం అంటే ప్ర‌భుత్వం స‌మ‌కూర్చే ప్ర‌సంగ పాఠ‌మ‌నే విష‌యాన్ని మ‌నం మ‌ర్చిపోకూడ‌దు. చంద్ర‌బాబు నాయుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ప‌రిశీలిద్దాం.

హోదాపై రెండు ద‌ఫాలు అసెంబ్లీ ఏక‌గ్రీవ తీర్మానం

AP రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో APకి ప్ర‌త్యేక హోదా , పోల‌వ‌రం ప్రాజెక్టులు ఇవ్వ‌టానికి కేంద్రం అంగీక‌రించింది. కానీ BJP .TDPలు కేంద్రంలోనూ. రాష్ట్రంలోనూ ప్ర‌భుత్వంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీన్ రివ‌ర్స్ అయింది. ఇద్ద‌రి మ‌ధ్య ఏం ఒప్పందం కుదిరిందో తెలియ‌దు కానీ AP ప్ర‌త్యేక హోదాకు ఎస‌రు పెట్టారు. దాని స్ధానంలో ప్ర‌త్యేక ప్యాకేజీని రంగంలోకి తెచ్చారు. చంద్ర‌బాబు నాయుడు ఈ ప్యాకేజీని ఆగ‌మేఘాల మీద స్వాగ‌తించారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మాత్రం స్పెష‌ల్ ప్యాకేజీ అనేది బోగ‌స్ అని వ్యాఖ్యానించారు. ప్యాకేజీలో APకి మేలు చేసే అంశాలే ఏమీ ప్ర‌త్యేకంగా ఏమీ లేవ‌ని. హోదాను ఇవ్వ‌ల్సిందేన‌ని ఆయ‌న ఖ‌రాకండిగా చెప్పారు. అయితే APకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని అసెంబ్లీ రెండు ద‌ఫాలుగా ఏక‌గ్రీవ తీర్మానం చేసిన నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు ప్యాకేజీని స్వాగతించిన విష‌యాన్ని గ‌మ‌నించాలి. AP అసెంబ్లీలో హోదా కోసం తీర్మానం చేయించిన చంద్ర‌బాబు నాయుడు ప్యాకేజీని ఎలా స్వాగ‌తించారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త ఆయ‌న‌పై ఉంది.

హోదాపై బాబు వ్య‌వ‌హార తీరు

AP CM చంద్ర‌బాబు నాయుడు హోదాపై మొద‌టి నుంచి క‌ప్ప‌దాటు వ్య‌వ‌హార‌మే చేస్తున్నారు. ఎన్నిక‌ల ముందు ఒక తీరుగానూ. ఆ త‌ర్వాత మ‌రో తీరుగానూ వ్య‌వ‌హారిస్తూ వ‌స్తున్నారు. హోదా 15 ఏళ్లు కావాల‌ని కోరిన ఆ నోటి తోనే హోదా వ‌స్తే ఏం వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు నాయుడు ప్రశ్నించారంటేనే ఆయ‌న నైజం ఏమిటో అర్దం చేసుకోవ‌చ్చు. అంతే కాకుండా APకి ప్ర‌త్యేక హోదా కోసం APలో జ‌రుగుతున్న ఉద్య‌మాల ప‌ట్ల క‌ఠిన వైఖ‌రి తీసుకున్నారు. హోదా అంటే జైలే అన్నారు. విద్యార్దుల త‌ల్లిదండ్రుల‌ను బెదిరించారు. పీడియాక్ట్ పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు. బంద్ చేప‌డుతున్న వామ‌ప‌క్ష విద్యార్ది సంఘాల నేత‌ల‌పై TDP గూండాలు దాడులు చేయించిన ప‌రిస్థితి మ‌నం చూశాం. కేంద్రంలో BJP నేత‌లు కానీ, మంత్రులు కానీ హోదాను ఏనాడు వ్య‌తిరేకిస్తూ మాట్లాడిన దాఖ‌ల‌లు లేవు. కానీ చంద్ర‌బాబు నాయుడు హోదాను వ్య‌తిరేకించ‌ట‌మే కాకుండా దాని కోసం ఉద్య‌మిస్తున్న వారిపై కూడా దుర్మార్గ‌మైన ప్ర‌చారం చేయించారు. త‌న చెప్పుచేత‌ల్లో ఉండే మీడియాను వాడుకుని హోదా కంటే ప్యాకేజీయే గొప్ప‌ద‌న్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇచ్చారు. పూట‌కో మాట మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడు ఎంత అవ‌కాశ వాదంగా మాట్లాడ‌గ‌ల‌రో స్ప‌ష్టం చేసే విధంగా ఆయ‌న వ్య‌వ‌హారిస్తూ వ‌చ్చారు.

కేంద్రంలో పార్ట‌న‌ర్‌గా ఉంటూ TDP డ్రామాలేస్తే ఎలా?

కేంద్రంలోనూ. రాష్ట్రంలోనూ BJP. TDPలు క‌లిసి ప్ర‌భుత్వాల‌ను న‌డుపుతున్నాయి. అయినా రాష్ట్రంలో BJP చంద్ర‌బాబు నాయుడ్ని, ఆయ‌న ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌డుతూ బ‌హిరంగంగానే వ్యాఖ్య‌లు, విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అవ‌స‌రం అయితే ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌స్తామ‌ని కూడా హెచ్చ‌రిస్తున్నారు. కేంద్రంలో భాగ‌స్వామిగా ఉన్న TDP కూడా ఇదే తంతు. ప్ల‌కార్డులు ప‌ట్టుకుని డ్రామాలు ఆడుతున్నారు. TDP. BJP వేషాలు చూస్తుంటే అస‌హ్యం వేస్తోంది. కేంద్రంలోని BJP నాయ‌క‌త్వంలోని మోదీ స‌ర్కార్ APకి అన్యాయం చేస్తోంద‌ని భావిస్తే కేంద్రంలో TDP ఎలా కొనసాగుతుంది? TDP చెప్పిందే నిజం అయితే బ‌య‌ట‌కు రావాలి. లేదా కొన‌సాగుతుందంటే TDP చెబుతున్న‌వి అబ‌ద్దాలైనా అయి ఉండాలి. అలా కాకుండా ప్ర‌జ‌లను గంద‌ర‌గోళ ప‌ర్చ‌టానికికో., లేదా ప్ర‌తిప‌క్షం హోదా కోసం పోరాడుతుంది కాబ‌ట్టి దానికి మైలేజీ రాకుండా చేయ‌టం కోస‌మే ఏదో పోరాడుతున్న‌ట్లుగా న‌టిస్తే ప్ర‌జ‌లు మెచ్చుకోరు. పైగా అస‌హ్యించుకుంటారు. TDP గ‌త నాలుగేళ్లుగా ఏం చేస్తూ వ‌చ్చిందో అంద‌రూ గ్ర‌హిస్తూనే ఉన్నారు. పాల‌నా ప‌రంగా. AP ప్ర‌త్యేక హోదా విష‌యంలో త‌దిత‌ర అంశాల‌పై TDP వ్య‌వ‌హారం తెల్సిందే. ఇప్పుడు అధికారంలో ఉంటూ డ్రామాలేస్తే ప్ర‌జ‌లు చూస్తూ ఊరుకుంటార‌నుకోవ‌టం తెలివి త‌క్కువ త‌న‌మే అవుతుంది.

హొదా కోసం పోరాడే వాడిగా ప‌వ‌న్ బిల్డ‌ప్‌. ప్యాకేజీకోసం బాబుతో రాజీ?

గ‌త ఎన్నిక‌ల్లో BJP. TDPకి మ‌ద్ద‌తు ప‌లికిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల త‌ర్వాత చాలా కాలం కామ్ అయిపోయారు. ఆ త‌ర్వాత స‌డ‌న్‌గా తెర పైకి వ‌చ్చి హోదా కోసం పోరాటం అని బిల్డ‌ప్ ఇచ్చారు. తిరుప‌తి,లో మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో హోదా కోసం స‌భ‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. కాకినాడ‌లో స‌భ‌తో ముంగించేసే. మాట తిప్పేశారు. ఆ త‌ర్వాత ఉలుకు. లేదు .ప‌లుకు లేదు. మ‌ళ్లీ తీరుబ‌డిగా వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పూర్తి రాజ‌కీయాలు చేస్తాన‌న్నాడు. చిత్త‌శుద్ది ఉంటే మోదీపై అవిశ్వాసం పెట్టాల‌ని. TDP. వైసీపీకి స‌వాల్ విసిరారు. వైసీపీ ముందుకు వ‌స్తే, దానికి మ‌ద్ద‌తుగా రోడ్ల‌పైకి వ‌స్తామ‌న్నారు. కానీ వైసీపీ పోరాడుతుంటే ఫామ్ హౌజ్‌లో కూర్చోని ఉద్య‌మంపై రాళ్లేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. చంద్ర‌బాబు నాయుడుకు సేవ చేసే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టి కొత్త నాట‌కాల‌కు తెర తీశారు.

హోదాపై రాజీలేని పోరు స‌ల్పించి జ‌గ‌నే

AP ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ AP ప్ర‌త్యేక హోదాపై మ‌డ‌క తిప్ప‌ని వీరుడిలా పోరాడుతున్నాడు. దీక్ష‌లు. ధ‌ర్నాలు. యువ‌భేరీలో ఢిల్లీ న‌డివీధుల్లో ఆంధోళ‌న‌లు ఇలా ఒక‌టేమిటి? ఎన్ని ర‌కాల పోరాటాలు చేయాలో అన్ని చేశాడు. చివ‌రికి మిత్ర‌ప‌క్షాలు చేప‌ట్టే ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. సొంతంగా కూడా ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితమే చెప్పిన‌ట్లుగా హోదా కోసం ఎంపీల‌తో రాజీనామాలు చేయిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ నెల 21వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టాల‌ని కూడా తీర్మానించుకున్నారు. ఇలా AP ప్ర‌త్యేక హోదా కోసం ని ర్వీరామంగా పోరాడుతుంటే TDP హోదా పోరాటానికి నైతిక మ‌ద్ద‌తు ఇవ్వ‌పోగా ఉద్య‌మాన్ని చుల‌క‌న చేసే కుట్ర‌లు సాగిస్తున్నారు. లేని పోని నింద‌లు వేస్తే జ‌గ‌న్ని నింద‌లు వేసే పేరుతో APకి ద్రోహం త‌ల పెడుతున్నారు. చంద్ర‌బాబుకు, ప‌వ‌న్ కు నిజాయితీ, చిత్త‌శుద్ది ఏమాత్రం ఉన్నా, జ‌గ‌న్‌కు అండ‌గా నిల‌వాలి. జ‌గ‌న్ పోరాటంలో భాగ‌స్వామ్యం కావాలి. కానీ ప‌వ‌న్ గానీ, చంద్ర‌బాబు గానీ అందుకు సిద్దంగా లేరు. అంటేనే వాళ్లు APప‌ట్ల చిత్త‌శుద్దితో లేర‌నే విష‌యాన్ని అర్దం చేసుకోవ‌చ్చు.అయినా జ‌గ‌న్ చేప‌ట్టిన పోరాటానికి మాత్రం ప్ర‌జ‌లు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఇదే మ‌ద్ద‌తు ఎన్నిక‌ల్లో కూడా ల‌భిస్తే జ‌గ‌న్ విజ‌యాన్ని ఎవ‌రూ ఆప‌లేర‌ని చెప్ప‌టానికి సందేహించ‌న‌క్క‌ర‌లేదు.