August 19, 2018
info@rajakeeyaalu.com

చదివిన వారి సంఖ్య

 

Breaking News

|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
2187

బ్యాంకాక్ విమానం వస్తుందా లేదా...

Written by  Jul 07, 2018
  • 71 Views

 

 

బ్యాంకాక్ విమానం వస్తుందా లేదా...

విజయవాడకే తరలిపోతుందా...

కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి చేసిందేమిటి..?

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం నుంచి బ్యాంకాక్ కు ప్రత్యేక విమానం నడపాలన్నది ఎప్పటినుంచో ఉన్న ప్రతిపాదన. దీనికోసం నాక్ ఏవియేషన్ సంస్థ ముందుకొచ్చి.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు ప్రతిపాదన కూడా పంపింది ఈ సంస్థ. అయితే నౌకాదళం ఆధీనంలో ఉన్న విమానాశ్రయం కావడంతో...ఆంక్షలు విధించింది. నౌకాదళ విభాగం ఆంక్షల్ని సడలించేలా ఇదే ప్రాంతానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే ఫలితం ఉండేది. ఆంక్షల నేపధ్యంలో నాక్ ఏవియేషన్ సంస్థ పునరాలోచలో పడింది.

ఇదే సందర్భంలో విజయవాడ నుంచి నడిపితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది ఆ సంస్థకు. విజయవాడ, విశాఖల్లో ఎక్కడి నుంచి నడిపితే ప్రయోజనముంటుందోనని అంచనాలు వేస్తోంది నాక్ సంస్థ. ఈ నేపధ్యంలోనే 11 వ తేదీన సంస్థ ప్రతినిధులు నగరానికి రానున్నారు. పారిశ్రామికవేత్తలు, పర్యాటక ఆపరేటర్లతో చర్చించి అభిప్రాయాల్ని సేకరించనున్నారు.

వాస్తవానికి ఆగస్టు నుంచి వారానికి రెండుసార్లయినా విశాఖ-బ్యాంకాక్ ల మధ్య విమానం నడపాలన్నది సంస్థ ఆలోచన.  విశాఖనే మేలనేది సంస్థ అభిప్రాయం కూడా. నౌకాదళ ఆంక్షలే ఆ సంస్థను పునరాలోచించేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రయాణీకులు విశాక నుంచి బ్యాంకాక్ కు వెళ్లాలంటే... కొలంబో, సింగపూర్, కౌలాలంపూర్ మీదుగా వెళ్లాల్సివస్తోంది. దీనివల్ల ప్రయాణీకులకు అదనపు సమయంతో పాటు...ఎక్కువ ఖర్చు వెచ్చించాల్సి వస్తోంది. నేరుగా బ్యాంకాక్ కు వెళ్లే వీలుంటే కేవలం 12 వేలలోపే ధర ఉంటుందనేది అంచనా.

మంత్రిగా ఉన్నప్పుడే ఏం చేయలేని వ్యక్తి ...ఇప్పుడు ఏం చేస్తారనే విమర్శలు విశాఖవాసుల నుంచి వ్యక్తమవుతున్నాయి...

Last modified on Saturday, 07 July 2018 04:52

Google Ad

Subscribe