August 19, 2018
info@rajakeeyaalu.com

చదివిన వారి సంఖ్య

 

Breaking News

|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
2184

పవన్ కు సాయం చేయమని బెదిరిస్తున్నారు

Written by  Jul 06, 2018
  • 86 Views

పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ ఈసారి ఓపెన్ అయిపోయింది. పవన్ ఫ్యాన్స్ తన విషయంలో చూపిస్తోన్న చిరాకు ఆమెకు చిరాకు తెప్పించింది.అందుకే ఐదేళ్ల నుంచి తాను అన్నీ భరిస్తున్నానని ఇకపై భరించేది లేదని తేల్చేసింది.ఐదేళ్ల నుంచి ప్రశాంతంగా బతుకుదామని చూస్తుంటే తన ప్రశాంతను భగ్నం చేస్తున్నారని ఇలా అయితే ఇకపై ఊరుకునేది లేదని చెప్పింది రేణాదేశాయ్ .

తాజాగా రేణుదేశాయ్ పవన్ అభిమానులపై ఇలా స్పందించింది. "నా జీవితం ప్రశాంతంగా ఉండడానికి కేవలం ఇన్‌స్టాగ్రామ్‌నే వాడాలని అనుకున్నాను. కానీ జీవితంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. గత ఐదేళ్లుగా నన్ను అనరాని మాటలు అంటూ నేను చేయని తప్పులకు నిందిస్తున్నవారి గురించి పట్టించుకోవద్దని కొందరు నాకు సలహా ఇచ్చారు. నా ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి నా కోసం నేను మాట్లాడుతుంటే అన్నీ మౌనంగా భరించాలని చెప్పారు. పాపులారిటీ కోసమే ఇదంతా చేస్తున్నానని మరికొందరు అన్నారు. ఇప్పుడేమో ఓ నీచుడు పవన్‌ ఫోటోలను సోషల్‌మీడియాలో పెడుతూ నెగిటివ్‌ కామెంట్లు చేస్తున్నాడు.

దాంతో నా ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌బాక్స్‌ మెసేజ్‌లతో నిండిపోయింది. కొందరేమో పవన్‌ కల్యాణ్‌ను సపోర్ట్ చేయాలని మర్యాదపూర్వకంగా అడుగుతుంటే మరికొందరు బెదిరిస్తున్నారు. ఆయనకొక రూల్‌, నాకొక రూలా? గత ఐదేళ్లుగా కొందరు నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నప్పుడు నా ఆత్మాభిమానం మీకు ముఖ్యం అనిపించలేదా? నోరుమూసుకుని అన్నీ భరించమని నాకు సలహాలు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు పవన్‌ పేరుకు మచ్చ వస్తుందని నన్ను స్పందించమని అడుగుతున్నారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ఈ సమాజంలో ఉంటున్నందుకు చాలా బాధగా ఉంది. ఏదో ఒక రోజు నాకంటూ మనశ్శాంతి దొరుకుతుందని ఆశిస్తున్నాను. మరో విషయం గుర్తుపెట్టుకోండి. నేనెప్పుడూ పవన్‌ గురించి తప్పుగా మాట్లాడను. అలా మాట్లాడమని నన్ను కానీ నా పిల్లలను కానీ ఏ రాజకీయ పార్టీ ప్రేరేపించలేదు’ అని పేర్కొన్నారు రేణుదేశాయ్ .

Last modified on Friday, 06 July 2018 17:28

Google Ad

Subscribe