August 19, 2018
info@rajakeeyaalu.com

చదివిన వారి సంఖ్య

 

Breaking News

|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
2039

పుల్లారావు సీటు కు ఎర్త్‌...!!

Written by  Jun 12, 2018
  • 1015 Views

 

 

మంత్రి పుల్లారావు సీటు కు ఎర్త్‌... టిడిపి లో క‌దులుతున్న పావులు... చిల‌క‌లూరి పేట సీటుకు పెరుగుతున్న రేటు.... సీటు మా రిస్తే..ఏ నిర్ణ‌యానికైనా సిద్ద‌మంటున్న పుల్లారావు. ...గుంటూరు జిల్లా టిడిపి లో కొత్త క‌ల‌క‌లం.... మంత్రి పుల్లారావు ఇలాకాలో ఆయ‌న‌కే ఎర్త్ పెట్ట‌డానికి వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. గుంటూరు జిల్లా టిడిపి అధ్య‌క్షుడిగానే కాకుండా ఆర్దికంగా పార్టీకి అండ‌గా నిలిచే వ్య‌క్తి ప్ర‌త్తిపాటి అని ఆయ‌న స‌న్నిహితులు చెబుతూ ఉంటారు. చిల‌క‌లూరి పేట నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి..ఒక సారి ఓడిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో గెలిచి అప్ప‌టి నుండి మంత్రిగా కొన‌సాగుతున్నారు.

మం త్రిగా ప్ర‌త్తిపాటి పుల్లారావు పై అనేక ఆరోప‌ణ‌లు..విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. రాజ‌ధాని భూముల కొనుగోలు వ్య‌వ‌హారంలోనూ ఆ రోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యులు పాల‌న‌లో జోక్యం చేసుకోవ‌టం పైనా విమర్శ‌లు ఉన్నాయి. ఇక‌, జిల్లాలో టిడిపిలో అంత‌ర్గ‌తంగా ఉన్న గ్రూపు రాజ‌కీయాల‌ను ఎదుర్కొంటూ ప్ర‌త్తిపాటి త‌న మంత్రి ప‌ద‌విని కాపాడుకుం టూ వస్తున్నారు. అటువంటి ప్ర‌త్తిపాటి పుల్లారావుకు కంచుకోట‌గా మారిన చిల‌క‌లూరిపేట నుండి ప‌క్క‌కు త‌ప్పించేందుకు అడుగులు ప‌డుతున్నాయి.

చిల‌క‌లూరి పేట లో ప్ర‌స్తుతానికి పుల్లారావు కు అడ్డు లేదు. పుల్లారావు శైలి పై వ్య‌తిరేక‌త ఉన్నా..ఇప్ప‌టి వ‌ర‌కూ టిడిపి నుండి ఆ సీటు ఆశిస్తున్న వారు రేసులో లేర‌నే ధీమాతో ఉన్నారు. అయితే, కొద్ది రోజులుగా సీన్ మారిపోయింది. అక్క‌డి నుండి తెలుగు దేశం సీటు కోసం ఓ మ‌హిళా నేత లాబీయింగ్ మొద‌లు పెట్టారు. ఆ మ‌హిళా చిల‌క‌లూరిపేట సీటు కోసం చిన‌బాబు వ‌ద్ద ఓ ప్ర‌తిపాద‌న తీసుకొచ్చిన‌ట్లు జిల్లా టిడిపి వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. మంత్రిగా ఉన్న పుల్లారావును ఏలూరు లోక్‌స‌భ‌కు పోటీ చేయించాల‌ని..త‌న‌కు చిల‌క‌లూరిపేట సీటు ఇప్పించాల‌ని ఆ మ‌హిళా నేత చిన‌బాబు వ‌ద్ద చేసిన ప్ర‌తిపాద‌న‌. ఇందుకోసం భారీగా పార్టీ ఫండ్ తో పాటుగా ఎన్నిక‌ల ఖ‌ర్చులకు ముందుకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈ స‌మాచారం తెలుసుకున్న పుల్లారావు షాక్ అయ్యారు. వెంట‌నే పార్టీలో త‌న భ‌విష్య‌త్ ఏంట‌నే అంశం పై దృష్టి సారిం చారు. వెంట‌నే త‌న ప్ర‌తిపాద‌న‌ను సైతం పార్టీ అధినాయ‌క‌త్వం ముందుంచారు. తన‌ను అసెంబ్లీకే కొన‌సాగించాల‌ని అభ్య‌ర్ధించారు. త‌న‌ను లోక్ స‌భ‌కు పోటీ చేయించాల‌నేది పార్టీ నిర్ణ‌య‌మైతే తాను సిద్ద‌మే కానీ, చిల‌క‌లూరి పేట సీటు మాత్రం త‌న వారికే ఇవ్వాల‌ని ష‌ర‌తు పెట్టారు. త‌న భార్య‌కు చిల‌క‌లూరి పేట అసెంబ్లీ సీటు ఇవ్వాల‌ని ప్ర‌తిపాదించారు. దీని పై హైక‌మాండ్ నుండి ఎటువంటి హామీ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేద‌ని స‌మాచారం. దీంతో..పుల్లారావు అనుచ‌రులు ఆలోచ న‌లో ప‌డ్డారు. పుల్లారావుకు చిల‌క‌లూరి పేట నుండి త‌ప్పిస్తే ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌నే చ‌ర్చ ఇప్ప‌టికే వారిలో ప్రారంభ మైంది. అయితే, పుల్లారావు మాత్రం ఏది ఏమైనా చిల‌కలూరి పేట సీటు వ‌దిలేది లేద‌ని తేల్చి చెబుతున్నారు. హైక‌మాండ్ పుల్లారావు ను మార్చాల‌నే నిర్ణ‌యానికి వస్తే పుల్లారావు రాజ‌కీయంగా ఎటువంటి నిర్ణ‌యం తీసుకున్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అయ‌న అనుచ‌రులు స్పష్టం చేస్తున్నారు. దీంతో..మంత్రిగా ఉన్న పుల్లారావు సీటు వ్య‌వ‌హారం ఇప్పుడు గుంటూరు జిల్లా టిడిపిలో హాట్ టాపిక్ గా మారింది.

Google Ad

Subscribe