August 19, 2018
info@rajakeeyaalu.com

చదివిన వారి సంఖ్య

 

Breaking News

|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
2186

మంత్రి గంటాను టార్గెట్ చేసిన పవన్

Written by  Jul 07, 2018
  • 92 Views

మంత్రి గంటాను టార్గెట్ చేసిన జనసేన అధినేత పవన్

భూ కబ్జాలకు బాధ్యుడతడే--పవన్

మద్దతిచ్చినందుకు బాధపడుతున్నా--పవన్

కాపు రిజర్వేషన్లపై నాటకాలొద్దు...పవన్

 

విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ టార్గెట్ మారింది. జిల్లాలో తన పర్యటనలో మంత్రి గంటా శ్రీనివాసరావు పై ఇప్పటివరకూ పెద్దగా ఆరోపణలు సంధించలేదు. ఇప్పుడు తగరపు వలస పర్యటనలో స్వరం మార్చారు. మంత్రి గంటాను బాధ్యుడిగా చేస్తూ విమర్శలు చేశారు. జిల్లాలో భీమిలి సహా...ఇతర భూ కుంభకోణాలకు మంత్రి గంటానే బాధ్యత వహించాలంటూ పవన్ చెప్పడం సంచలనమైంది. తగరపువలస అంబేత్కర్ కూడలిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు...ఆకృత్యాలపై టీడీపీ నేతల వైఖరి వెల్లడవుతోందని పవన్ దుయ్యబట్టారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి ఉద్యమం

ఇఛ్చాపురం నుంచి భీమిలి వరకూ ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలపై పోరాడటానికే తాను గంగమ్మ స్నానం చేసి..పోరాటయాత్రను తలపెట్టానని పవన్ చెప్పారు. విశాఖ రైల్వేజోన్ పై టీడీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని..దీక్ష అంటే 5 కిలోల బరువు తగ్గడానికేేనంటూ వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర ప్రజల్ని అవమానించడమేనన్నారు. కాపు రిజర్వేషన్ల అంశంపై నాటకాలు మాని...తన వైఖరి స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు పవన్.

ముందే తెలిసుంటే గంటాకు మద్దతు ఇచ్చేవాడిని కాదు...

గత ఎన్నికల సమయంలో టీడీపీ నేతలకు...ముఖ్యంగా గంటాకు మద్దతిచ్చి ప్రచారం చేయడంపై బాధ పడుతున్నానన్నారు పవన్. చిట్టివలస జూట్ మిల్లులో పర్యటించిన పవన్..అనంతరం కార్మిక సంఘాలు...కుటుంబాలతో సమావేశమయ్యారు. గత ఎన్నికల సమయంలో ఈ మిల్లు సమస్య తెలియకపోవడంతోనే మంత్రి గంటాకు మద్దతిచ్చానన్నారు.

Last modified on Saturday, 07 July 2018 02:12

Google Ad

Subscribe