RajakeeyaaluRajakeeyaalu

Monday, December 11, 2017

నంద్యాల‌లో గెలుపెవ‌రిదో తేల్చేసారు…!!

  • August 23, 2017 | UPDATED 19:09 IST Views: 28788
  • Share

 

కొత్త చ‌రిత్ర‌కు నాంది. 2019 సంగ్రామంలో YCP తొలి మెట్టు. రికార్డు స్థాయి ఓటింగ్ లో చ‌రిత్ర సృష్టించే విజయం దిశ‌గా YCP. తెలుగు ఛాన‌ళ్ల స‌ర్వేలో నంద్యాల ఓట‌ర్లు YCP అభ్య‌ర్ధికే ప‌ట్టం అని తేల్చేసారు. TDP కి అనుకూలంగా వ్య‌వ‌హరించే మీడియా సంస్థ‌లు స‌ర్వేలు చేసి..వాస్త‌వం తెలిసి చివ‌రికి ప్ర‌సారాలు మానుకున్నారు. ఇక‌, తెలుగు TV ఛాన‌ల్ పోలింగ్ స‌మ‌యంలో చేసిన స‌ర్వేల‌లో నంద్యాల వాసులు YCP కే ప‌ట్టం క‌ట్టిన‌ట్లు తేల్చారు. అది కూడా మామూలు విక్ట‌రీ కాదు..ఒక‌సైడెడ్ విక్ట‌రీ…ఇంత‌కీ వారు స‌ర్వేలు తేల్చిదేంటి…
అధికార పార్టీ ఎత్తులు..వ్యూహాలు..ప్ర‌లోభాలు..అస‌త్య ప్ర‌చారాలు..అన్నింటికి ఒకటే ఒక్క స‌మాధానం. EVM ల‌తో సెలెంట్ గా త‌మ ప‌ని తాము పూర్తి చేసారు నంద్యాల వాసులు. YCP అధినేత పిలుపునిచ్చిన‌ట్లుగా ధ‌ర్మ‌యుద్దంలో తొలి అగుడు నంద్యాల నుండే ప‌డ‌నుంది. నంద్యాల వాసులే ఈ ధ‌ర్మ యుద్దంలో ముందుండి న‌డిపించారు. చ‌రిత్రలో ఏనాడు  లేని విధంగా..రికార్డు స్థాయిలో 80 శాతానికి పైగా ఓటింగ్ న‌మోదైంది. ఉద‌యం ఏడు గంట‌ల నుండే ఇవియం లు ఫ్యాన్ మీట తో హోరెత్తాయి, ఉద‌యం నుండి భారీ సంఖ్య‌లో వ‌చ్చిన మ‌హిళ‌లు YCP కే ప‌ట్టం క‌ట్టిన‌ట్లు HMTV చేసిన స‌ర్వేలో తేలింది. అధికార ప‌క్షం పై ప్ర‌జ‌లు ఎంత అసంతృప్తితో ఉన్నారో ఈ స‌ర్వే వివ‌రాల్లో తేల్చి చెప్పింది. ప్ర‌చారం మాత్ర‌మే హోరా హోరీగా సాగింది….ఫ‌లితం మాత్రం ఒన్ సైడ్ అని తేల్చేసింది.
తెలుగు వార్తా ఛాన‌ల్ నంద్యాల పోలింగ్ త‌రువాత స‌ర్వే వివ‌రాల‌ను బ‌హిర్గ‌తం చేసింది. ఉదయం నుండి సాగిన పోలంగ్ దాదాపు ఏక ప‌క్షంగా సాగిన‌ట్లు ఆ TV ఛాన‌ల్ స‌ర్వేలో తేల్చింది. ఆ TV ఛాన‌ల్ తేల్చిన స‌ర్వే లెక్క‌ల ప్ర‌కారం ప్ర‌తిప‌క్ష YCP కి 68 శాతం అనుకూల ఓటింగ్ రాగా..అధికార పక్ష TDPకి కేవ‌లం 32 శాతం మాత్రమే అనుకూలంగా ప‌డిన‌ట్లు తే ల్చారు. ప్ర‌తిప‌క్ష నేత ప్ర‌జ‌ల్లో వివ‌రించిన చెప్పిన ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు ఓట‌ర్ల పై ప్ర‌భుత్వ వ్య‌తిరేక తీర్పుకు దోహ‌దం చేసాయి. ఇక‌, చంద్ర‌బాబు మాట పై ఏ మాత్రం న‌మ్మ‌కం లేద‌నే విధంగా..ఆ చాన‌ల్ స‌ర్వేలో తేలిన‌ట్లు లెక్క‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఇక‌, ఇత‌ర చాన‌ళ్లు…ఒపినియ‌న్ పోల్ తో చేసిన స‌ర్వేలు ఎంత దురుద్దేశ‌పూర్వ‌కంగా ప్ర‌సారం చేసాయో ఈ నాటి పోలంగ్ చూస్తే అర్దం అవుతోంది. ఓట‌ర్ల‌లో ప్ర‌భుత్వం పై వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపించిన‌ట్లు ఈ స‌ర్వేలో తేలింది. ఇక‌.. అధికారికంగా ఫ‌లితాలు 28 నాడు రానున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. ఉద‌యం నుండి సాగుతున్న పోలింగ్ స‌ర‌ళి..YCP కే ఓట‌ర్లు మొగ్గు చూపుతున్నార‌నేది స్ప‌ష్ట‌మైంద‌ని ఈ స‌ర్వే తేల్చింది.