RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

YCP అభ్య‌ర్ధుల ముంద‌స్తు ఖ‌రారు …!

  • March 6, 2018 | UPDATED 18:50 IST Views: 1580
  • Share

 

వ‌చ్చే ఎన్నిక‌ల కోసం YCP అధినేత దూకుడు గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అవ‌స‌రం అనుకున్న ప్రాంతాల్లో అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. ఎన్నిక‌ల నాటికి ఎటువంటి అయోమ‌యం నియోజ‌క‌వ‌ర్గాల్లో లేకుండా చూసేందుకుద‌..అభ్య‌ర్ధులు ప్ర‌జ‌ల‌తో – కార్య‌క‌ర్త‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా క‌దులుతున్నారు. YCP నుండి ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుండి పోటీ ఉంటే..వెంట‌నే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి..అక్క‌డ పోటీ పడుతున్న వారి మ‌ధ్య స‌ఖ్య‌త కుదురుస్తున్నారు. అభ్య‌ర్ధిని ఖ‌రారు చేసి..పోటీలో ఉన్నవారికి భ‌విష్య‌త్ లో ఏ ర‌కంగా ప్రాధాన్య‌త క‌ల్పించేదీ వివ‌రిస్తున్నారు. దీంతో..నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌ర్గ పోరాటాలు..నేత‌ల మ‌ధ్య బేదాభిప్రాయాలకు అ వకాశం లేకుండా..కేడ‌ర్ ను ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం చేస్తున్నారు. పాదయాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వేస్తున్న అడుగుల తో అధికార పార్టీలో అల‌జ‌డి మొద‌లైంది. YCP లో మాత్రం ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం అయ్యే అవ‌కాశం ఏర్ప‌డుతోంది.

YCP అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఒక‌వైపు అధికార పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తూ YCP ని డామేజ్ చేసామ‌నే భావ‌న‌లో ఉన్నారు. అయితే, జ‌గ‌న్ మాత్రం దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఫిరాయింపుల‌పై పోరా టం చేస్తూనే..మ‌రోవైపు పార్టీ ప‌రంగా ఆ నియోజకవ‌ర్గాల్లో ఎటువంటి ప్ర‌భావం ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఫిరాయిం పు MLAల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికే స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను జ‌గ‌న్ ఖ‌రారు చేసారు. వారు అక్క‌డ పార్టీ కార్య‌క‌లాపాల నిర్వ‌హ ణ‌లో నిమ‌గ్న‌మ్యారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి సీట్లు ఇవ్వాల‌నే అంశం పై జ‌గ‌న్ గ‌తం కంటే చాలా స్ప‌ష్టంగా వ్య‌వ‌హ‌రిస్తున్నా రు. ఎటువంటి మోహ‌మాటాల‌కు అవ‌కాశం లేకుండా.. పార్టీ గెలుపే ల‌క్ష్యంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అన్ని నియోజ‌క‌వ‌ర్గా ల్లో అనేక ర‌కాలుగా స‌ర్వేలు చేయిస్తూ ప్ర‌జాభిప్రాయం తెలుసుకుంటున్నారు. అదే విధంగా..అభ్య‌ర్ధి గెలుపు అవ‌కాశాల‌ను ప్రామాణి కంగా తీసుకొని అభ్య‌ర్ధిని ఖ‌రారు చేయాల‌ని భావిస్తున్నారు. ఎక్క‌డైతే పార్టీ నుండి పోటీ ఉందో..అభ్య‌ర్ధి మార్పు అవ‌స‌ర‌మ‌ని గుర్తిస్తే అక్క‌డ దిద్దుబాటు చ‌ర్య‌లను చేప‌డుతున్నారు. అందులో భాగంగా..ఎన్నిక‌ల స‌మ‌యం వ‌ర‌కు వేచి చూడ‌కుండా..కొత్త అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసి..వారికి ఎన్నిక‌ల నాటికి ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యే విధంగా అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ఎవ‌రైతే టిక్కెట్లు ఆశించి..వారికి టిక్కెట్ ఇచ్చే అవ‌కాశం లేదో..వారికి రాజ‌కీయంగా భ‌విష్య‌త్ పై స్ప‌ష్ట‌మైన హామీ ఇస్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాల‌ను ఎంపిక చేసే ప‌నిలో జ‌గ‌న్ ప‌క్కా ప్ర‌ణాళికా బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ముందుగానే అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసి నియోజ‌క‌వ‌ర్గాల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తున్నారు. క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ అభ్య‌ర్ధిగా శ్రీదేవి ని తొలి అభ్య‌ర్ధిగా జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత కుప్పం నుండి గ‌త ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్ర‌బాబు పై పోటీ చేసి ఓడిన చంద్ర‌మౌళిని మ‌రోసారి బ‌రిలోకి దింపుతున్నాట్లు ప్ర‌క‌టించారు. చంద్ర‌మౌళిని గెలిపిస్తే..మంత్రిప‌ద‌వి ఇస్తామ‌ని స్ప‌ష్టం చేసారు. ఇ క‌, గుంటూరు జిల్లా గుర‌జాల లో కాసు మ‌హేష్ రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అక్క‌డ గ‌తంలో పోటీ చేసిన జంగా కృష్ణ‌మూ ర్తికి ఎమ్మ‌ల్సీ ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి అభ్య‌ర్ధి విష‌యంలో కొంత కాలంగా అనేక ర‌కాలుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద‌రెడ్డి ఈ సారి పోటీకి అనాస‌క్తి వ్య‌క్తం చేయ‌టంతో అక్క‌డ బాదం మాధ‌వ‌రెడ్డిని అభ్య‌ర్దిగా ప్ర‌క టించిన జ‌గ‌న్‌..అక్క‌డి గంద‌ర‌గోళానికి తెర దించారు. ఇక‌, అదే జిల్లాలో ప‌ర్చూరు నుండి అభ్య‌ర్ధిని ఖ‌రారు చేసారు. వ‌చ్చే ఎన్నిక ల్లో ప‌ర్చూరు YCP అభ్య‌ర్ధిగా రావి రాంబాబును ప్ర‌క‌టించారు. అక్క‌డ గ‌తంలో పోటీ చేసిన గొట్టిపాటి భ‌ర‌త్ కు ఎమ్మెల్సీ అవ కాశం ఇస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో ప్ర‌క‌టించారు. ఇలా..త‌న నిర్ణ‌యాల‌ను ప్ర‌జ‌ల ముందే ప్ర‌క‌టిస్తూ.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రంగా స‌మ‌స్య‌లు రాకుండా జ‌గ‌న్ ముంద‌స్తు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. జ‌గ‌న్ దూకుడు తో పా దయాత్ర ముగిసే లోగా ఇంకా ఎన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేస్తారో చూడాలి..