RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు NDA లో కొనసాగడమెందుకు బాబూ..!

  • January 23, 2018 | UPDATED 14:53 IST Views: 615
  • Share

 

AP CM చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. AP విభ‌జ‌న జ‌రిగి నాలుగేళ్లు అవుతుంది. దేశమంతా వ‌చ్చే ఏడాది జ‌రిగే ఎన్నిక‌పై దృష్టి సారిస్తోంది. ఈ నేప‌థ్యంలో AP ప్ర‌తిపక్ష నేత AP ప్ర‌త్యేక హోదా స్ప‌ష్ట‌మైన స్టాండ్ తీసుకుని, APకి ప్ర‌త్యేక హోదా ఇస్తే BJPతో స‌హా ఏ పార్టీకైనా మ‌ద్ద‌తు ఇవ్వ‌టానికి సిద్ద‌మ‌ని తెగేసి చెపుతున్నారు. కానీ AP CM చంద్ర‌బాబు నాయుడు మాత్రం కేంద్ర ప్ర‌భుత్వం APకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని ప‌క్షంలో మేము NDAతో క‌లిసి ఉండ‌మ‌ని ఎందుకు చెప్ప‌లేక‌పోతున్నార‌నే చ‌ర్చ మొద‌లైంది.

 

అనుభవం పేరుతో చంద్ర‌బాబు,ప‌వ‌న్‌ల మోసం

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో అనుభ‌వం ఉన్న నేత‌గా ప్ర‌జ‌లు భావించి చంద్ర‌బాబుకు అధికారం క‌ట్ట‌బెట్టిన సంగ‌తి తెల్సిందే. AP రాజ‌ధాని కోల్పోవ‌టం, ఆదాయం హైద‌రాబాద్‌లో కేంద్రీక‌రించ‌బ‌డి ఉన్న నేప‌థ్యంలో AP అభివృద్ది కోసం APకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం హామీ ఇచ్చింది. విభ‌జ‌న జ‌రిగి నాలుగేళ్లు పూర్తి కావ‌స్తున్నా, కేంద్రం హోదా ఇవ్వ‌లేదు. దాని స్ధానంలో AP స్పెష‌ల్ ప్యాకేజీ అంటే చంద్ర‌బాబు దాన్ని స్వాగ‌తించారు. దాంతో AP ప్ర‌త్యేక హోదా వెన‌క్కి పోయింది. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు,BJP మ‌ద్ద‌తు ప‌లికిన జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా APకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని BJPతో ఎందుకు క‌లిసి ఉంటుంన్నారు. కేంద్రంలోని BJPతో తెగ తెంపులు చేసుకుని ప్ర‌జ‌ల ప‌క్షం వ‌హించ‌డ‌ని కూడా చెప్ప‌లేక‌పోతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలివిగా MPలు పోరాటం చేయాల‌ని మాట్లాడుతున్నారు. ప్ర‌తీ రాజ‌కీయ పార్టీ త‌న MPలు, MLAల‌కు దిశా నిర్దేశం చేస్తుంద‌ని, దానికి క‌ట్టుబ‌డే వాళ్లు చ‌ట్ట‌స‌భ‌ల్లో, వివిధ అంశాల‌పై స్పందిస్తార‌నే విష‌యం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు తెలిసో తెలియ‌దో కానీ ఆయ‌న మాట‌ల ధోర‌ణి ఇలా సాగుతుంది. ఇటు చంద్ర‌బాబు నాయుడు,ఇటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ కూడా AP ప్ర‌త్యేక హోదాపై ఏం చేయాలో అది త‌ప్ప, మిగిలిన మాట‌ల‌న్నీ మాట్లాడుతున్నారు. ఈ వైఖ‌రే ఇప్పుడు YS జ‌గ‌న్‌కు బ‌లంగా నిలుస్తోందంటున్నారు.

 

హొదా ఇస్తేనే మ‌ద్ద‌తు అని తెగేసి చెప్పిన జ‌గ‌న్‌

AP ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాదయాత్ర నేప‌థ్యంలో జాతీయ మీడియా ఆయ‌న‌తో ఇంట‌ర్వ్యూ చేసింది. ఆ సంద‌ర్భంగా ఆ ఛాన‌ల్ ప్ర‌తినిధి 2019 ఎన్నిక‌ల్లో మీ స్టాండ్ ఏమిటి?  BJPతో క‌లిసి ప‌ని చేస్తారా? అని ప్ర‌శ్నించారు. దానికి జ‌గ‌న్ స‌మాధానం ఇస్తూ AP రాష్ట్రం విడిపోయిన నేప‌థ్యంలో త‌మ‌కు ఓ ముఖ్య‌మైన స‌మ‌స్య ఉంది. AP ఇత‌ర రాష్ట్రాల‌తో పోటీ ప‌డాలంటే AP కి ప్ర‌త్యేక హోదా రావాల్సిందే. APకి ప్ర‌త్యేక హోదా ఇస్తే BJPతో క‌లిసి ప‌ని చేయ‌టానికి మాకు అభ్యంత‌రం లేదు. అలాగే BJP కానీ మ‌రేఇత‌ర పార్టీ అయినా కూడా APకి ప్ర‌త్యేక హోదా ఇస్తామంటే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. AP ప్ర‌యోజ‌నాలే త‌మ‌కు ముఖ్య‌మ‌ని తేల్చి చెప్పారు. దాంతో ఇప్పుడు కొత్త చ‌ర్చ మొద‌లైంది. AP అభివృద్దికి, యువ‌త ఉపాధి క‌ల్పించే ప్ర‌త్యేక హోదా గురించి చంద్ర‌బాబు నాయుడు అంత ఖ‌రాఖండిగా ఎందుకు చెప్ప‌లేక‌పోతున్నాడు? APకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా తాము BJPతో క‌లిసి ప‌ని చేయ‌లేమ‌ని ఎందుకు చెప్ప‌లేక‌పోతున్నాడు? ఇప్పుడైనా APకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోతే తాము NDA నుంచి బ‌య‌ట‌కు వ‌స్తామ‌ని ఎందుకు చెప్ప‌రు? AP ప్ర‌యోజ‌నాలు త‌ప్ప చంద్ర‌బాబుకు వేరే ప్ర‌యోజ‌నాలు ఏం ఉన్నాయ‌నే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో మొద‌లైంది. విప‌క్షాలు ఆరోపించిన‌ట్లుగానే ఓటు కు నోటు కేసు కు భ‌య‌ప‌డే ఇలా చేస్తున్నారా? అని  ఎవ‌రికి వారు స‌మాధాన ప‌డాల్సిన ప‌రిస్తితి నెల‌కుంది. చంద్ర‌బాబు నాయుడు మాత్రం APకి అన్యాయం జ‌రుగుతున్నా, త‌న ప‌ద‌వి పోకుండా, కేసుల నుంచి త‌ప్పించుకోవ‌టానికి APని బ‌లి చేశార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతునే ఉన్నాయి.

 

జ‌గ‌న్ పై బుర‌ద చ‌ల్లేందుకు ఎల్లో మీడియా వృధా ప్ర‌యాస

ప్ర‌స్తుతం దేశంలోనూ, రాష్ట్రంలోనూ BJP,TDPలు రెండూ క‌లిసే అధికారం పంచుకుంటున్న విష‌యం తెల్సిందే.

జాతీయ చాన‌ల్ ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా AP అభివృద్దికి ముడిప‌డి ఉన్న ప్ర‌త్యేక హోదా ఇస్తే BJPకి అయినా లేదా ఇత‌ర పార్టీకైనా మ‌ద్ద‌తు ఇస్తామ‌ని సూటిగా జ‌గ‌న్ చెబితే ఇదేదో నేరం అన్న‌ట్లుగా మీడియాలో క‌థ‌నాలు, చ‌ర్చ‌లు మొద‌లు పెట్టారు. BJP AP ప్ర‌జ‌ల్ని మోసం చేస్తుంద‌నే భావ‌న‌తో ఇలా చేస్తున్నారా? అంటే అది కాదు. అలా అయితే ముందు చంద్ర‌బాబు ను BJP నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని చెప్పాలి. అలా కాకుండా BJP, చంద్ర‌బాబు నాయుడు క‌లిసి ప‌ని చేయ‌వ‌చ్చు.  కానీ AP ప్ర‌త్యేక హోదా ఇస్తే మ‌ద్ద‌తు ఇస్తాన‌ని ప్ర‌క‌టించ‌టం నేర‌మైన‌ట్లుగా ఎల్లో మీడియా  బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేసింది. నిజానికి జ‌గ‌న్ కొత్త‌గా చెప్పిందేమి లేదు. AP ప్ర‌త్యేక హోదా త‌మ ప్రాధాన్య‌త అని ఎప్పుడో చెప్పారు. అదే విష‌యాన్ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఎల్లో మీడియా వేస్తున్న వెర్రీ వేషాలు మాత్రం చూసే వారికి ఆస‌హ్యం తెప్పిస్తున్నాయ‌నే వ్యాఖ్య‌లు కూడా విన్పిస్తున్నాయి.