RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

కొత్త వ్యూహాల‌తో క‌ద‌న‌రంగంలోకి..!

  • March 9, 2018 | UPDATED 19:15 IST Views: 19958
  • Share

 

YCP అధినేత జ‌గ‌న్ త‌న రూట్ మార్చుకుంటున్నారా. మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌కు అనుగుణంగా వ్యూహాల‌ను సిద్దం చేస్తున్నారా. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ కొత్త‌గా అమ‌లు చేస్తున్న కార్యాచ‌ర‌ణ ఏంటి. TDP కేంద్ర ప్ర‌భుత్వం నుండి వైదొలిగి..NDA లో కొన‌సాగుతోంది. ప్ర‌స్తుత లోక్‌స‌భ పూర్త‌య్యే వ‌ర‌కూ NDA లో కొన‌సాగుతామ‌ని TDP స్ప‌ష్టం చేసింది. ఇదే స‌మ‌యంలో BJP సైతం APలో కొత్త రాజ‌కీయ అడుగులకు సిద్దం అవుతోంది. ఈ స‌మ‌యంలో..జ‌గ‌న్ పూర్తిగా కొత్త వ్యూహాల‌ను న‌మ్ముకున్నారు. అవిశ్వాస తీర్మానం తేదీని సైతం ముందుగానే ప్ర‌తిపాదించాల‌ని నిర్ణ‌యించారు. దీనితో పాటుగా ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన పాద‌యా త్ర లో కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక నుండి అర్బ‌న్ ఏరియా క‌వ‌ర్ అయ్యేలా చూడ‌టం తో పాటుగా ప్ర‌త్యేక హోదా పై మ‌రింత గా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌ట‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు…
YCP అధినేత జ‌గ‌న్ త‌న రూటు మారుస్తున్నారు. ప్ర‌త్య‌ర్ధి రాజ‌కీయ పార్టీలు మార్చుకుంటున్న నిర్ణ‌యాల‌కు అనుగుణంగా త‌న వ్యూహాల‌ను మారుస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌త్యేక హోదా కు వ్య‌తిరేకంగా మాట్లాడిన TDP ఇప్పుడు యూ ట‌ర్న్ తీసుకుంది. జ‌గ‌న్ ఒత్తిడి పెంచే నిర్ణ‌యాల‌తో కేంద్ర ప్ర‌భుత్వం నుండి TDP త‌మ ఇద్ద‌రు మంత్రుల‌ను ఉప సంహ‌రించుకుంది. కానీ, NDA లో మాత్రం కొన‌సాగుతోంది. ఇదే స‌మ‌యంలో BJP అప్ర‌మ‌త్త‌మైంది. APలో TDP ని కార్న‌ర్ చేస్తూనే..త‌న బ‌లం పెంచుకొనే వ్యూహాల‌ను సిద్దం చేస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో..ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తూ జ‌గ‌న్ కార్యాచ‌ర‌ణ ఇప్ప‌టికే ఖ‌రారు చేసారు.  ఈ నెల 21న ప్ర‌తిపాదించాల‌ని నిర్ణ‌యించిన YCP.. అవిశ్వాస తీర్మానం ద్వారా TDP పై ఒత్తిడి పెంచేందుకు రాజ‌కీయంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. TDP క‌లిసొచ్చే అవ‌కాశం లేక‌పోవ టంతో..APకి స‌హ‌క‌రించ‌ని BJP కి స‌హ‌క‌రిస్తూ..ఇంకా NDA లో కొన‌సాగుతున్న పార్టీగా TDP పై ఒత్తిడి పెరుగుతుంది. ఇదే స‌మ‌యంలో..అందరు ఎంపీలు క‌లిసి క‌ట్టుగా రాజీనామా చేయాల‌ని జ‌గ‌న్ పిలుపునిచ్చారు. ఇందు కోసం YCP ఎంపీల రాజీ నామాల తేదీని ఖ‌రారు చేసారు. ఈ విష‌యంలోనూ TDP క‌లిసొచ్చే అవ‌కాశం లేదు. దీనిని కూడా ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లి త‌మ చిత్త‌శుద్ది చాటుకోవాలని YCP భావిస్తోంది.
ఇక‌,పాద‌యాత్ర‌లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు అనుస‌రించిన రూట్ కు భిన్నంగా ముందుకెళ్లాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయ్యారు. TDP – BJP కి ప్ర‌ధాన ఓటు బ్యాంకుగా ఉన్న అర్బ‌న్ ఓట‌ర్ల ను ఆకట్టుకొనే విధంగా ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్నారు. ఇందు కోసం గుంటూరు జిల్లా పర్య‌ట‌న మొద‌లు అర్బ‌న్ ప్రాంతాల్లోనూ స‌భ‌లు ఏర్పాటు చేసేలా కార్యాచ‌ర‌ణ ఖ‌రారైంది. పాద‌యాత్ర లోనే ప్ర‌త్యేక హోదా కు సంబంధించిన కార్య‌క్ర‌మాల‌ను విస్తృతం చేసి ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేలా ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తున్నారు. ఆరు జిల్లాల్లో పూర్త వుత‌న్న యాత్ర ఈ నెల 12న ప్ర‌కాశం నుండి గుంటూరు జిల్లాలోకి ప్ర‌వేశిస్తుంది. జిల్లాలోని బాపట్ల లోకి ప్ర‌వేశించి అక్క‌డ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తారు. అక్క‌డి నుండి కాకుమాను, పొన్నూరు, ఉప్ప‌ల‌పాడు మీదుగా న‌ర్స‌రావు పేట కు చేరుకుంటుంది. ప‌ల్నాడు ముఖ్య కేంద్ర‌మైన‌ నర్సరావుపేటలోనూ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేస్తున్నారు. రాజుపాలెం మీదుగా మేడికొండూరు.. పేరేచ‌ర్ల చేరుకొని అక్క‌డ బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ పాల్గొంటారు. తాడికొండ, గుంటూరు టౌన్ లో స‌భ‌ల్లో ప్ర‌సంగిస్తారు. ఆ త‌రువాత సంగం జాగ‌ర్ల‌మూడి-చుండూరు మీదుగా తెనాలి చేరుకుంటారు. అక్క‌డ స‌భ ఏర్పాటు చేస్తున్నారు. అక్క‌డి నుండి నంది వెలుగు-దుగ్గిరాల మీదుగా మంగళగిరి నియోజ‌క‌వ‌ర్గం నుండి కృష్ణా జిల్లాలోకి ప్ర‌వేశిస్తారు. ఇలా..అర్బ‌న్ ప్రాంతాల్లోనూ ప‌ర్య‌ట న సాగేలా మార్పులు చేసుకుంటున్నారు. ప్ర‌ధానంగా TDP-BJP ఓటు బ్యాంకుగా చెప్పుకొనే అర్బ‌న్ ప్ర‌జ‌ల‌ను అక‌ట్టుకొనే విధంగా జ‌గ‌న్ రూట్ మ్యాప్‌లో మార్పులు చేస్తున్నారు. ఇక‌, యువ‌త ను ఆక‌ట్టుకొనే విధంగానూ కొత్త‌గా మార్పులు చేస్తున్నారు. ఇలా..APలో నువ్వా నేనా అన్న‌ట్లుగా సాగుతున్న రాజ‌కీయం లో త‌న స‌త్తా నిరూపించుకొనేందుకు జ‌గ‌న్ సిద్ద‌మ‌వుతున్నారు.