RajakeeyaaluRajakeeyaalu

Friday, February 23, 2018

అదే అస‌లు ల‌క్ష్యం…!

  • September 15, 2017 | UPDATED 18:42 IST Views: 13950
  • Share

 

YSR కుటుంబంలో ల‌క్ష‌ల్లో చేరుతున్నారు. YCP స‌భ్య‌త్వం పెరిగిపోతోంది. ఈ అంకెలు చూసి YCP అధినాయ‌క త్వం మురిసి పోవ‌టం లేదు. మిస్‌డ్ కాల్స్ చూసి సంబ‌రప‌డటం లేదు. అస‌లు ల‌క్ష్యం ముందుంది. YS కుటుంబ స‌భ్యులుగా ఇంత మంది చేరుతున్నారు..స‌రే. కానీ, చేరని వారే అస‌లు ల‌క్ష్యం. వారిని YCP వైపు మ‌ళ్లించ‌ట‌మే ఇప్పుడు పార్టీ నేత‌ల – కార్య‌క‌ర్త‌ల ప్ర‌ధాన క‌ర్త‌వ్యం. అక్టోబ‌ర్ రెండున YS కుటుంబం ముగిసిన త‌రువాత జ‌రిగేదే అస‌లు ఆప‌రే ష‌న్ న్యూట్ర‌ల్. వీరే ఎన్నిక‌ల్లో డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌. YCP అధినేత జ‌గ‌న్ – వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ అస‌లు లెక్క ప‌క్కా. ఇక పాద‌యాత్ర స‌మ‌యంలో అమ‌లు చేయ‌నున్న వ్యూహంతోనే అస‌లు క‌ధ మొద‌ల‌వుతుంది…
YCP మొద‌లు పెట్టిన YSR కుటుంబం కార్య‌క్ర‌మం ఏదో స‌భ్య‌త్వం ప్రారంభించింది కాదు. దీని వెనుక పెద్ద లెక్కే ఉంది. YS ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న అమ‌లు చేసిన సంక్షేమ ప‌ధ‌కాల ల‌బ్దిదారుడు లేని నివాసం ఉండ‌దంటే అతి శ‌యోక్తి కాదు. ఇప్ప‌టికీ..ఆ ప‌ధ‌కాల ల‌బ్ది దారులు YS ను మ‌రిచిపోలేరు. ఇక‌, TDP ప్రభుత్వంలోనూ సంక్షేమ ప‌ధ‌కాల ల‌బ్దిదారులు ఉన్నారు. వారిలోనూ YS అభిమానులు ఉంటారు. ఇక‌, AP వ్యాప్తంగా YS- జ‌గ‌న్ మీద అభిమానంతో ఉన్న వారెంత‌మందో ఈ YSR కుటుంబ కార్య‌క్ర‌మం ద్వారా స్ప‌ష్ట‌త వస్తుంది. అది పార్టీ ప‌రంగా కోటి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, అంత‌టితో పార్టీ అధినేత జ‌గ‌న్..వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్ ఆగిపోవటం లేదు. అక్టోబ‌ర్ రెండు వ‌ర‌కు జ‌రిగే ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఎన్ని లక్ష‌ల మంది స‌భ్యులుగా చేరుతారో వారంద‌రి వద్ద కు పార్టీ కార్య‌క‌ర్త‌లు రావ‌టం..న‌వ ర‌త్నాల గురించి వివ‌రించ‌టం..ప్ర‌భుత్వం పై వ్య‌తిరేక తాంశాల‌ను గుర్తించ‌టం జ‌రుగు తుంది. కానీ, అదే స‌మ‌యంలో…ఈ కార్య‌క్ర‌మం లో స‌భ్యులుగా చేర‌ని వారే అస‌లు ల‌క్ష్యంగా మ‌రో వ్యూహాత్మ కార్య‌క్ర‌మానికి రంగం సిద్ద‌మ‌వుతోంది. అదే అస‌లు లెక్క‌..అది ప‌క్కా అయితే…ఇక‌, YCPకి తిరుగుండ‌ద‌ని పార్టీ నేత‌ల అంచ‌నా..
AP  లోని 13 జిల్లాల్లో YCP YSR కుటుంబం లోకి చేర‌ని వారిని  ఒక ప్ర‌త్యేక బృందం గుర్తించ నుంది. వారిలో TDP వైపు..ఇత‌ర పార్టీల వైపు ఉన్న‌వారిని గుర్తిస్తారు. వారు YCP లోకి వ‌చ్చే అవ‌కాశం లేదు. ఇక‌, ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా..ఉన్న త‌ట‌స్థులను గుర్తించి..వారిని ఆక‌ర్షించ‌ట‌మే ఇప్పుడు YCP ప్ర‌ధాన లక్ష్యంగా భావిస్తోంది. TDP ప్ర‌భుత్వం పై న‌మ్మ‌కం లేక‌..TDPకి ఓటేయ‌టం ఇష్టం లేక‌..ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉన్న వారిలో YSR కుటుంబంలో చేర‌ని వారితో ఒన్ టు ఒన్ స‌మావేశాల‌కు ప్ర‌త్యేక బృందాల‌ను సిద్దం చేస్తున్నారు. వీరికి YS హ‌యాంలో అమ లైన సంక్షేమ‌- అభివృద్ది ప‌ధ‌కాల‌ను వివ‌రించ‌టంతో పాటుగా..YCP కి అవ‌కాశం ఇస్తే జ‌రిగే మేలు గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించ‌నున్నారు. అదే స‌మ‌యంలో వారు YCPలో చెప్పే లోపాలు..చేసే సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని వాటికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని…వారు కోరుకున్న విధంగా పార్టీ అంద‌రి పార్టీగా ఉంద‌నే న‌మ్మ‌కం క‌లిగించేలా కార్యాచ‌ర‌ణ అమలు చేయ‌నున్నారు. ఇక‌, ఇలా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు విలువ ఇచ్చే పార్టీగా YCP ని తీర్చిదిద్ద‌నున్నారు . అదే విధంగా..పాద‌యాత్ర స‌మ‌యంలో ఆరు నెల‌ల పాటు ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై..వారి బాధ‌లు- క‌ష్టాలు- స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారంగా వాట‌న్నింటి క‌లిపి వారిని ఆకట్టుకొనే రీతిలో మొత్తంగా..ఓ బృహత్త‌ర కార్య‌చ‌ర‌ణ కు ప్ర‌శాంత్ కిషోర్ టీం ఎన్నిక‌ల ప్రచార వ్యూహం ఖ‌రారు చేస్తుంది. ఇక‌..జ‌గ‌న్ త‌న ల‌క్ష్య సాధ‌న‌లో భాగంగా..ఈ వ్యూహాల‌ను అమ‌లు చేస్తూ అంద‌రివాడుగా ఎన్నిక‌ల నాటి కి సాటి లేని నేత‌గా ఎద‌గాల‌నేది YCP అస‌లు లక్ష్యం.