RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

పాద‌యాత్ర‌లో కొత్త స‌మీక‌ర‌ణాలు…!!

  • March 12, 2018 | UPDATED 19:50 IST Views: 1447
  • Share

 

YCP అధినేత కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తెర లేపారు. జ‌గ‌న్ పాద‌యాత్ర సగం పూర్త‌యింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పాద‌యాత్ర ఒక లె క్క అయితే..ఇక నుండి జ‌రిగే యాత్ర సిస‌లైన లెక్క‌. ఆరు జిల్లాల్లో యాత్ర ముగించిన జ‌గ‌న్‌..ఇప్పుడు గుంటూరు జిల్లాలో అడుగు పెట్టారు. 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్తి చేసిన ఆరు జిల్లాల్లో అనంత‌పురం మిన‌హా మిగిలిన చోట్ల మెరుగైన ఫ‌లితాలే సాధించారు. గుంటూరు నుండి శ్రీకాకుళం వ‌ర‌కు ఆశించిన స్థాయిలో ఫ‌లితాలు రాలేదు. దీంతో..ఈ జిల్లాల్లో 2014 ఎన్నిక‌ల ఫ‌లితాల సీన్ రివ‌ర్స్ చేసేందుకు జ‌గ‌న్ కొత్త వ్యూహాల‌తో ముందుకు క‌దులుతున్నారు. అందుకు గుంటూరు జిల్లా ప్రారంభంలోనే బాప‌ట్ల స‌భ లో జ‌నం పోటెత్తారు. చంద్ర‌బాబు పై జ‌గ‌న్ విరుచుకుప‌డ్డారు. ఇక‌, ఇక్క‌డి నుండి ప్ర‌తీ అడుగు వ్యూహాత్మ‌కంగా ముందుకు వేసు కుంటూ..2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు.

YCP అధినేత జ‌గ‌న్ గుంటూరు జిల్లాలో త‌న పాద‌యాత్ర ప్రారంభించారు. తొలి రోజు బాప‌ట్ల‌లో జ‌రిగిన స‌భ జ‌న సంద్రంగా మారిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ‌గా గ్రామీణ ప్రాంతాల్లో జ‌రిగిన జ‌గ‌న్ పాద‌యాత్ర ఈ జిల్లా నుండి అర్బ‌న్ ప్రాంతాల్లోనూ రూర‌ల్ ఏరియాతో స‌మానంగా ప్రాధాన్య‌త ఇచ్చేలా షెడ్యూల్ సిద్ద‌మైంది. రాయ‌ల‌సీమ తో పాటుగా నెల్లూరు-ప్ర‌కాశం జిల్లాల్లోనూ జ‌గ‌న్ కు మంచి రెస్పాన్స్ క‌నిపించింది. అయితే, ఈ ఆరు జిల్లాల్లోనే జ‌గ‌న్ 2014 ఎన్నిక‌ల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌లు YCP కి అండ‌గా నిలిచారు..నిలుస్తున్నారు. దంతో..ఇప్పుడు గుంటూరు జిల్లా నుండి త‌న యాత్ర‌లో వ్యూహం మార్చిన జ‌గ‌న్ మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు..అర్బ‌న్ ఏరియాలు..యువ‌త ను ప్ర‌ధానంగా త‌న పాదయాత్ర‌లో టార్గెట్ చేస్తున్నారు. రాజ‌ధానిగా ఉన్న గుంటూరు జిల్లాలో త‌న స‌త్తా చాటేందుకు జ‌గ‌న్ సిద్ద‌మ‌య్యారు. గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లాలో YCP అయిదు స్థానాల‌ను గె లుచుకుంది. పార్టీ ఫిరాయింపులు ప్ర‌తీ జిల్లాలో ఉన్నా..గుంటూరు జిల్లాలో ఉన్న ఏ MLA కూడా పార్టీని విడిచి పోలేదు. దీంతో పార్టీ MLAల పై జ‌గ‌న్ కు ప్ర‌త్యేకంగా అభిమానం ఉంది. ఇదే స‌మ‌యంలో..జిల్లాకు చెందిన MLAలు..పార్టీ నేత‌లు సైతం జ‌గ‌న్ యాత్ర‌ను ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గంలో స‌క్సెస్ చేసేందుకు ప‌క్క ప్ర‌ణాళికా బ‌ద్దంగా ముందుకు వెళ్తున్నారు.

APలో గుంటూరు జిల్లా నుండి శ్రీకాకుళం వ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల్లో సామాజిక‌- ప్రాంతీయ స‌మీక‌ర‌ణాలు TDPకి క‌లిసి వ‌చ్చాయి. అక్క‌డ ఉన్న సామాజిక వ‌ర్గాల ప్ర‌భావం అభ్య‌ర్ధుల గెలుపు – ఓట‌ముల మీద స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీనిని గుర్తించిన జ‌గ‌న్ ఈ సారి త‌న పాద‌యాత్ర లో గుంటూరు జిల్లా నుండే TDPకి అండ‌గా నిలిచే సామాజిక వ‌ర్గాలు- మ‌ధ్య త‌ర‌గ‌తి ఓట‌ర్లు- అర్బ న్ ప్రాంతంలోని ప్ర‌జ‌ల‌ను త‌న వైపు తిప్పుకోవ‌ట‌మే ల‌క్ష్యంగా యాత్ర రూట్ మ్యాప్‌..ప్ర‌సంగాల‌ను సిద్దం చేసుకుంటున్నారు. ఇక‌, TDPకి రాజ‌ధాని జిల్లాలో బ‌లంగా ఉన్న ప్రాంతాల్లో సైతం స‌భ‌లు పెట్టాల‌ని నిర్ణ‌యించారు. గుంటూరు జిల్లా యాత్ర‌లో జ‌గ‌న్ రాజ‌ధాని..భూములు వంటి వాటి పైనా స్పందించే అవ‌కాశం ఉంది. గుంటూరు నుండి ఉభ‌య గోదావ‌రి వ‌ర‌కు ఒకే ర‌క‌మైన ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంటుంది. దీంతో..ఈ జిల్లాల్లో జ‌గ‌న్ త‌న ప్ర‌సంగాల తీరును సైతం మార్చే అవ‌కాశం ఉంది. రాయ‌ల సీమ‌లో బిసి-మైనార్టీ-మ‌హిళ‌-ఎస్సీ వ‌ర్గాల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన జ‌గ‌న్‌…ఈ జిల్లాల్లోనూ ఆత్మీయ స‌ద‌స్సుల నిర్వ‌హ‌ణ కు అవ‌కాశం ఉంద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. ప్ర‌ధానంగా ప్ర‌త్యేక హోదా చుట్టూ రాష్ట్ర రాజ‌కీయం న‌డుస్తున్న ప‌రిస్థితుల్లో అదే అంశం కోసం తొలి నుండి పోరాడుతున్న జ‌గ‌న్‌..ప్ర‌త్యేకంగా యువ‌త‌ను ఇందులో ఈ జిల్లాల నుండి భాగ‌స్వాముల‌ను చేసేలా వ్యూహ ర‌చ‌న చేస్తున్నారు. దీంతో పాటుగా.. మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను త‌న న‌వ‌ర‌త్నాల ద్వారా ఆక‌ట్టుకొనే విధంగా అర్బ‌న్ ప్రాంతా ల్లో స‌భ‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది ఒక ఎత్తు..ఇక నుండి జ‌రిగేది మ‌రొక ఎత్తు అనే విధంగా..TDP కంచు కోట‌ల‌ను లక్ష్యంగా చేసుకుంటూ..గుంటూరు నుండి శ్రీకాకుళం వ‌ర‌కు జ‌గ‌న్ యాత్ర సాగ‌నుంది. అదే స‌మ‌యంలో.. పార్టీ ప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకుంటూ కొత్త స‌మీక‌ర‌ణాల‌కు జ‌గ‌న్ యాత్ర తెర తీసే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.