RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

BJP ట్రాప్..జ‌గ‌న్ జ‌ర భ‌ద్రం..!!

  • March 9, 2018 | UPDATED 16:00 IST Views: 1690
  • Share

 

BJP ని డామేజ్ చేసి మైలేజ్ సాధించాల‌ని TDP. APలో బ‌లం నిరూనించుకోవాల‌ని BJP. ఇందు కోసం BJP – YCP నేతల‌కు BJP ట్రాప్‌. ఇప్ప‌టికే YCP పై విష ప్ర‌చారం మొద‌లు పెట్టిన TDP. APకి ఎవ‌రైతే ప్ర‌త్యేక హోదా ఇస్తారో వారికే మ‌ద్ద‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసిన YCP అధినేత జ‌గ‌న్‌. APకి న‌ష్టం చేసిన BJP తో జ‌గ‌న్ క‌లుస్తున్నారంటూ హోరెత్తిస్తున్న TDP అండ్ మ‌ద్ద‌తు మీడియా. ప్ర‌త్యేక హోదా కోసం యూ ట‌ర్న్ ద్వారా ప్ర‌జ‌ల్లో ఉండేందుకు TDP ఆరాటం. దేశ వ్యాప్తంగా BJP ఆడుతున్న పొలిటిక‌ల్ గేమ్ ను చూసిన త‌రువాత APలో BJP ఏం చేసే అవ‌కాశం ఉందో స్ప‌ష్టంగా క‌ళ్ల ముందు క‌నిపిస్తోంది. ముఖ్యంగా BJP తీసుకొనే నిర్ణ‌యాలు YCP మీద ప్ర‌భావం ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌ధానంగా YCP – BJP సంబం ధాల పై జ‌రుగుత‌న్న ప్ర‌చారం తిప్పి కొట్ట‌క‌పోతే YCP కి న‌ష్టమే.

 

APలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం నుండి మంత్రుల‌ను ఉప సంహ‌రించుకున్న TDP ఇప్ప‌టి కీ ఎన్డీఏ లో కొన‌సాగుతోంది. APకి ప్ర‌త్యేక హోదా కోసం YCP ఢిల్లీలో మ‌హా ధ‌ర్నాతో పాటుగా కేంద్రం పై అవిశ్వాసం.. ఎంపీల రాజీనామాల‌కు ముహూర్తం ఇప్ప‌టికే ఫిక్స్ చేసింది. దీంతో..రాజ‌కీయంగా వెనుక ప‌డ‌కుండా ఉండేందుకు TDP త‌మ పార్టీకి చెంది న కేంద్ర మంత్రుల‌తో రాజీనామా చేయించింది. ఇప్పుడు ప్ర‌త్యేక హోదా మీదా యు ట‌ర్న్ తీసుకుంది. ఇదే స‌మ‌యంలో..రాజ‌కీయంగా మైలేజ్ సాధించ‌టం కోసం BJP AP ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌ని..ఆంధ్రుల ఆత్మ గౌర‌వాన్ని దెబ్బ తీసింద‌నే ప్ర‌చారం మొద‌లు పె ట్టింది. ఇదే స‌మ‌యంలో..APలో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధి YCP పైనా దుష్ప్ర‌చారం స్టార్ట్ చేసింది. BJP..YCP తో క‌లిసేందుకే TDP వి జ్ఞ‌ప్తుల‌ను ప‌ట్టించుకోవ‌టం లేద‌ని..వ‌చ్చే ఎన్నిక‌ల త‌రువాత BJPతో YCP పొత్తు పెట్టుకుంటుంద‌ని ప్ర‌చారం జోరుగా సాగిస్తోంది. TDP నేత‌ల ప్ర‌చారాన్ని TDP మ‌ద్ద‌తు మీడియా విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది. దీని ద్వారా..అటు BJPని-ఇటు YCPని డామేజ్ చేసేందుకు మైండ్ గేమ్ ప్రారంభించింది. ఇక‌, దీనికి కౌంట‌ర్‌గా జ‌గన్ సైతం స్పందిస్తున్నారు. TDP ఇంకా ఎన్డీఏ లో కొన‌సాగ‌టం ఏంట‌ని నిల‌దీస్తున్నారు. అవిశ్వాసానికి క‌లిసి రావాల‌ని కోరుతున్నారు. లేకుంటే TDP అవిశ్వాసం ప్ర‌తిపాదించినా..తాము సిద్దం గా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేసారు. ఇదే స‌మ‌యంలో BJP నేత‌లు AP పై దృష్టి సారించారు.

APలో రాజ‌కీయంగా త‌మ‌ను డామేజ్ చేస్తున్న TDP ని పొలిటిక‌ల్ గా కార్న‌ర్ చేయ‌టం పై కార్యాచ‌ర‌ణ సిద్దం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో TDP తో పాటుగా YCP నుండి కొంద‌రు నేత‌ల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు విశ్వ‌స నీయ స‌మాచారం. ఇక‌, ఇక్క‌డ TDP చేస్తున్న ప్ర‌చారం కార‌ణంగా YCPకి ఓటు బ్యాంకు గా ఉన్న మైనార్టీ-ద‌ళిత ఓట్ బ్యాంక్ ను దెబ్బ తీసేందుకు TDP నేత‌లు వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు. అందులో ఏ మాత్రం TDP స‌క్సెస్ అయినా YCPకి న‌ష్టం త‌ప్ప‌ద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, APకి BJP న‌ష్టం చేస్తుంద‌నే వాద‌న ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లింది. అటువంటి పార్టీతో YCP జ‌త క‌ట్టే విష‌యం పై TDP చేస్తున్న ప్ర‌చారాని YCP ఖ‌రా ఖండిగా తిప్పి కొట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక‌, రాయ‌ల‌సీమ పై BJP కొత్త నినాదాల‌ను తెర మీద‌కు తెస్తోంది. అంత‌గా ఆ ప్రాంతంలో BJPకి బ‌లం లేక‌పోయిన‌ప్ప‌టికీ…YCP బ‌లంగా ఉన్న ఈ ప్రాంతంలో BJP వేస్తున్న ఎత్తుగ‌డ‌ల‌ను జాగ్ర‌త్త‌గా ఎదుర్కోవాలి. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా BJP అమ‌ల చేస్తున్న రాజ కీయ వ్యూహాలు..అనుస‌రిస్తున్న విధానాల‌ను అధ్య‌య‌నం చేస్తే..వారి వైఖ‌రి ఎలా ఉంటుందో అర్దం చేసుకోవ‌చ్చు. కేవ‌లం TDP నే టార్గెట్ చేయ‌కుండా..BJP తో తాము ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రించేదీ YCP నేత‌లు AP ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌త ఇవ్వాల్సిన అవ‌స‌రం క్లియ‌ర్ గా క‌నిపిస్తోంది. విష ప్ర‌చారం..TDP-BJP ఎత్తుగ‌డ‌ల్లో మునిగిపోకుండా పార్టీని కాపాడుకొనేందుకు జ‌గ‌న్ తో పాటుగా YCP నేత‌లు ఇప్ప‌టి నుండి ప్ర‌తీ సంద‌ర్భంలోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.