RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

ఇక‌..ఉక్కిరి..బిక్కిరే…!

  • February 13, 2018 | UPDATED 18:10 IST Views: 1938
  • Share

 

జ‌గ‌న్ గ‌ర్జించారు. జ‌నం మ‌ధ్య నుండే సింహనాదం చేసారు. అధికార TDP ఆడుతున్న డ్రామాల‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. కేంద్ర బ‌డ్జెట్ త‌రువాత TDP ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. YCP ని కార్న‌ర్ చేసే ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగిస్తోంది. వీరిని ఒకే ఒక్క నిర్ణ‌యం తో ఉక్కిరి..బిక్కిరి చేసేలా వ్యూహ ర‌చ‌న చేసారు. చంద్ర‌బాబు అండ్ కో డ్రామాల‌ను ఎండ‌గ‌డుతూ ప్ర‌త్యేక హోదా పై పోరు ఉధృతం చేయాల‌ని నిర్ణయించారు. రాష్ట్ర స్థాయి..ఢిల్లీ స్థాయిలో నిర‌స‌న‌లు..పార్ల‌మెంట్‌లో పోరాటం చేసిన త‌రువాత కేంద్ర బ‌డ్జెట్ స‌మావేశాల ముగింపు రోజైన ఏప్రిల్ 6న YCP MPల రాజీనామాకు నిర్ణ‌యించారు. దీంతో..ఇప్పుడు అధికార TDP ఆత్మ‌ర‌క్ష‌ణ లో ప‌డింది. జ‌గ‌న్ వ్యూహంతో ఒక్క‌సారిగా TDP లో క‌ల‌క‌లం మొద‌లైంది.

ప్ర‌త్యేకహోదా పై తొలి నుండి పోరాటం చేస్తున్న YCP అధినేత జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఎంతో కాలంగా ప్ర‌త్యేక హోదా కోరుతూ YCP అనేక పోరాటాలు చేసింది. జ‌గ‌న్ సైతం ఢిల్లీలో..గుంటూరు లో దీక్ష చేసారు. అనేక ప్రాంతాల్లో ప్ర‌త్యేక హోదా కోరుతూ యువ‌త‌తో  యువ‌భేరీలు నిర్వ‌హించారు. ప్ర‌త్యేక హోదా కోసం త‌మ పార్టీ MPలు రాజీనామా చేస్తార‌ని జ‌గ‌న్ గ‌తంలోనే ప్ర‌కటించారు. ఆ త‌రువాత రాష్ట్రప‌తి-ఉప‌రాష్ట్రపతి ఎన్నిక‌ల్లో NDA అభ్య‌ర్ధుల‌కు YCP మ‌ద్ద‌తు ఇచ్చింది. ప్ర‌ధానితో భేటీతో స‌హా..ఈ రాష్ట్రప‌తి-ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు ఇవ్వ‌టం పై TDP అనేక విమ‌ర్శ‌లు చేసింది. ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామా చేస్తామ న చెప్పిన YCP నేత‌లు ఎందుకు చేయ‌టం లేద‌ని TDP నేత‌లు YCP పై ఆరోప‌ణలు గుప్పించింది. అయితే, లౌక్యం గా ఏదైనా చేస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్‌…ప్ర‌స్తుతం జ‌ర‌గుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను సీరియ‌స్‌గా ప‌రిశీలించారు. పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గన్ పార్టీ సీనియ‌ర్ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. TDP పార్ల‌మెంట్‌లో బ‌య‌టా డ్రామాలు ఆడుతుంద‌నే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించారు. దీనికి అనుగుణంగానే ప్ర‌త్యేక హోదా పై మ‌రోసారి పోరాటం ఉధృతం చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందు కోసం కార్యాచ‌ర‌ణ సిద్దం చేసారు.

ప్ర‌త్యేక హోదా AP కి హ‌క్కు..ప్యాకేజీతో మోసం వ‌ద్దు అనే నినాదంతో మార్చి ఒక‌టిన AP లోని అన్ని క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద నిర‌స‌న దీక్ష లు చేయాల‌ని YCP అధినేత ఆదేశించారు. మార్చి 3న జ‌గ‌న్ ఎక్కడైతే ఉంటారో అక్క‌డి నుండి పార్టీకి చెందిన నేత‌లంతా బ‌యల్దేరి ఢిల్లీ వెళ్తారు. అయిదో తేదీన జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ప్ర‌త్యేక హోదా కోరుతూ ధ‌ర్నా చేస్తారు. అదే రోజు నుండి పార్లమెంట్ బ‌డ్జెట్ రెండో విడ‌త స‌మావేశాలు ప్రారంభం అవుతాయి. అప్ప‌టి నుండి స‌మావేశాలు ముగిసే వ‌ర‌కూ YCP MPలు నిర‌స‌న కొన‌సాగిస్తారు. స‌మావేశాల చివ‌రి రోజు వ‌ర‌కు అంటే ఏప్రిల్ ఆరో తేదీ వ‌ర‌కు ఎదురు చూసి అదే రోజు YCP కి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యులు APకి ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తూ త‌మ ప‌దవుల‌కు రాజీనామా చేస్తారు. ఇదే విష‌యాన్ని జ‌గ‌న్ స్ప‌ష్టంగా ప్ర‌క‌టించారు. కేంద్రంలో భాగ‌స్వామిగా ఉంటూ కేంద్రం తీరును త‌ప్పు బ‌డుతూ డ్రామాలు చేస్తున్న TDP నేత‌ల‌కు ఇప్పుడు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఊహించ‌ని షాక్. YCP MPలు రాజీనామా తేదీ కూడా ప్ర‌క‌టించ‌టం..కేంద్రంలోని TDP మంత్రులు రాజీనామా చేయాల‌ని YCP గ‌ట్టిగా డిమాండ్ చేస్తుండ‌టంతో..TDP నేత‌లు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారు. పూర్తిగా YCP కి పొలిటిక‌ల్ మైలేజ్ వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో..ఎటువంటి నిర్ణ‌యం తీసుకోవాల‌నే దాని పై TDP నేత‌లు త‌ర్జ‌న భర్జ‌న ప‌డుతున్నారు. కేంద్రం నుండి త‌ప్పుకుంటున్నామ‌నే లీక్‌లు మిన‌హ‌..మంత్రుల‌తో రాజీనామా చేయించ‌లేక‌..పూర్తిగా BJPతో సంబంధాల ను తెంచుకుంటే ఎటువంటి పరిణామాలు ఏర్పడుతాయ‌నే ఆందోళ‌న న‌డుమ ఉన్న TDP అధినాయ‌త్వానికి అదును చూసి జ‌గ‌న్ దెబ్బ కొట్టారు. ఇప్పుడు TDP తో పాటుగా BJP సైతం జ‌గ‌న్ నిర్ణ‌యంతో ఎటువంటి న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.