RajakeeyaaluRajakeeyaalu

Friday, February 23, 2018

ప‌త్రిక‌లు చెప్ప‌ని నిజాలు(12-10-2017)

  • October 12, 2017 | UPDATED 09:45 IST Views: 4572
  • Share

 

YCP అధినేత ఎన్నిక‌ల ప్ర‌స్తావ‌న తో ఒక్క‌సారిగా APలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. YCP కొత్త నినాద‌మూ ఆస‌క్తిక‌రంగా మారింది. AP అధికార పార్టీలో జ‌గ‌న్ స‌మ‌ర‌నాదం తో క‌ల‌వ‌రం మొద‌లైంది. ముంద‌స్తు ఎన్నిక‌లు మ‌న‌కే మేలు అంటూ YCP అధినేత చేసిన వ్యాఖ్య‌ల‌తో ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింద‌నే వాద‌న మొద‌లైంది. ఇదే స‌మ‌యంలో..జ‌గ‌న్ కు పోటీగా ముఖ్య‌మంత్రి సైతం మూడున్నరేళ్లుగా గుర్తుకు రాని ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం పై దృష్టి పెట్టారు. ఎన్నిక‌ల స‌మాయ‌త్తంలో భాగంగానే..హ‌డావుడిగా కొత్త నిర్ణ‌యాల దిశ‌గా అడుగులు వేస్తున్నారు. పొలిటిక‌ల హీట్ ఇలా ఉంటే..రాం గోపాల్ వ‌ర్మ సినిమా పై మంత్రి సోమిరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు..ల‌క్ష్మీపార్వతిని హీరోయిన్‌గా పెట్టుకోవాల‌ని సోమిరెడ్డి- ఆమె ప‌క్క‌న హీరోగా సోమిరెడ్డి అంటూ RGV కౌంటర్ ఇచ్చార‌నే చ‌ర్చ‌తో ఇప్పుడు..సినీ-పొలిటిక‌ల్ మిక్స్‌డ్ కౌంట‌ర్ మ‌రో హాట్ టాపిక్ గా మారింది…
పార్టీ నేత‌ల‌తో YCP అధినేత స‌మావేశానికి ..ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు విచిత్రంగా ఆంధ్ర‌జ్యోతి మొద‌టి పేజీ లో స్థానం క‌ల్పించింది. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు ఎటువంటి వ్యాఖ్యానాలు..విమ‌ర్శ‌లు లేకుండా దాదాపు తొలి సారి ఉన్న‌ది ఉన్న‌ట్లు ప్ర‌చురించింద‌నే చెప్పుకోవాలి. ఇక‌..అన్ని ప‌త్రిక‌లు జ‌గ‌న్ ఎన్నిక‌ల స‌మ‌ర‌నాదానికి ప్రాధాన్యత ఇచ్చాయి. గ‌తంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం ముంద‌స్తు ఎన్నిక‌ల పై మాట్లాడినా ఇంత‌గా ప్రాధాన్య‌త క‌నిపించ లేదు. కానీ, త‌న పాద‌యాత్ర ముందు..విప‌క్ష నేత సైతం ముంద‌స్తు ఎన్నిక‌ల గురించి మాట్లాడ‌టం..దీనికి ముందుగా దాదాపు ఆరు నుండి ఏడు నెల‌ల వ‌రకు ప్ర‌జ‌ల్లోనే ఉంటూ పాద‌యాత్ర చేస్తుండ‌టంతో..జ‌గ‌న్ వ్యూహాత్మ‌క ప్రణాళిక పై ఇప్పుడు ప‌త్రిక‌ల్లో – TV ఛాన‌ళ్ల‌లో చ‌ర్చ మొద‌లైంది. అధికార ప‌క్షం ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు ఏ స్థాయిలోనూ అమ‌లు చేయ‌క‌పోవ‌టం..స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌టంతో..ప్ర‌జ‌ల‌కు సంబంధించి చిన్న చిన్న స‌మ‌స్య‌లైనా  వారి మెప్పు పొందే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక‌, YCP తాజాగా ఎంచుకున్న నినాదం పై పాజిటివ్ రెస్పాన్స్ క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల వ‌ద్ద ఒదిగి ఉంటూ వారిని త‌మ గెలుపు కోసం అభ్య‌ర్ధించాల‌నే విధంగా YCP కొత్త నినాదాన్ని ఎంచుకుంది. మీ ముందుకు వ‌స్తున్న జ‌గ‌న్ ను ఆశీర్వదించండి అంటూ అభ్య‌ర్ధించ‌టం తో పాటుగా..ఒక్క‌సారి అవ‌కాశం ఇవ్వండి అనే విజ్ఞ‌ప్తి..ఖచ్చితంగా ప్ర‌జ‌ల్లో ఆలోచ‌న తీసుకువ‌స్తుంద‌నే చ‌ర్చ అధికార పార్టీ నేత‌ల్లోనే జ‌ర‌గ‌టం విశేషం. YCP లోని కొంద‌రు నేత‌ల వ్యాఖ్య‌ల పై TDP విప‌రీత అర్దాల‌తో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక భావం క‌లిగేలా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌చారం చేసింది. అయితే, తాజాగా.. ఒక్క‌సారి అవ‌కాశం ఇవ్వండి..ఆశీర్వ‌దించండి అనే ఈ నినాదాల‌తో ప్ర‌జ‌ల ముంగిట‌కు వెళ్తే ప్ర‌జ‌లు ఖ‌చ్చితంగా YCP కి అనుకూలంగా ఆలోచ‌న చేస్తార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇక‌, ప‌రిణతితో కూడిన నిర్ణ‌యాల‌తో YCP ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.
రాం గోపాల్ వ‌ర్మ వ‌ర్సెస్ సోమిరెడ్డి…
ఊహించిన‌ట్లుగానే రాం గోపాల్ వ‌ర్మ ట్రాప్ లో TDP నేత‌లు ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. నిత్యం వివాదాల‌తో స‌హ‌వాసం చేసే ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ ల‌క్ష్మీస్ NTR పేరుతో తీస్తున్న సినిమా పై TDP లో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఈ సినిమా లో NTR జీవితం లో ల‌క్ష్మీ పార్వ‌తి రంగ ప్ర‌వేశం త‌రువాత అంశాల‌నే క‌ధ‌గా చిత్రీక‌రిస్తాన‌ని రాం గోపాల్ వ‌ర్శ ప్ర‌క‌టించటం..అందునా స‌రిగ్గా వ‌చ్చే అక్టోబ‌ర్ అంటే ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌నుకుంటున్న స‌మ‌యంలో ఈ సినిమా విడుద‌ల అయితే..ఖ‌చ్చితంగా ఎంతో కొంత ప్ర‌భావం చూపిస్తుంద‌నే భ‌యం TDP నేత‌ల‌ను వెంటాడుతోం ది. దీంతో..స‌హ‌జంగా ప‌బ్లిసిటీ కోరుకొనే రాం గోపాల్ వ‌ర్మ దీని పై అప్పుడే చ‌ర్చ కు తెర తీసారు. RGV కోరుకున్న‌ట్లుగానే..TDP నేత‌లు దీని పై స్పందించ‌టం మొద‌లు పెట్టారు. రాం గోపాల్ వ‌ర్మ తీసే సినిమాలో లక్ష్మీ పార్వ‌తి నే హీరో యిన్ గా అవకాశం ఇవ్వాల‌ని మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి కౌంట‌ర్ గా రాం గోపాల్ వ‌ర్మ సైతం త‌న దైన శైలి లో స్పందించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న సినిమా లో ల‌క్ష్మీ పార్వ‌తి హీరోయిన్ అయితే..సోమిరెడ్డిని హీరోగా పెట్టుకుంటా అంటూ రాం గోపాల్ వ‌ర్మ స్పందించిన‌ట్లు ప‌త్రిక‌ల్లో క‌ధ‌నాలు వ‌చ్చాయి. మొత్తానికి..TDP నేత‌ల క‌ల‌వ‌ర పాటు..వ్యాఖ్య‌లు వారికే మ‌రింత స‌మ‌స్య‌గా మారుతున్నాయి..