RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

KCR ప్రత్యామ్నాయ రాజకీయం

  • March 6, 2018 | UPDATED 10:02 IST Views: 374
  • Share

 

2019 ఎన్నికలు సమీపిస్తున్న వేల రాజకీయ పార్టీలు తమ, తమ రాజకీయ ఎత్తుగడలకు పదును పెడుతున్నాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి KCR తాను మూడవ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్దానని అవసరం అయితే తానే నాయకత్వం వహిస్దానని ప్రకటన చేసినారు. BJP, కాంగ్రస్ దేశాన్ని సరిగా పాలించలేదని విదానాలను సమూలంగా మార్చివేయాలని సైతం మాట్లాడుతున్నారు. KCR ప్రకటనతో రాజకీయాలు కీలక దశకు చేరుకుంటున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు ప్రాతిపధిక వారు మాట్లాడుతున్న విదానాలా ? 2019 ఎన్నికలా ? అన్న కోణంలో కచ్చితమైన పరిసీలన జరగాలి.

KCR ప్రకటనకు మూలం మారుతున్న దేశ రాజకీయ పరిణామాలే……

KCR కీలక ప్రకటనకు దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణలే మూలంగా కనిపిస్తుంది. 2014 ఎన్నికలలో BJP అద్బత విజయాన్ని నమోదు చేసుకుంది. దానికి రెండు కారణాలు 1. కాంగ్రస్ మీద ఉన్న వ్యతిరేకత 2. మోదీ మీద ఉన్న నమ్మకం గడిచిన 4 సంవత్సరాలను పరిసీలిస్దే కాంగ్రస్ మీద అనుకూలత లేకపోయినా నాటి వ్యతిరేకత ఉండదు ( ఆంద్రప్రేశ్ మినహయింపు). మోది మీద నాడు ఉన్న నమ్మకం తగ్గిందే తప్ప పెరిగింది లేదు. నోట్ల రద్దు, జీ యస్టీ లాంటి ప్రయోగాలు మోదిగారి ప్రతిష్టను బాగా దెబ్బతీశాయి. 2014 ఎన్నికలలో BJP మంచి వీజయాన్ని సాదించింది కేవలం ఉత్తరప్రదేశ్, మద్యప్రదేశ్, రాజస్దాన్,గుజరాత్,మహరాష్ట్ర,బీహర్, డిల్లీ లాంటి 7 రాష్ట్రాలలో వచ్చిన ఏకపక్ష విజయాల కారణంగానే అన్న విషయం కీలకం. ఆపార్టీ సాదించిన 282 స్దానాలలో 201 స్దానాలు ఇక్కడివే. 2014 తర్వాత జరిగిన ఎన్నికల పలితాలను పరిసీలిస్దే బీహర్, మద్యప్రదేశ్, రాజస్దాన్, డిల్లీ లో ఓడిపోయింది. గుజరాత్ లో గననీయంగా తగ్గింది. మొత్తం జరిగిన పరిణామాలు చూస్దే దాదాపు 70-80 స్దానాలు తగ్గే అవకాశం ఉంది. మరో కీలక విషయం ఆ స్దానాలలో కాంగ్రస్ కు అవకాశం ఉంటుంది. అంటే BJP 282 నుంచి 200 కు తగ్గితే కాంగ్రస్ 40 నుంచి 100 స్దానాలను దాటనుంది. బెంగాల్, కేరళ,తమిళనాడు, ఉబయ తెలుగు రాష్ట్రాలలో గతానికి నేటికి BJP కి వచ్చే స్దానాలలో పెద్ద మార్పు ఉండదు. మిగిలిన రాష్ట్రాలలో కూడా BJP కి వచ్చే స్దానాలలో పెద్ద మార్పు ఉండదు సరికదా పంజాబ్ లాంటి చోట్ల కాంగ్రస్ పుంజుకుంది. మొత్తంగా పరిసీలిస్దే జాతీయ పార్టీలు అయిన BJP కి 200 కాంగ్రస్ కు 150 పైగా సీట్లు వచ్చే పరిస్దితులు కనిపిస్తున్నాయి. అంటే రెండు పార్టీలకు సరిపడ సీట్లు రావు.

పుంజు కుంటున్న ప్రాంతీయ పార్టీలు……

జాతీయ పార్టీల పరిస్దితి అలా ఉంటే పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఈ కాలంలో పుంజుకుంటున్నాయి. బెంగాల్ లో మమత, బీహర్ లో లాలూ, తమిళ నాడులో DMK లేదా రజినీ, తెలంగాణలో KCR, ఏపీలో TDP లేదా YCP లు, ఒడిస్సాలో నవీన్, ఉత్తరప్రదేశ్ లో కూడా మాయావతి లేదా అకిళేస్ కు గతంలో కన్నా ఎక్కువ స్దానాలు వస్దాయి. దాదాపుగా 150 కి పైగా ప్రాంతీయ పార్టీలకు సీట్లు వచ్చే అవకాశం ఉంది. రెండు జాతీయ పార్టీలకు 150 , 200 దాకా సీట్లు వస్దే ప్రాంతీయ పార్టీలకు 150 దాకా వస్దాయి. అలా 2019లో ప్రాంతీయ పార్టీలకు కేంద్రంలో కీలక భూమిక పోషించే అవకాశం వస్తుంది.

బహముఖ వ్యూహంతో KCR అడుగులు……

KCR ఒక్కసారిగా కాంగ్రస్, BJP లకు వ్యతిరేక కూటమి వైపు అడుగులు ఎందుకు వేసినట్లు అవకాశం వస్దే ప్రదాని అయిపోదామనా ? అనుకుంటే అది పొరబాటు. తెలంగాణలో తన పార్టీని గెలిపించే వ్యూహం తప్ప మరోకటి కాదు. ఆ మద్య అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్బంగా చాలా కీలక ప్రకటన చేసినారు KCR. BJP కి తెలంగాణలో అవకాశం లేదు అని అధికారంలోకి రావడం అంటే ఆటలు కాదని అయినా నాకూ ప్రదాని కావాలని ఉంది అయిపోతానా ? అని చాలా స్పష్టంగా మాట్లాడారు. మరి ఇపుడు వారే ప్రత్యామ్నాయ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్దాను అనడం వెనక తెలంగాణ రాజకీయ అవసరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో KCR కి కాంగ్రస్ ప్రదాన శత్రువు అయితే BJP కూడా తాజకీయ ప్రత్యర్దే. మరో ముఖ్యమైన అంశం కోదండరాం , వాపక్షాలు ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం మంచి ప్రయత్నం కూడా ఇక్కడే చేస్తున్నాయి. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు వారి ప్రయత్నాలే తాను చేస్తుండగా మరో ప్రయత్నం ఎందుకు అనవచ్చు కలిసి వస్దే వారిలో కొందరు తనతోనే రావచ్చు. ఇలా బహుముఖ ప్రయోజనాల పరమార్దమే మూడవ ప్రంట్ మాట. దేశంలోని రెండు జాతీయ పార్టీలకు అవకాశం రాకపోతే కచ్చితంగా ఒక అవకాశం ప్రాంతీయ కూటమికి ఉంటుంది. అలా ప్రదాని అయ్యే అవకాశం మమత, మాయావతి, శరద్ పవార్, నవీన్, బాబు, అవకాశం ఉంటే KCR కి ఉంటుంది. ఇదే ప్రచారం తెలంగాణలో జరిగితే పీ వీ గారి తర్వాత తెలంగాణ బిడ్డకు ప్రదాని అయ్యే అవకాశం మల్లీ KCR రూపంలో వస్తుంది. అని సెంటి మెంట్ రాజకీయలు నడపవచ్చు 2014లో తెలంగాణ సెంటిమెంట్ గెలిపిస్దే, నేడు తెలంగాణకు ప్రదాని అవకాశం ఉపయోగపడకపోతుందా అన్న ఆలోచన KCR గారిది గా కనిపిస్తుంది.

తెలంగాణలో మంచి విజయం సాదించడానికి 2014 నుంచి నేటి వరకు సాగిన తన పాలన కన్నా మూడవ ముచ్చట మంచి పలితాలను ఇస్తుందన్న ఎత్తుగడగా కనిపిస్తుది. కానీ నేటి వరకు వరుసగా కేంద్రాన్ని బలపరిచి నేడు వారికి మేం వ్యతిరేకం అంటే ప్రజలు నమ్ముతారా ? ఒకటా, రెండా నోట్ల రద్దు, జీ యస్టీ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇలా ప్రతి సారీ BJP ప్రభుత్వాన్ని గట్టిగా బలపరిచిన KCR అనేక సందర్బాలలో రాష్ట్ర BJP నేతలను విమర్సించినా ఒక్క మాట కూడా మోదిని అనలేదు. మరి ఇపుడు వారు నిర్మించే ప్రత్యామ్నాయం కు ప్రాతిపదిక ఉందా కచ్చితంగా KCR కి ఉన్న ప్రాతిపదిక తెలంగాణలో తనకు ప్రయోజనం కలగడమే. 2019లో కేంద్రంలో రెండు జాతీయ పార్టీలలో ఒకరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్దే కచ్చితంగా ఇదే KCR గారు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మద్య మంచి సంబందాలు ఉండాలి కాబట్టి తాము మద్దతు ఇస్దాను అని నాడు ఏర్పడే పార్టీకి మద్దతు ఇస్దాను అనరా ? మరి 2019 లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు తెచ్చిన ప్రత్యామ్నాయ రాజకీయ ఎత్తుగడ అధికారానికి చేరుస్తుందా ? కాలం నిర్ణయించాలి.