RajakeeyaaluRajakeeyaalu

Friday, February 23, 2018

ఒకే ఒక్క అవకాశం….

  • October 11, 2017 | UPDATED 18:42 IST Views: 1822
  • Share

 

ఆనాడు దివంగత‌ నేత YS రాజ‌శేఖ‌ర‌రెడ్డిపైనా అలాగే  దుర్మార్గ‌మైన ప్ర‌చారం చేశారు. ఆయ‌న‌పై అనేక ర‌కాల ముద్ర‌లు వేశారు. ఆయ‌న రౌడీ. ప్యాక్ష‌నిస్టు అని,  కానీ  YS  CM అయిన త‌ర్వాత ప్ర‌జా CM అంటే ఎలా ఉంటారో ప్ర‌పంచానికి చాటి చెప్పారు.  అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లకు మేలు చేసి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొంది గొప్ప CMగా చ‌రిత్ర‌లో నిలిచిపోయారు. సంక్షేమం. అభివృద్ది రెండు క‌ళ్లుగా భావించారు. ఆరోగ్య‌శ్రీ‌, ఫీజు రియింబ‌ర్స్‌మెంట్‌, 108 వంటి గొప్ప ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టి పేద‌ల హృద‌యాల్లో నిలిచిపోయారు. ఆయ‌న మ‌ర‌ణించినా ప్ర‌జ‌లు గుండెల్లో  ఆయ‌న గుర్తులు మిగిలే ఉన్నాయి. ఆయ‌న పాల‌న చ‌రిత్రాత్మ‌కం.
ఇప్పుడు అలాగే ఒక్క‌ఛాన్స్ ఆయ‌న బిడ్డ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇవ్వండి. YS రాజ‌శేఖ‌రరెడ్డి పాల‌న‌ను ఆయ‌న తిరిగి ప్ర‌జ‌ల‌కు అందిస్తార‌ని రాజ‌మోహ‌న్ రెడ్డి ఎంత ఆత్మ విశ్వాసంతో చెప్పారో తెలుసుకోవాలంటే మీరు ఆయ‌న మాట్లాడిన వీడియో చూడాల్సిందే. జ‌గ‌న్‌పై ఆయ‌న‌కు ఉన్న విశ్వాసం అటువంటిది. జ‌గ‌న్ని మొద‌టి నుంచి వెన్నంటి నిలిచ‌న నేత‌ల్లో రాజ‌మోహ‌న్ రెడ్డి ఒక‌రు. ఆయ‌న గ‌తంలో ఎన్న‌డు లేని విధంగా స్పందించారు. ఆయ‌న మాట‌ల్లో ఎంతో ఆవేద‌న ఉంది. జ‌గ‌న్ వ్య‌క్తిత్వం తెలిసిన నేత‌గా జ‌గ‌న్ పై బ‌య‌ట జ‌రుగుతున్న దుర్మార్గ‌మైన ప్ర‌చారాన్ని త‌ట్టుకోలేక‌పోయారు. అందుకే నేరుగా ప్ర‌జ‌ల‌కు చెప్పుకున్నారు. ఆయ‌నేమిటో అవ‌కాశం ఇవ్వండి. న‌చ్చ‌క‌పోతే మీరే దించేయండంటూ వేడుకున్న తీరు మాత్రం మ‌న‌స్సుల‌ను క‌దిలించింది.
MP రాజ‌మోహ‌న్ రెడ్డి ఈ మాట‌లు చెబుతున్న‌ప్పుడు ఆయ‌న ముఖ‌క‌వ‌ళిక‌లు ప‌రిశీలించారా? ఆయ‌న మాట‌ల్లో వ్య‌క్తం అయిన విశ్వాసాన్ని చూశారా? AP లో YS జ‌గ‌న్ పై జ‌రుగుతున్న దుర్మార్గ‌మైన ప్ర‌చారానికి ముగింపు ప‌ల‌కాలంటే ఒక్క అవ‌కాశం ఇవ్వండి ప్ర‌జ‌ల్ని ఆయ‌న వేడుకున్న తీరు మాత్రం ప్ర‌జ‌ల్ని క‌దిలించ‌టం ఖాయం. నేడు YCP నేత‌లు ఏం మాట్లాడాలో ఆయ‌న అదే మాట్లాడారు. ప్ర‌జ‌ల్ని అభ్య‌ర్దించే తీరు మెచ్చుకోద‌గింది. ఇప్పుడు YCP నేత‌లు చేప‌ట్టాల్సిన ప్ర‌ధాన‌మైన కార్య‌క్ర‌మంలో ఇది అత్యంత ప్ర‌ధాన‌మైన‌ది.  అధికారంలో వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌నేమిటో నిరూపించుకుంటే YS మాదిరిగా ప్ర‌జ‌ల్లో నిలిచిపోతాడు లేదా ప్ర‌జ‌ల తో తిర‌స్క‌రించ‌బ‌డ‌తారని కూడా నిక్క‌చ్చిగా చెప్పారు.
AP ప్ర‌తిప‌క్ష నేత YS జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌చ్చే నెల 2వ తేదీన చేప‌ట్టబోయే పాద‌యాత్ర‌ను పుర‌స్క‌రించుకుని పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించ‌టం కోసం YS జ‌గ‌న్ పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఆ స‌మావేశంలో పార్టీ MPలు, MLAలు. MLCలు, పార్టీ జిల్లా అధ్య‌క్షులు, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌యక‌ర్త‌ల‌ను. ఇత‌ర ముఖ్య నేత‌ల‌ను ఆహ్వానించారు. ఈ స‌మావేశంలో ఉద్దేశం వివ‌రించి,వారి అభిప్రాయాలు చెప్పాల‌ని జ‌గ‌న్ కోరిన‌ట్లుగా MP రాజ‌మోహ‌న్ రెడ్డి మీడియాకు వివ‌రించారు. ఆ సంద‌ర్బంగా స‌మావేశంలో చ‌ర్చించిన కొన్ని అంశాల‌ను, రాష్ట్రంలో చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హార తీరును గ‌ట్టిగా విమ‌ర్శించారు.
  అయితే ఈ స‌మావేశంలో 46 మంది నేత‌లు వారి వారి అభిప్రాయాలు చెప్పార‌ని, పార్టీని ప‌టిష్టం చేయ‌టానికి లోపాల‌ను అధిగమించి బూత్ స్దాయిలో పార్టీని మ‌రింత‌గా బ‌లోపేతం చేసే చ‌ర్య‌ల‌పై నేత‌లు విలువైన స‌ల‌హాలు ఇచ్చార‌ని వివ‌రించారు. అదే సంద‌ర్భంలో AP లో CM గా ఉన్న చంద్ర‌బాబు నాయుడు ఎంత‌టి ఘ‌నాపాటో కూడా త‌మ‌కు తెలుస‌ని. ఆయ‌న తెలివికి కొద‌వ లేద‌ని కానీ ఆయ‌న ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నార‌ని కూడా దుయ్య‌బ‌ట్టారు. ఇవ‌న్నీ చెబుతూనే ఇంత‌టి చ‌రిత్ర ఉన్న వ్య‌క్తి AP లో CMగా ఉన్నారు కాబ‌ట్టే తాము బూత్ స్ధాయి నుంచే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని ఆయ‌న వివ‌రించారు. పార్టీని ప‌టిష్టం చేయ‌టంతో పాటు లోపాల‌ను అధిగమించే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని కూడా తెలిపారు.