RajakeeyaaluRajakeeyaalu

Saturday, March 24, 2018

ఆ శాఖ అయితే..ఇక ఇంటికేనా…!!

  • March 12, 2018 | UPDATED 13:48 IST Views: 1145
  • Share

 

APలో ఆ శాఖ కు మంత్రిగా ఉంటే అంతే సంగ‌తులు. ఇది సెంటిమెంట్. కాదు…కాదు చ‌రిత్ర చెబుతున్న స‌త్యం. దేవుడి శాఖ‌న చూస్తే..ప‌ద‌వి పోవ‌టం ఏంటి. కానీ, ఇది నిజం. ఇదే జ‌రుగుతూ వ‌స్తోంది. BJP మాణిక్యాల రావు రాజీనామాతో..ప్ర‌స్తుతం తాత్కాలికం గా మంత్రి అచ్చంనాయుడుకి దేవాదాయ శాఖ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా..దేవాదాయ శాఖ నిర్వ‌హించిన వారు మాత్రం ఆ త‌రువాత రాజ‌కీయంగా న‌ష్ట పోతున్నారు. 1995లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నుండి తాజా ప‌రిణామాల వ‌ర‌కు ఇదే పున‌రావృతం అవుతూ వ‌స్తుంది. దీంతో..ఇప్పుడు తాత్కాలికంగా అయినా దేవాదాయ శాఖ బాధ్య‌త‌లు స్వీక‌రించిన మంత్రి అచ్చంనాయుడు రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏంటంటూ అసెంబ్లీ లాబీల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కీ అస‌లు క‌ధ ఏంటంటే…!!

AP క్యాబినెట్‌లో దేవాద‌య శాఖ‌కు ఓ చ‌రిత్ర ఉంది. దేవుడి వ్య‌వ‌హారాలు..గుడి..దేవుడి మాణ్యాలు వంటివి ఈ శాఖ ప‌రిధిలోకి వ‌స్తాయి. పూర్తిగా ఆధ్యాత్మక‌త‌క సంబంధించిన శాఖ‌లో ఓ సెంటిమెంట్ కూడా దాగి ఉంది. ఏ ప్ర‌భుత్వంలో అయినా దేవాదాయ శాఖను ప‌ర్య‌వేక్షించే మంత్రికి ఆ త‌రువాత రాజ‌కీయంగా న‌ష్టం జ‌ర‌గుతుంద‌ని ఈ సెంటిమెంట్ చెబుతున్న విష‌యం. 2004 లో YS తొలి ద‌ఫా ప్ర‌భుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా క‌రీంన‌గ‌ర్ కు చెందిన జవ్వాది ర‌త్న‌క‌ర‌రావు దేవాదాయ శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌రువాత 2009 ఎన్నికల నుండి ఆయ‌న 2009 సాధార‌ణ ఎన్నిక‌లు..2010 ఉప ఎన్నిక‌ల్లోనూ పరాజ‌యం పాలయ్యారు. ఆ త‌రువాత 2009 లో YS రెండో సారి గెలిచిన త‌రువాత గుంటూరు కు చెందిన గాదె వెంక‌ట‌రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా ప‌ని చేసారు. ఆ త‌రువాత ఆయ‌న చ‌ట్ట స‌భ‌ల‌కు ఎన్నిక కాలేదు. కిర‌ణ్ కుమార్ రెడ్డి ముఖ్య‌మంత్రి గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన స‌మ‌యంలో జూప‌ల్లి కృష్ణారావుకు దేవాదాయ శాఖ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే, కొద్ది కాలంలోనే ఆయ‌న తెలంగాణ ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా రాజీనామా చేసి టిఆర్‌య‌స్‌లో చేరారు. ఆ త‌రువాత కాంగ్రెస్ లో PRP విలీనం సంద‌ర్భంగా ఆ పార్టీ నుండి గంటా శ్రీనివాస‌రావు, C రామ‌చంద్ర‌య్య ల‌కు కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌వులు ల‌భించాయి. అందులో C రామ‌చంద్ర‌య్య కు దేవాదాయ శాఖ అప్పగించారు. రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా ఎన్నిక‌ల‌కు ముందే కిర‌ణ్ కుమార్‌రెడ్డి రాజీనామా తో రామ‌చంద్ర‌య్య ప‌ద‌వి సైతం కోల్పోయారు. ఆ త‌రువాత కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న C రామ‌చంద్ర‌య్య‌..ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్నారు.

ఇక‌, 2014 లో APలో TDP అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మిత్ర‌ప‌క్ష‌మైన BJP కి క్యాబినెట్‌లో రెండు స్థానాలు క‌ల్పించారు.అందులో తాడేప‌ల్లి గూడెం నుండి గెలిచిన పైడికొండ‌ల మాణిక్యాల రావుకు దేవాదాయ శాఖ కేటాయించారు. త‌న ప‌ద‌వీ కాలం పూర్తి కాకుండా తాజా రాజకీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసారు. దీంతో..ప్ర‌స్తుతం AP అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతుండ‌టంతో…దేవాదాయ శాఖ ఇన్‌ఛార్జ్‌గా బాధ్య‌త‌ల‌ను అచ్చంనాయుడుకు అప్ప‌గించారు. ఇప్పుడు ఇదే అసెంబ్లీ లాబీల్లో..ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది తాత్కాలిక‌మ‌ని చెబుతున్నా..ఇప్పుడు ప‌రిస్థితుల్లో అంత త్వ‌ర‌గా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగే అవ‌కాశాలు త‌క్క‌వ‌గానే క‌నిపిస్తున్నాయి. దీంతో పాటుగా..ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ పేరుతో అసంతృప్తుల నుండి కొత్త స‌మ‌స్య‌లు తెచ్చుకోవ‌టానికి ముఖ్య‌మంత్రి Cద్దంగా లేర‌ని TDP నేత‌లే వ్యాఖ్యా నిస్తున్నారు. మ‌రి..శాఖ‌ల మార్పు ఉంటుందా అంటే…ఇటువంటి ప‌రిస్థితుల్లో దేవాదాయ శాఖ ను స్వీక‌రించేందుకు ఎవ‌రు ముం దుకొస్తార‌నేది సందేహ‌మే. దీంతో..మ‌రి కొంత కాలం అచ్చంనాయుడుకే దేవాదాయ శాఖ బాధ్య‌త‌లు త‌ప్పేలా లేవు. మ‌రి..గ‌తం నుండి వ‌స్తున్న సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయితే..ప్ర‌భుత్వం లో కీల‌కంగా ఉంటున్న అచ్చంనాయుడు రాజ‌కీయ భ‌విష్య‌త్ పై ఎలాం టి ప్ర‌భావం ప‌డుతుంద‌నేది ఇప్పుడు కీల‌క చ‌ర్చ‌. మ‌రి..రానున్న రోజుల్లో ఈ శాఖ ఎవ‌రి చేతుల్లోకి వెళ్తుందో..ఎటువంటి ప‌రిణా మాలు చోటు చేసుకుంటాయో చూడాలి.